For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాత్రికి రాత్రే చుండ్రును నివారించే ఎఫెక్టివ్ ‘‘జింజర్ హెయిర్ మాస్క్ ’’

సాధారణ జుట్టు సమస్యల్లో చుండ్రు ఒకటి. తల జిడ్డుగా, దురదతో , తలలో నుండి పొట్టు రాలుతుంది. ఇది అన్ని సీజన్స్ లో కంటే వింటర్లో ఎక్కువగా బాధిస్తుంటుంది. చుండ్రును నివారణకు ఎన్నో హోం రెమెడీస్ ను ఉపయోగించి

|

సాధారణ జుట్టు సమస్యల్లో చుండ్రు ఒకటి. తల జిడ్డుగా, దురదతో , తలలో నుండి పొట్టు రాలుతుంది. ఇది అన్ని సీజన్స్ లో కంటే వింటర్లో ఎక్కువగా బాధిస్తుంటుంది. చుండ్రును నివారణకు ఎన్నో హోం రెమెడీస్ ను ఉపయోగించి ఉంటారు. అయితే వీటిలో జింజర్ హెయిర్ మాస్క్ గ్రేట్ గా సహాయపడుతుంది.

అల్లంతో హెయిర్ మాస్క్ వేసుకోవడం వల్ల తలలో ఈస్ట్ ఇన్ఫెక్షన్ డెవలప్ కాకుండా నివారిస్తుంది. అంతే కాదు, ఇది తలలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలిగించకుండా తలలో నేచురల్ పిహెచ్ ను బ్యాలెన్స్ చేస్తుంది. డ్యామేజ్ అయిన జుట్టును రిపేర్ చేస్తుంది. కొత్తగా హెయిర్ ఫోలిసెల్స్ ను ప్రమోట్ చేస్తుంది.

Ginger Hair Mask Recipe To Remove Flaky Dandruff!

చుండ్రును నివారించడంలో జింజర్ ఏవిధంగా ఉపయోగపడుతుందన్న సందేహమా?అల్లంలో ఉండే జింజరోల్ అనే కాంపౌండ్ పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. ఇది చుట్టుకు మరియు తల చర్మం మీద రక్షణ కల్పిస్తుంది. జుట్టుకు డ్యామేజ్ కలిగించే ఫ్రీరాడికల్స్ కు వ్యతిరేఖంగా పోరాడుతుంది.

అల్లంలో ఉండే అమినో యాసిడ్స్, ఫ్యాటీయాసిడ్స్ మరియు మెగ్నీషియం, తలకు తగినంత పోషణను అందిస్తుంది, తల పూర్తిగా డ్రైగా మారకుండా నివారిస్తుంది. జుట్టు రాలకుండా, జుట్టు పల్చగా మారకుండా సహాయపడుతుంది.

అల్లంలో ఉండే ఔషధగుణాలు , మైక్రోబయల్ లక్షణాలు ఉండటం వల్ల ఈస్ట్ పెరగకుండా నివారిస్తుంది. దాంతో ఇన్ఫెక్షన్ మరియు దురద తగ్గుతుంది. చుండ్రుకు కారణమయ్యే బ్యాక్టీరియాను కూడా తొలగిస్తుంది.

అలన్నింటికి మించీ, అల్లంతో హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల విటమిన్స్, మినిరల్స్ జుట్టుకు మంచి షైనింగ్, సిల్కీనెస్ అందిస్తుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు మెరుపు ఏ మాత్రం తగ్గకుండా చేస్తుంది. మరి అల్లం హెయిర్ ప్యాక్ వల్ల జుట్టుకు ఎలాంటి ప్రయోజనాలను పొందవచ్చు? జింజర్ హెయిర్ ప్యాక్ ను ఏవిధంగా వేసుకోవచ్చు తెలుసుకుందాం..

స్టెప్ # 1

స్టెప్ # 1

మొదట అల్లంకు తొక్క తొలగించి శుభ్రం చేసి, చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీన్ని మెత్తగా పేస్ట్ చేసి, ఒక పల్చటి కాటన్ వస్త్రంలో పేస్ట్ వేసి రసాన్ని పిండాలి. రసం అల్లం రసం వేరుచేసి పెట్టుకోవాలి. హెయిర్ ఫాల్ మాస్క్ కోసం కనీసం రెండు టీస్పూన్ల జింజర్ జ్యూస్ అవసరం అవుతుంది.

స్టెప్ # 2

స్టెప్ # 2

రెగ్యులర్ గా తలకు అప్లై చేసే మన్నికైన కొబ్బరి నూనెను 30 సెకండ్స్ వేడి చేయాలి. కొబ్బరి నూనెలో లౌరిక్ యాసిడ్ ఉంటుంది. ఇది తలలో రక్తప్రసరణను పెంచుతుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కొబ్బరి నూనెలో జింజర్ జ్యూస్ మిక్స్ చేయాలి. ఈరెండూ పదార్థాలు బాగా మిక్స్ అయ్యే వరకూ మిక్స్ చేసి పెట్టుకోవాలి.

స్టెప్ # 3

స్టెప్ # 3

అలాగే ఈ మిశ్రమంలో మీకు నచ్చిన ఆరోమా ఆయిల్ బాదం లేదా రోజ్మెర్రీ ఆయిల్ ను మిక్స్ చేయాలి. ఈ నూనెల్లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ తలలోకి డీప్ గా చొచ్చుకుపోతాయి. జుట్టును సాప్ట్ గా మార్చడానికి తగిన పోషకాలను అందిస్తుంది. ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు తెల్లబడకుండా ఉంటుంది. తెల్లజుట్టును నివారిస్తుంది.

స్టెప్ # 4

స్టెప్ # 4

ఈ మొత్తం మిశ్రమంలో నిమ్మరసం కూడా మిక్స్ చేస్తే రిజల్ట్ మరింత ఎఫెక్టివ్ గా ఉంటుంది. నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ తలను శుభ్రం చేస్తుంది. జుట్టుకు తగినంత షైనింగ్ ను అందిస్తుంది. జుట్టు జిడ్డుగా మారకుండా నివారిస్తుంది.

స్టెప్ # 5

స్టెప్ # 5

తర్వాత దువ్వెనతో తలను చిక్కులేకుండా దువ్వాలి. జుట్టు మరీ డ్రైగా ఉంటే, రెగ్యులర్ గా తలకు అప్లై చేసే నూనె తీసుకుని తలకు అప్లై చేసి తల దువ్వాలి. డ్రై హెయిర్ వల్ల ఏర్పడే చిక్కును, ముడులను సులభంగా తొలగిస్తుంది. జుట్టు బ్రేక్ లేదా డ్యామేజ్ కాకుండా ఉంటుంది.

స్టెప్ # 6

స్టెప్ # 6

ఇప్పుడు వెంట్రుకలను చిన్న చిన్న పార్టీషియన్స్ గా విడదీసుకుని, ఈ మాస్క్ ను జుట్టు పొడవునా, తలలో నుండి అప్లై చేయాలి. లేదా తలను పూర్తిగా క్రిందివి వంచి ముఖం మీద ఈ మాస్క్ పడకుండా అప్లై చేసుకోవచ్చు.

స్టెప్ # 7

స్టెప్ # 7

ఈ మాస్క్ ను తలకు అప్లై చేస్తూనే చేతి ముని వేళ్ళతో 10 నుండి 15 నిముషాలు మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. తలలో న్యూట్రీషియన్స్ అబ్సార్బ్ అయ్యేందుకు సహాయపడుతుంది. ఈ హెయిర్ మాస్క్ గ్రేట్ గా సహాయపడుతుంది. కొద్దిగా మంటగా ఉన్నా. కొద్దిసేపటి తర్వాత నార్మల్ గా ఉంంటుంది. ఎక్కువగా దురద లేద మంట కలిగితే కొబ్బరి నూనె ఎక్కువగా మిక్స్ చేయాలి.

స్టెప్ # 8

స్టెప్ # 8

తలలో జుట్టుకు పోషణ అందివ్వడానికి జింజర్ హెయిర్ మాస్క్ గ్రేట్ గా సహాయపడుతుంది. రాత్రుల్లో అప్లై చేస్తే మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఉదయం నిద్రలేచి తలకు షాంపు, కండీషన్ తో తలస్నానం చేస్తే సరిపోతుంది.

స్టెప్ # 9

స్టెప్ # 9

తలకు షాంపు చేసిన తర్వాత పొడి కాటన్ టవల్ తో తలను తుడిచి తడి ఆర్పాలి. స్మూత్ గా ఉండే కాటన్ టవల్ ఉపయోగించడం వల్ల జుట్టు డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది.

స్టెప్ # 10

స్టెప్ # 10

డ్రైయ్యర్ తో తల ఆర్పాలనుకున్నప్పుడు డ్రయ్యర్ ను జుట్టుకు దూరంగా ఉంచాలి. డ్రయ్యర్ ను 6 అంగులాల దూరంలో ఉంచాలి. ఒకేదగ్గర ఎక్కువ సేపే డ్రయ్యర్ ను ఉంచకూడదు.

సూచిన:

సూచిన:

జింజర్ హెయిర్ మాస్క్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, చుండ్రును నివారిస్తుంది. జుట్టుకు తగిన షైనింగ్ ను అందిస్తుంది. ఎఫెక్టివ్ రిజల్ట్ పొందాలంటే, వారానికొకసారి ఈ జింజర్ హెయిర్ మాస్క్ ను ట్రై చెయ్యండి..

English summary

Ginger Hair Mask Recipe To Remove Flaky Dandruff!

Do you have flaky dandruff that never budges? Is your scalp itchy, scaly and greasy? Then you need this ginger hair mask!It does more than break down the yeast buildup on your scalp. It will cleanse your scalp without disturbing its natural pH balance.
Desktop Bottom Promotion