For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టు చివర్లు చిట్లకుండా నివారించడానికి ఆయుర్వేదిక్ రెమెడీస్

By Super Admin
|

ప్రస్తుత రోజుల్లో చివర్లు చిట్లిన శిరోజాలు చాలామందిని వేధించే సాధారణ సమస్య. జుట్టు చివర్లు చిట్లిపోవడానికి అనేక కారణాలున్నాయి..ముఖ్యంగా వాతావరణం అధిక ఉష్ణోగ్రత మరియు కాలుష్యం వల్ల జుట్టు తొందరగా పొడిబారి చిట్లిపోతుంది. వీటితో పాటు కెమికల్ ప్రొడక్ట్స్, హాట్ స్టైలింగ్ టూల్స్, ఎప్పుడూ తలస్నానం చేయడం, తక్కువ నాణ్యత గల ఉత్పత్తుల వినియోగం, ఇవన్నీ కూడా జుట్టు చివర్లు చిట్లిపోవడానికి ప్రధాన కారణంగా ఉన్నాయి. దాంతో వాటి ఎదుగుదల సరిగా ఉండదు. అంతేకాకుండా జుట్టు బలహీనంగా మారిపోతుంది. శిరోజాలు నిర్జీవంగా మారి రాలిపోతాయి.

 Herbal Remedies To Treat Split Ends

జుట్టు చిట్లడానికి కారణం ఏదైనా కావచ్చు, వెంటనే సరైన జాగ్రతలు లేదా నిర్వహాణ, లేదా చికిత్స తీసుకోకపోతే నిజంగా చాలా అసహ్యాంగా తయారువుతుంది. మీ జుట్టు అసహ్యంగా మరియు డ్యామేజ్ అయ్యి కనిపిస్తుంది. ఈ సమస్యను నివారించాలంటే కొన్ని కెమికల్ ప్రొడక్ట్స్ మార్కెట్లో లభ్యం అయినా, అవి తాత్కాలిని పరిష్కారం పొందవచ్చు. కానీ, నష్టం ఇంకా జరుగుతూనే ఉంటుంది.

అలాంటి ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే, ఇక్కడ కొన్ని హోం రెమడీస్ ఉన్నాయి. ఇవి చిట్లిన జుట్టుతో పోరాడటమే కాదు, ఎటువంటి కెమికల్ ట్రీట్మెంట్స్ లేకుండానే, జుట్టుకు అవసరం అయ్యే పోషణను కూడా అంధిస్తుంది. మరి చిట్లిన జుట్టును నివారించుకోవడానికి ఉపయోగపడే, సహాయపడే కొన్ని కొన్నినేచురల్ ఆయుర్వేదిక్ రెమెడీ మీద ఓ కన్నేయండి. వీటిలో ఎలాంటి టాక్సిన్స్ ఉండవు, 99శాతం ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. అదెలాగో తెలుసుకుందాం..

 Herbal Remedies To Treat Split Ends

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనెలో యాంటీ ఆక్సిడెంట్స్, అధికంగా ఉంటాయి. తలలో పిహెచ్ లెవల్స్ ను రీస్టోర్ చేస్తుంది. అలాగే తలలో చర్మ రంద్రాలను శుభ్రం చేసి,క్యూటికల్స్ ను క్లోజ్ చేస్తుంది.

స్టెప్ 1:

మీ జుట్టుకు అవసరమైనంత కొబ్బరి నూనెను తీసుకుని, వేడి చేయాలి. తర్వాత సహజంగానే చల్లారనివ్వాలి.

 Herbal Remedies To Treat Split Ends

స్టెప్ 2:

జుట్టుకు కొబ్బరి నూనె :

ఇప్పుడు ఈ వేడి చేసిన నూనెను తలకు అప్లై చేసి మసాజ్ చేయాలి. అరగంట తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి

 Herbal Remedies To Treat Split Ends

తేనె

తేనె నేచురల్ పదర్థాం . ఇందులో విటమిన్ సి, ఇతర పోషకాలుంటాయి. ఇది డ్యామేజ్ అయిన జుట్టును రిపేర్ చేసి, జుట్టు చిట్లకుండా పోషణను అందిస్తుంది

స్టెప్ 1:

రెండు టేబుల్ స్పూన్ల తేనె తీసుకుని, ఒక కప్పు వేడినీళ్ళలో మిక్స్ చేసి , షాంపు చేసిన తర్వాత తలకు అప్లై చేయాలి.

 Herbal Remedies To Treat Split Ends
స్టెప్ 2:

జుట్టుకు తేనె అప్లై చేయడం వల్ల ఇది నేచురల్ కండీషనర్ గా పనిచేస్తుంది. జుట్టు చివర్లు చిట్టకుండా స్మూత్ గా మార్చుతుంది. అరగంట తర్వాత శుభ్రం చేసుకోవచ్చు.

నెయ్యి

నెయ్యిలో స్ట్రాంగ్ మాయిశ్చరైజింగ్ లక్షణాలున్నాయి. ఇది చిట్లిన జుట్టును నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

 Herbal Remedies To Treat Split Ends

స్టెప్ 1

నెయ్యిని కరిగించి చల్లార్చి జుట్టు చివర్లకు అప్లై చేయాలి. లేదా నేరుగా అప్లై చేయవచ్చు .

 Herbal Remedies To Treat Split Ends
స్టెప్ 2:

తలకు నెయ్యి అప్లై చేసిన ఒక గంట తర్వాత మైల్డ్ షాంపుతో తలస్నానం చేయాలి.

నేచురల్ గా స్ల్పిట్స్ ను తొలగించే నేచురల్ రెమెడీస్ మీకేమైనా తెలిసుంటే మాతో షేర్ చేసుకోవచ్చు..

English summary

Herbal Remedies To Treat Split Ends

The first possible sign that your hair is damaged is split ends. The faded, rough, fraying edges of your hair says it all!At the first sign of dry ends, we automatically pick up the scissors to snip it off, which only serves to shorten the hair length. What you need instead are herbal remedies for split ends.
Desktop Bottom Promotion