For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్టైలిష్ గా జుట్టు మెరుస్తుండాలంటే : కిచెన్ రెమెడీస్ తో కలరింగ్ ...

|

సాధారణంగా కొంత మంది జుట్టు చూస్తుంటే చాలా అందంగా కలర్ ఫుల్ గా ఉంటుంది. అందుకు వారు తీసుకొనే హెయిర్ ట్రీట్మెంట్సే అని చెప్పవచ్చు. హేయిర్ ట్రీట్మెంట్ వల్ల ప్రస్తుతం చూడటానికి బాగున్నా, భవిష్యత్తులో అనేక జుట్టు సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. కాబట్టి, హెయిర్ స్పా, హెయిర్ ట్రీట్మెంట్స్ కు ప్రత్యామ్నాయంగా ఇంట్లోనే కొన్ని నేచురల్ పదార్థాలను జుట్టుకు నేచురల్ కలరింగ్ అందివ్వొచ్చని చాలా మందికి తెలియదు. అంతే కాదు ఇంట్లోనే ఈ నేచురల్ కలరింగ్స్ తయారుచేసుకోవడం చాలా సులభం మరియు చౌకైనవి కూడా.,.. అందుకు మీరు చేయాల్సిందల్లా కేవలం టీ ఆకులు, లేదా పౌడర్, హెర్బ్స్ లేదా స్పైసీలు నీటిలో వేసి, ఆ నీటిని బాయిల్ చేస్తే చాలు. ఆనీటిని తలారా పోసుకుంటే చాలు మీ జుట్టుకు అందమైన రంగును సొంతం చేసుకోవచ్చు.

హెయిర్ ను డీప్ గా ...రిచ్ గా.. కనబడేలా చేసే హెయిర్ మాస్క్స్

క్రీమీ హెయిర్ డైస్ కాకుండా, ఈ హేర్బల్ హెయిర్ రెజెస్ జుట్టుకు నేచురల్ కలర్ ను అందిస్తాయి . కాబట్టి, వీటికి ప్రతి ఒక్కరూ ఆకర్షితులవుతారు . కాబట్టి, ప్రతి ఒక్కరూ ఈ హేర్బల్ వాటర్ ను షాంపుతో తలస్నానం చేసిన ప్రతి సారి వాష్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

జుట్టు కలరింగ్ కోసం మీరు ఈ హెయిర్ డై కోసం ఎలాంటి ఎక్స్ ట్రా ఎఫోర్ట్ తీసుకోవల్సిన అవసరం లేదు . ఈ హెయిర్ డైలను ఉపయోగిస్తే చాలు. తలస్నానం చేసిన వెంటనే వీటిని ఉపయోగించడం మంచిది. ఈ హేర్బల్ వాటర్ కేవలం జుట్టుకు రంగు మాత్రమే కాదు, జుట్టును ఆరోగ్యంగా మరియు షైనీతో ఉంచి, జుట్టు రాలడం అరికడుతుంది.

మంచి హెయిర్ కలర్ పొందడానికి 12 బెస్ట్ హోం రెమెడీస్

కెమికల్ హెయిర్ డైల వల్ల వివిధ రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి . అంతే కాదు, ముందు ముందు వీటి వల్ల జుట్టు రాలడానికి కారణం అవుతుంది . ఇంకా దుస్తుల మీద మరకలు ఏర్పడేలా చేస్తాయి. వీటిని జుట్టుకు అప్లై చేయాలంటే కూడా కష్టం. కాబట్టి ఈ కెమికల్ హెయిర్ డైలకు స్వస్తి చెప్పి, నేచురల్ హెయిర్ రిన్సెస్ ను ప్రారంభించి ప్రతి హెయిర్ వాష్ తర్వాత వీటిని ఉపయోగించడం వల్ల జుట్టు డార్క్ మరియు డీప్ బ్రౌన్ కలర్ ను కలిగి ఉంటాయి. ఈ నేచురల్ హెర్బల్ వాటర్ వల్ల గ్రే హెయిర్ పర్మనెంట్ గా నివారించబడుతుంది. మరి ఎలా తయారుచేసుకోవాలి, ఎలా ఉపయోగించాలో ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకుందాం....

బ్లాక్ టీ రిన్స్ :

బ్లాక్ టీ రిన్స్ :

ఇది మీ హెయిర్ కలర్ ను డార్క్ చేస్తుంది. 3చెంచాల బ్లాక్ టీని1గంటసేపు ఉడికించాలి . స్టౌ ఆప్ చేసి చల్లార్చాలి. తర్వాత షాంపుతో తలస్నానం చేసిన తర్వాత ఈ నీటిని ఒక మగ్ వాటర్ లోమిక్స్ చేసి తలారా పోసుకోవాలి . తలస్నానం పూర్తి అయిన తర్వాత ఫైనల్ రిన్స్ బ్లాక్ టీ ఇవ్వడం 10 నిముషాల తర్వాత తరిగి ప్లెయిన్ వాటర్ ను పోసుకోవాలి.

వాల్ నట్ రిన్స్:

వాల్ నట్ రిన్స్:

ఇది జుట్టుకు బర్గుండే కలర్ ను అందిస్తుంది. వాల్ నట్ హుల్స్ ను పొడి చేసి అందులో 4కప్పుల నీరు పోసి, రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయం షాంపుతో తలస్నానం చేసిన తర్వాత ఈ వాల్ నట్ వాటర్ ను తలారా సోపుకోవాలి. షాంపు చేసిన తర్వాత పోసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

 దాల్చిన రెక్క మరియు లవంగాలు:

దాల్చిన రెక్క మరియు లవంగాలు:

1చెంచా దాల్చిన చెక్క మరియు 1చెంచా లవంగాలు పొడిని ఒక బౌల్ నీటిలో వేసి బాగా మిరిగించాలి. తర్వాత క్రిందికి దింపుకొని చల్లార్చాలి,. షాంపుతో తలస్నానం చేసిన తర్వాత చివరగా ఈ నీటిని తలారాపోసుకోవాలి . ఇది జుట్టుకు డీఫ్ కండీషర్ అందివ్వడంతో పాటు డీప్ బ్రౌన్ కలర్ జుట్టును అందిస్తుంది.

చమోమెలీ అండ్ క్యాలెండులా:

చమోమెలీ అండ్ క్యాలెండులా:

అరకప్పుు ఎండిన చమోమైల్ ఫ్లవర్, 1/2కప్పు ఎండిన క్యాలెండులా ఫ్లర్ ను ఒక లీటర్ నీటిలో వేసి, ఈనీటిని అరగంట పాటు మరిగించి తర్వాత చల్లార్చాలి. ఈ నీటిని తలస్నానం పూర్తైన తర్వాత తలారా పోసుకొని అరగంట అలాగే ఉంచి తర్వాత మంచి నీటితో కడిగేసుకోవాలి.

సేజ్ అండ్ రోజ్మెరీ:

సేజ్ అండ్ రోజ్మెరీ:

ఈ వాటర్ మీ జుట్టు రంగును డార్క్ గా మార్చేస్తుంది . 2కప్పులు సేజ్, 1/2కప్పు రోజ్మెర్రీ మరిు 1 చెంచా ఆపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి అరగంట పాటు బాయిల్ చేయాలి. తర్వాత చల్లారనివ్వాలి .ఈ నీటిని తలస్నానం పూర్తైన తర్వాత తలారా పోసుకొని 15నిముషాల అలాగే ఉంచి తర్వాత మంచి నీటితో కడిగేసుకోవాలి.

రోజ్ హిప్ నేచురల్ హెయిర్ డై:

రోజ్ హిప్ నేచురల్ హెయిర్ డై:

2 చెంచాల హైబిస్కస్ మరియు రోజ్ హిప్ ను 2 కప్పుల నీటిలో వేసి బాగా మరిగించాలి. నీటిని తర్వాత చల్లారనివ్వాలి .ఈ నీటిని తలస్నానం పూర్తైన తర్వాత తలారా పోసుకొని 10 నిముషాల అలాగే ఉంచి తర్వాత మంచి నీటితో కడిగేసుకోవాలి.

English summary

How To Colour Your Hair With Simple Kitchen Remedies

You can easily make your hair colour look deep brown or dark burgundy by using these simple rinses that you can make at home. They are easy to make and are cost-effective. All you need to do is to just boil the tea leaves or powder, herbs or spices in water and rinse your hair in it.
Story first published: Monday, January 25, 2016, 16:44 [IST]
Desktop Bottom Promotion