For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేపనూనె, కొబ్బరినూనె కలిపి జుట్టుకి పట్టిస్తే.. కలిగే బెన్ఫిట్స్..!!

వేపలో బలమైన యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇవి చుండ్రుని నివారించి.. ర్యాషన్ ని తగ్గిస్తాయి. అలాగే ఇన్ఫెక్షన్ కి కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగిస్తాయి.

By Swathi
|

వేప అనగానే చేదుగా ఉంటుందని చాలా మంది ఇష్టపడరు. కానీ.. వేప చేసే మేలు అంతా ఇంతా కాదు. ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా చాలా పవర్ ఫుల్ గా పనిచేస్తుంది. జుట్టు సంరక్షణలో చక్కగా పనిచేసే పవర్ ఫుల్ రెమెడీ వేప నూనె.

neem oil

వేప నూనెను ఉపయోగించే పద్ధతులు కూడా చాలా ఉన్నాయి. చర్మ సమస్యలకు, జుట్టు సంరక్షణకు వేప నూనెను ఉపయోగిస్తే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. వేప నూనె మార్కెట్ లో కూడా అందుబాటులో ఉంటుంది.

స్కాల్ప్ లో ర్యాషెస్, చుండ్రు నివారణ, జుట్టు రాలడం వంటి రకరకాల హెయిర్ ప్రాబ్లమ్స్ ని.. వేప నూనె ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. అయితే వేప నూనెను డైరెక్ట్ గా జుట్టుకి అప్లై చేయకూడదు. ఇది చాలా మందంగా ఉంటుంది కాబట్టి.. దీన్ని ఇతర పదార్థాలతో మిక్స్ చేసి.. జుట్టుకి పట్టించాలి. లేదంటే.. జుట్టు డ్యామేజ్ అవుతుంది.

వేపలో బలమైన యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇవి చుండ్రుని నివారించి.. ర్యాషన్ ని తగ్గిస్తాయి. అలాగే ఇన్ఫెక్షన్ కి కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగించి.. స్కాల్ప్ లో పీహెచ్ ని బ్యాలెన్స్ చేస్తాయి.

అలాగే వేపలో ట్రైగ్లిసెరైడ్ ఉంటుంది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. జుట్టుని సిల్కీగా, స్ట్రాంగ్ గా, షైనీగా మారుస్తుంది. మరి.. వేప నూనెను ఎలా ఉపయోగించడం వల్ల.. అనేక జుట్టు సమస్యలు నివారించి.. జుట్టు పెరుగుదలను మెరుగుపరుచుకోవచ్చు.

జుట్టు పెరుగుదలకు

జుట్టు పెరుగుదలకు

అరకప్పు కొబ్బరినూనె, 1టేబుల్ స్పూన్ వేప నూనె, 10 చుక్కల బాదాం నూనె కలపాలి. అన్నింటినీ బాగా మిక్స్ చేసి.. సన్ననిమంటపై వేడి చేయాలి. రూం టెంపరేచర్ లోనే చల్లారనివ్వాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు జుట్టుకి మసాజ్ చేయాలి. గంట తర్వాత షాంపూ, కండిషనర్ ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి.

చుండ్రు నివారించడానికి

చుండ్రు నివారించడానికి

ఒక టేబుల్ స్పూన్ ఉసిరి పొడి, 1 టేబుల్ స్పూన్ మెంతిపొడి, 10 చుక్కల టీట్రీ ఆయిల్, 1టీస్పూన్ నిమ్మరసం. తీసుకోవాలి. కొన్ని నీళ్లు కలిపి.. అన్నింటినీ పేస్ట్ చేసుకోవాలి. ముందుగా జుట్టుని తడి చేసుకుని ఈ ప్యాక్ అప్లై చేయాలి. గంట తర్వాత.. మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారినికి రెండుసార్లు చేస్తే.. చుండ్రు తగ్గిపోతుంది.

పొడిజుట్టుకి

పొడిజుట్టుకి

2టేబుల్ స్పూన్ల వేప ఆయిల్ ని మీ షాంపూలో మిక్స్ చేసుకోవాలి. ఉపయోగించడానికి ముందు బాగా షేక్ చేయాలి. ప్రతి సారీ ఉపయోగిస్తూ ఉంటే.. జుట్టు స్మూత్ గా, సిల్కీగా మారుతుంది.

స్కాల్ప్ లో దురద

స్కాల్ప్ లో దురద

4 నుంచి 5 చుక్కల వేప నూనెను, ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ లో కలపాలి. దీన్ని స్కాల్ప్ పై మసాజ్ చేయాలి. 15 నిమిషాల తర్వాత.. మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకోవాలి.

కండిషనర్

కండిషనర్

ఒక గుడ్డులోని తెల్లసొన, 20 చుక్కల వేప నూనె కలపాలి. రెండింటినీ బాగా మిక్స్ చేయాలి. ఈ మాస్క్ ని జుట్టుకి పట్టించాలి. బాగా ఆరిన తర్వాత.. షాంపూ, కండిషనర్ ఉపయోగించి స్నానం చేయాలి.

పేలు నివారించడానికి

పేలు నివారించడానికి

వేప నూనెను నీటిలో కలపాలి. 1టేబుల్ స్పూన్ వేప నూనెను, నీటిని సమానంగా కలిపి.. కాటన్ బాల్ ఉపయోగించి.. స్కాల్ప్ కి పట్టించాలి. గంట తర్వాత.. పేల దువ్వెనతో దువ్వితే.. తలలో ఉన్న పేలన్నీ వచ్చేస్తాయి. తర్వాత.. షాంపూతో స్నానం చేయాలి.

జుట్టు రాలడం

జుట్టు రాలడం

వేప ఆకులను 15 నిమిషాలు నీటిలో నానబెట్టాలి. తర్వాత మెత్తటిపేస్ట్ చేసుకోవాలి. తర్వాత కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ కలపాలి. ముందుగా జుట్టుపై కొన్ని నీటిని చిలకరించి.. కుదుళ్ల నుంచి అప్లై చేయాలి. గంటసేపటి తర్వాత.. షాంపూతో శుభ్రం చేసుకోవాలి.

English summary

How To Guide : Easy Ways To Use Neem Oil On Scalp

How To Guide : Easy Ways To Use Neem Oil On Scalp. From cleansing your scalp of flaky dandruff to boosting hair growth, there is much more that neem oil can do. Here are some ways to use neem oil on hair.
Desktop Bottom Promotion