For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టుకి వేసిన రంగు ఎక్కువ కాలం ఉండాలంటే ఏం చేయాలి?

|

ఈరోజుల్లో పాతిక సంవత్సరాల యు వతీ మొదలు పండు ముదుసలి సైతం తమ సౌందర్యాన్ని పెంచుకోవడాని కి ఆసక్తి చూపుతున్నారు. దానికి గాను వారు ఎంచుకుంటున్న అద్భుత మార్గం హెయిర్ కలరింగ్. జుట్టు రకాలను బట్టి టెక్చ్సర్‌ని దృష్టిలో పెట్టుకుని పలు అంతర్జాతీయ కంపెనీలు మార్కెట్లో వివిధ హెయిర్ కలర్స్‌ను విడుదల చేస్తున్నాయి. ఒకప్పుడు హెయిర్ కలర్ అంటే కేవలం తెలుపు జుట్టును నలుపు చేయడానికి మాత్రమే అనుకునేవారు. కానీ ఇప్పుడు నలుపుతోపాటు ఎన్నో రంగులు మార్కెట్లో లభిస్తున్నాయి. హెయిర్ కలర్స్‌లో బ్రౌన్, గోల్డెన్ ,మెరూన్, పర్పుల్, హనీ బ్రౌన్, చెర్రీ ఇలా అనేక రంగులున్నాయి.

పురుషులో జుట్టురాలడం అరికట్టేందుకు పరిష్కారం..!

నేడు యువతీ, యువకులు తల వెంట్రుకలకు రంగులు వేసుకోవడాన్ని ఫ్యాషన్‌ ట్రెండ్‌గా భావిస్తున్నారు. సాధారణంగా తెల్లబడ్డ జుట్టుకు నల్లటి రంగు వేసుకుంటారు అందరూ. కానీ యూత్‌ అయితే తమ నల్లటి కురులకు వివిధ రకాల ఆకర్షణీయమైన హెయిర్‌ కలర్స్‌ను అద్దడం నేటి ఫ్యాషన్‌గా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో హెయిర్‌ స్టైలిస్ట్‌లు, హెయిర్‌ డ్రెస్సర్లు నేడు యువతీ యువకుల కోసం వెరైటీ హెయిర్‌కలర్స్‌ను అందుబాటులోకి తెస్తున్నారు.

ముఖ్యంగా జుట్టుకి వేసిన రంగు తొందరగా పోవటమే కాకుండా ఎక్కువ కాలం ఉండదు, జుట్టుకి వేసిన రంగు ఎక్కువ కాలం ఉండటం ఎలా?

గ్రే హెయిర్ నివారించడానికి అవసరం అయ్యే ఉత్తమ హో రెమెడీస్

జుట్టుకి రంగు వేసిన తరువాత, కేశాలలోని రేణువులు వేసిన రంగుకి బానిసలుగా మారిపోతాయి. కానీ నిజానికి, రంగుని తొలగించే పదార్థాలతో కడగటం వల్ల హెయిర్ షాఫ్ట్ క్యుటికిల్స్ నుండి వేసిన రంగు రేణువులు త్రోలగిపోతాయి. H2O (నీరు) అనేది కేశాల నుండి రంగును తొలగించే పెద్ద కారకము, అలా అని జుట్టుని నీటితో కడగకుండా ఉండలేము. కొన్ని పద్దతులు అనుసరించటం వల్ల జుట్టు నుండి రంగుకి సంబంధించిన రేణువులు దూరం అయిపోవటాన్ని తగ్గించవచ్చు. వీటిని అనుసరించటం వల్ల ఏ సమస్య లేకుండా కేశాలను ఇష్టం ఉన్న రంగుతో ప్రకాశింపచేసుకోవచ్చు.

ప్రొటెక్టివ్ షాంపూ:

ప్రొటెక్టివ్ షాంపూ:

జుట్టుకు ఏదైనా రంగు వేసుకొన్నప్పుడు అది ఎక్కువ కాలం నిలవాలంటే కలర్ ప్రొటెక్టివ్ షాంపూ వాడాలి. కలరింగ్ చేసాక కేశాలకు హార్డ్ షాంపూ, యాంటీ డేండ్రఫ్ షాంపూలను వాడకూడదు. రసాయనాలు లేని షాంపూలు ఎంచుకోవాలి. ముఖ్యంగా సల్ఫేట్ లేకుండా చూసుకోవాలి. లేదంటే సల్ఫేట్ వల్ల రంగు త్వరగా పోతుంది.

కండీషనర్:

కండీషనర్:

జుట్టుకు షాపూ చేయించిన తర్వాత కండీషనర్ తప్పక వాడండి దీంతో జుట్టు మృదువుగా మారి మెరుస్తుంటుంది. ప్రొటీన్లు అధికంగా ఉండే కండిషనర్లనే ఎంచుకోవాలి. ఇవి రంగు కోల్పోకుండా చూడటమే కాదు. జుట్టుకు బలన్నిస్తాయి. మృదువుగా మారుస్తాయి.

 హెయిర్ బ్లో వాడకూడదు:

హెయిర్ బ్లో వాడకూడదు:

కలరింగ్ తర్వాత కేశఆలు శుభ్రపరిచినప్పుడు జుట్టు ఆరడానికి బ్లోడ్రై వాడకూడదు. దాంతో జుట్టు పొడిబారుతుంది. కృత్రిమ రంగుల్ని వాడుతున్నప్పుడు డ్రయర్‌కు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం.

 హెయిర్‌ప్యాక్

హెయిర్‌ప్యాక్

రంగు వేసుకునేటప్పుడు జుట్టుకు హాని జరగకుండా ఆరోగ్యంగా ఉండే హెయిర్‌ప్యాక్ వేసుకుంటే మంచిది.

తలస్నానం:

తలస్నానం:

అలాగే తరచూ తలస్నానం చేయడం కూడా సరికాదు. వారంలో రెండుసార్లకు మించి తలంటుకోకపోవడం మేలు.

తలస్నానం చేయడానికి ముందు తప్పనిసరిగా కొబ్బరినూనె రాసుకోవాలి.

తలస్నానం చేయడానికి ముందు తప్పనిసరిగా కొబ్బరినూనె రాసుకోవాలి.

తలస్నానం చేయడానికి ముందు తప్పనిసరిగా కొబ్బరినూనె రాసుకోవాలి. ఇది జుట్టుకు రంగు పట్టి ఉండేలా తోడ్పడుతుంది. వారంలో ఒకటి రెండు సార్లు నూనె రాస్తే జుట్టు మృదువుగా మారి, జుట్టురాలడాన్ని అరికడుతుంది.

 హెయిర్ స్పా ట్రీట్ మెంట్

హెయిర్ స్పా ట్రీట్ మెంట్

వారానికి ఒకసారి హెయిర్ స్పా ట్రీట్ మెంట్ తీసుకుంటే కలర్ ఎక్కువకాలం నిలచి ఉంటుంది. జుట్టుకు కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

సూర్యరశ్మికి దూరంగా ఉండటం

సూర్యరశ్మికి దూరంగా ఉండటం

తొందరగా జుట్టు రంగు పోవటానికి సూర్యరశ్మి కూడా ఒక కారణం. సూర్యరశ్మి వల్ల చర్మమే కాకుండా, జుట్టు కూడా పాడవుతుంది. మీరు ఎక్కువ సమయం ఎండలో గడపడము వల్ల మీ వెంట్రుకలు పొడి బారటమే కాకుండా, మీ కేశాల యొక్క రంగుని కూడా త్రోలగిస్తుంది. సూర్యరశ్మి నుండి మీ చర్మాన్ని సురక్షితంగా ఉంచుకోటానికి ఏ విధంగా అయితే లోషన్స్'ని వాడతారో, టోపీ, హ్యాట్ వంటి వాటిని ధరించి మీ కేశాలను సూర్యరశ్మి నుండి కాపాడుకోండి.

క్లోరిన్ వాటర్ కు దూరంగా

క్లోరిన్ వాటర్ కు దూరంగా

తప్పకుండా దీని నుండి జాగ్రత్తగా ఉండాలి. క్లోరిన్ జుట్టుని పాడుచేస్తుంది ఇది జుట్టుకి వేసే రంగు కాదు. ప్రతిసారి స్విమ్మింగ్ పూల్'లో దుకేపుడు స్విమ్మింగ్ క్యాప్'లను ధరించటం వల్ల క్లోరిన్ స్త్రిప్స్ నుండి తప్పించుకోవచ్చు, కేప్ ధరించక పోవటం వల్ల క్లోరిన్ స్ట్రిప్ జుట్టు రంగుని త్వరగా తొలగించేస్తుంది.

హెయిర్ సీరమ్

హెయిర్ సీరమ్

జుట్టు పొడిబారి, చిట్లిపోయినట్లు ఉంటే హెయిర్ సీరమ్ వాడితే ఉపయోగం ఉంటుంది. జుట్టు స్వభావం తెలుసుకోకుండా మీకు తోచినట్లు కలర్ వాడితే వెంట్రుకలకు హాని కలుగుతుంది. కాబట్టి నిపుణులను సంప్రదించాకే అవసరాన్ని బట్టి కలరింగ్ చేయించుకోండి. రంగులు తరచు మార్చాలనుకునే వారు నిత్యం జుట్టు పొడిగా ఉండేలా చేసుకోవటం ఎంత ముఖ్యమో... వాడుతున్న రంగులు మీకు పడుతున్నాయా? లేదా? అన్నది గమనించడం కూడా అంతే ముఖ్యం

English summary

How To Protect Hair Colour From Fading

Coloring the hair is not a new thing, but using multiple colors is definitely in fashion. We often come across women coloring their hair from red to blue shades. Once we colour the hair, we have take measures to retain the colour as hair tend to lose its colour eventually. And we can't afford to colour our hair again and again, as it may damage the texture of the hair and could even lead to dandruff and other scalp problems.
Story first published: Thursday, February 4, 2016, 18:24 [IST]
Desktop Bottom Promotion