For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టు పలుచబడి, తెల్లగా మారుతోందా..? కొబ్బరినూనె సొల్యూషన్..!

కొబ్బరినూనెలో ఉండే.. పోషకాలు.. జుట్టుకి, చర్మానికి చాలా ప్రయోజనాలు అందించడమే కాకుండా.. హెయిర్, స్కిన్ కేర్ సమస్యలను నివారిస్తుంది.

By Swathi
|

జుట్టు రాలడం, పలుచబడి పోవడం, జుట్టు తెల్లబడటం అనే సమస్యలు.. మనం తరచుగా వింటూ ఉంటాం. అయితే.. ఈ సమస్యలకు మన అలవాట్లు ఒక కారణమైతే.. మనం తీసుకునే ఆహారం, పొల్యూషన్ మరిన్ని కారణాలు.

coconut oil

కొబ్బరినూనె చాలా ప్రొడక్ట్స్ లో ఉపయోగిస్తారు. బాడీ క్రీమ్స్, సన్ స్క్రీన్స్, బ్యూటి ప్రొడక్ట్స్, హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ లో.. కొబ్బరినూనె వాడతారు. ఎందుకంటే.. ఇందులో ఉండే.. పోషకాలు.. జుట్టుకి, చర్మానికి చాలా ప్రయోజనాలు అందించడమే కాకుండా.. హెయిర్, స్కిన్ కేర్ సమస్యలను నివారిస్తుంది.

జుట్టుని షైనీగా, సిల్కీగా, పొడవుగా, ఎక్కువరోజులు న్యాచురల్ కలర్ కలిగి ఉండేలా ఉండటానికి.. వందల ఏళ్ల నుంచి.. మహిళలు.. కొబ్బరినూనెను ఉపయోగిస్తున్నారు. మరి.. మీ జుట్టు పలబడటాన్ని అరికట్టడానికి, జుట్టు రాలడాన్ని నివారించి.. ఒత్తుగా పెరగడానికి కొబ్బరినూనెను ఎలా ఉపయోగించాలో చూద్దాం..

జుట్టు రాలడం

జుట్టు రాలడం

జుట్టు రాలడం అనేది.. ఇన్ల్ఫమేటరీ స్కిన్ కండిషన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్, పోషకాహార లోపం వల్ల వస్తుంది. కొబ్బరినూనెలో హెల్తీ ఫ్యాట్స్ ఉండటం వల్ల స్కాల్ప్ కి పోషణ అందిస్తుంది. స్కిన్ ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతుంది అలాగే ఇన్ల్ఫమేషన్ ని తగ్గిస్తుంది.

తయారుచేసే విధానం

తయారుచేసే విధానం

2టేబుల్ స్పూన్ల సేజ్ ఆయిల్ ని, 3టేబుల్ స్పూన్ల కొబ్బరినూనెలో కలపాలి. రెండింటినీ.. సన్నని మంటపై వేడి చేయాలి. వేడి చేయడం వల్ల రెండూ బాగా మిక్స్ అవుతాయి. తర్వాత.. చల్లార్చి.. కాస్త చర్మంపై రాసుకుని టెస్ట్ చేసుకోవాలి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకపోతే.. గోరువెచ్చని ఆయిల్ ని రాత్రిపడుకునే ముందు స్కాల్ప్ కి అప్లై చేసి.. షవర్ క్యాప్ పెట్టుకోవాలి. ఉదయాన్నే శుభ్రం చేసుకోవాలి.

జుట్టు డ్యామేజ్

జుట్టు డ్యామేజ్

సన్ ఫ్లవర్ ఆయిల్ తో పోల్చితే.. కొబ్బరినూనె జుట్టు డ్యామేజ్ ని అరికట్టడంలో బాగా పనిచేస్తుంది. అలాగే కొబ్బరినూనె జుట్టులో ప్రొటీన్స్ తక్కువైతే.. బలంగా మారుస్తుంది. కాబట్టి జుట్టు చివర్లకు తరచుగా కొబ్బరినూనె అప్లై చేస్తూ ఉండాలి.

జుట్టు స్మూత్ గా మారడానికి

జుట్టు స్మూత్ గా మారడానికి

పొడిజుట్టు జుట్టుని నిర్జీవంగా మారుస్తుంది. కొబ్బరినూనెలో హైడ్రోఫోబిక్ ఉంటుంది. ఇది జుట్టుకి మాయిశ్చరైజర్ కోల్పోకుండా అరికడుతుంది. తలస్నానానికి 10 నుంచి 15 నిమిషాల ముందు అప్లై చేస్తే.. హెయిర్ సిల్కీగా, స్మూత్ గా మారుతుంది.

చుండ్రు నివారించడానికి

చుండ్రు నివారించడానికి

చర్మంలో ఫంగస్, ఇతర కారణాల వల్ల తలలో చుండ్రు సమస్య వేధిస్తుంది. కొబ్బరినూనె ఫంగల్ ఇన్ఫెక్షన్ ని నివారించి.. చుండ్రుని తగ్గిస్తుంది. కాబట్టి కొబ్బరినూనె, ఆముదం రెండింటినీ సమానంగా తీసుకుని.. స్కాల్ప్ కి పట్టించి.. 30నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల తీవ్రంగా ఉండే డాండ్రఫ్ తగ్గిపోతుంది.

పేలు నివారించడానికి

పేలు నివారించడానికి

పేలు చాలా కామన్ ప్రాబ్లమ్. పేలు నివారించడానికి ఉపయోగించే చాలా రెమిడీస్.. జుట్టుని డ్యామేజ్ చేస్తాయి. కొబ్బరినూనెతో పేలును ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నివారించవచ్చు. కొబ్బరినూనెలో కొద్దిగా టీట్రీ ఆయిల్ కలిపి పట్టించడం వల్ల.. పేలు చాలా తేలికగా తగ్గిపోతాయి.

తెల్లజుట్టు నివారించడానికి

తెల్లజుట్టు నివారించడానికి

జుట్టులో ఉండే పిగ్మెంట్ సెల్స్ జుట్టు కలర్ కు బాధ్యత వహిస్తాయి. అయితే పెరిగి పెద్దవాళ్లు అయ్యే కొద్దీ పిగ్మెంట్స్ సెల్స్ చనిపోతూ ఉంటాయి. దీనివల్ల జుట్టు తెల్లబడుతుంది. ఈ తెల్లజుట్టు నివారించడానికి ప్రతిరోజూ కనీసం కొబ్బరినూనె, నిమ్మరసం కలిపి ప్రతిరోజూ 15నిమిషాలు మసాజ్ చేయాలి.

English summary

How to use Coconut oil to Stop Hair Fall

How to use Coconut oil to Stop Hair Fall. Here’s why coconut oil for hair is good for you.
Story first published: Monday, October 24, 2016, 10:58 [IST]
Desktop Bottom Promotion