For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టు సమస్యలను నివారించుకోవడానికి వేపనూనెను ఎలా ఉపయోగించుకోవాలి?

వేప లేదా ఇండియన్ లైలాక్ లో ఔషధ గుణాలు, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది అనేక జుట్టు సమస్యలను నివారిస్తుంది. ఈ క్రింద సూచించిన విధంగా వివిధ రకాల జుట్టు సమస్యలకు వేపనూనె జుట్టు సమస్యల

By Lekhaka
|

వేప లేదా ఇండియన్ లైలాక్ లో ఔషధ గుణాలు, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది అనేక జుట్టు సమస్యలను నివారిస్తుంది. ఈ క్రింద సూచించిన విధంగా వివిధ రకాల జుట్టు సమస్యలకు వేపనూనె జుట్టు సమస్యలను తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

జుట్టు సమస్యల నివారణకు వివిధ రకాల షాంపులు, ఫేస్ వాష్ లను వేపతో తయారుచేయడాన్ని మీరు గమనించే ఉంటారు. ఎందుకంటే జుట్టుకు కానీ, చర్మానికి కానీ హాని కలిగించే ఎలాంటి బ్యాక్టీరియా అయినా తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

How To Use Neem Oil For Multiple Scalp Problems?

జుట్టు సమస్యలు అన్నివయస్సుల వారికి వస్తుంటాయి. స్త్రీ , పురుషులతో సంబంధం లేకుండా ఇద్దరిలోనూ జుట్టు సమస్యలు అధికంగా ఉంటాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్ని, ఎంత శుభ్రత పాటించినా ప్రయోజనం ఉండదు అలాంటి వారి జుట్టు లేదా చర్మం మరీ కఠినంగా ఉంటుంది?

అందుకోసం...వేపనూనె గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది అన్ని రకాల జుట్టు సమస్యలను నివారిస్తుంది. వేపనూనె జుట్టుకు ఉపయోగించడం వల్ల పొందే కొన్ని ప్రయోజనాలను ఈ క్రింది విధంగా ఉన్నాయి.

అంతకంటే ముందు దీన్ని ఇంట్లో తయారుచేసుకోవడం ఎంతో ఉత్తమం, లేదా బ్రాండెడ్ మీకు నచ్చిన, బాగా పాపులర్అ యిన దాన్ని ఎంపిక చేసుకోవాలి. వేప నూనెను జుట్టుకు ఎలా ఉపయోగించాలి. ఎప్పుడు ఉపయోగించాలి?ఉపయోగించడం వల్ల పొందే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..

చుండ్రు:

చుండ్రు:

ఆయిల్ జుట్టు ఉన్నవారిలో బాధించే సమస్య చుండ్రు. అలాగో పొడి జుట్టు ఉన్నవారిలో కూడా ఈ సమస్య అధికంగా ఉంటుంది. ముఖ్యంగా వేప క్యూరబుల్ గా పనిచేస్తుంది. కొబ్బరి నూనెలో కొన్ని వేప ఆకులను వేసి మరిగించాలి. ఈ నూనెను తలకు అప్లై చేసి, మసాజ్ చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది.

తలలో దురద:

తలలో దురద:

అదే విధంగా, తలలో విపరీతమైన దురద ఉన్నట్లైతే, దురదకు కారణమయ్యే బ్యాక్టీరియాను వేపనూనె నాశనం చేస్తుంది. జుట్టు సమస్యలను నివారించుకోవడంలో ఒక ఉత్తమం మార్గం ఇది.

జుట్టు రాలడం అరికడుతుంది:

జుట్టు రాలడం అరికడుతుంది:

తలకు వేపనూనెను మసాజ్ చేయడం వల్ల తలలో బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడుతుంది. కొత్తగా జుట్టు పెరుగుతుంది. హెయిర్ ఫోలి సెల్స్ మెరుగుపడుతాయి. జుట్టు రాలడం అరికడుతుంది.

 తలలో వాసన తగ్గిస్తుంది:

తలలో వాసన తగ్గిస్తుంది:

కొన్ని సందర్భాల్లో తలలో ఎక్కువ బ్యాక్టీరియా ఉన్నప్పుడు వాసన ఘోరంగా ఉంటుంది. జుట్టు కూడా పూర్తిగా వాసనగా ఉంటుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి వేపనూనెను ఉపయోగించడం లేదా వేప ఆకులను పేస్ట్ చేసి తలకు పూర్తిగా అప్లై చేయాలి.

హెయిర్ బ్రేకేజ్:

హెయిర్ బ్రేకేజ్:

చాలా మంది మహిళలు ఎదుర్కొనే మరో సమస్య జుట్టు రాలడం. ఈ సమస్యను నివారించుకోవడానికి జుట్టుకు ఎక్కువ మాయిశ్చరైజర్ అవసరం అవుతుంది. కాబట్టి, ప్రతి వారం వేపనూనెను తలకు అప్లై చేయాలి.

 తలలో మొటిమలు:

తలలో మొటిమలు:

చాలా మంది తలలో మొటిమలతో బాధపడుతుంటారు. వీటి వల్ల ముఖంలో మరింత వరెస్ట్ గా ఏర్పడుతాయి. పెద్దగా ఎర్రని మొటిమలు ఏర్పడుతాయి. కొద్దిగా వేపనూనెను అప్లై చేయడం వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.

ఆయిల్ హెయిర్ :

ఆయిల్ హెయిర్ :

జుట్టు సమస్యలకు వేపనూనె ఎలా పనిచేస్తుందని మీకు ఆశ్చర్యం కలగొచ్చు, అప్పుడు ఈ వేపనూనెను నేరుగా తలకు అప్లై చేసి, మసాజ్ చేయాలి. ఇది తలలో ఆయిల్ ను బ్యాలెన్స్ చేస్తుంది. ఆయిల్ జుట్టును నివారిస్తుంది.

English summary

How To Use Neem Oil For Multiple Scalp Problems?

Neem, or Indian lilac, is widely known for its medicinal and antibacterial properties. It used to treat a lot of hair and scalp problems. Listed here are different scalp conditions and how you could use neem oil to treat the scalp problems, take a look.
Story first published: Sunday, December 25, 2016, 8:25 [IST]
Desktop Bottom Promotion