For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పొటాటో స్కిన్ తో తెల్లజుట్టుని నల్లగా మార్చే అమేజింగ్ సొల్యూషన్..!

పొటాటో స్కిన్ లేదా పీల్ లో విటమిన్ ఏ, బి, సి ఉంటాయి. ఇవి.. జుట్టుని తెల్లగా మార్చడమే కాకుండా.. తలలో చుండ్రుని నివారించి.. కొత్త జుట్టు ఏర్పడటానికి సహాయపడుతుంది.

By Swathi
|

20లలో ఉన్నా, 50లలో ఉన్నా జుట్టు తెల్లగా మారిందంటే.. చాలా ఇబ్బందిగా ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ జుట్టు తెల్లబడటం కామన్. కానీ.. ఈ సమస్య నుంచి త్వరగా బయటపడటం కూడా.. చాలా ముఖ్యం.

తెల్లజుట్టుని నివారించుకోవడానికి.. చాలా రెమిడీస్ ఫాలో అయి ఉంటారు. కానీ.. సరైన సొల్యూషన్ ఇప్పటివరకు పొందలేకపోయారు అంటే.. ఇప్పుడు మీకు చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్ రెమిడీ అందుబాటులో ఉంది.

potato skin for grey hair

పొటాటో స్కిన్ లేదా పీల్ లో విటమిన్ ఏ, బి, సి ఉంటాయి. ఇవి.. తలలో చుండ్రుని నివారించడమే కాకుండా.. కొత్త జుట్టు ఏర్పడటానికి సహాయపడుతుంది.

ఆలూలో ఐరన్, జింక్, పొటాషియం, క్యాల్షియం కూడా పుష్కలంగా ఉండటం వల్ల జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంద.ి అలాగే బంగాళదుంపలు న్యాచురల్ గా జుట్టుకి కలర్ ని అందిస్తాయి. తెల్లజుట్టుని నివారించి.. నల్లగా మారుస్తుంది. మరి బంగాళదుంప తొక్కను ఉపయోగించి.. తెల్లజుట్టుని నల్లగా మార్చే సింపుల్ స్టెప్స్.

స్టెప్ 1

స్టెప్ 1

6 బంగాళాదుంపలు తీసుకోవాలి. వాటిని శుభ్రం చేసుకుని పొట్టు తీసి.. పక్కన పెట్టుకోవాలి.

స్టెప్ 2

స్టెప్ 2

ఒక లీటర్ నీటిని ఒక గిన్నెలో పోసి వేడి చేయాలి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు.. బంగాళాదుంపల తొక్కను కలపాలి. 30నిమిషాలు సన్నని మంటపై ఉడికించాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి.. 15నిమిషాలు అలానే వదిలేయాలి. చల్లారనివ్వాలి.

స్టెప్ 3

స్టెప్ 3

ఇప్పుడు ఏదైనా క్లాత్ లేదా వడకట్టేది తీసుకుని.. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి వడకట్టుకోవాలి. తొక్కను తీసేసి.. కొన్ని గంటలు అలానే ఉంచాలి. ఒకవేళ కావాలి అనుకుంటే.. ఎసెన్షియల్ ఆయిల్ కలుపుకోవచ్చు.

స్టెప్ 4

స్టెప్ 4

జుట్టుని మైల్డ్ షాంపూ ఉపయోగించి.. పూర్తీగా శుభ్రం చేసుకోవాలి. అలాగే కండిషనర్ చేసుకోవాలి. మొత్తం అయిన తర్వాత జుట్టుని దువ్వెనతో కాకుండా.. చేత్తో చిక్కు తీసుకోవాలి.

స్టెప్ 5

స్టెప్ 5

జుట్టుని చిన్న చిన్న పొరలుగా విడదీయాలి. కాటన్ బాల్ ని పొటాటో పీల్ సొల్యూషన్ లో ముంచి.. జుట్టుకి అప్లై చేయాలి. స్కాల్ప్ కి పట్టించాలి.

స్టెప్ 6

స్టెప్ 6

ఇప్పుడు జుట్టుని 5నిమిషాలు మసాజ్ చేయాలి. జుట్టుని లూజ్ కట్టుకుని.. 30 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

స్టెప్ 7

స్టెప్ 7

ఒకసారి ఈ పద్ధతి పూర్తి అయిన తర్వాత.. జుట్టుకి టవల్ ని చుట్టాలి. తర్వాత జుట్టుని ఆరబెట్టుకోవాలి. అంతే.. ఇలా రెగ్యులర్ గా చేస్తే.. మీ జుట్టు నల్లగా మారుతుంది.

English summary

How To Use Potato Skin To Get Rid Of Grey Hair!

How To Use Potato Skin To Get Rid Of Grey Hair! Prevent grey hair, promote hair growth and add shine to your dull hair with this easy step-by-step potato skin rinse for grey hair.
Story first published: Wednesday, October 26, 2016, 17:15 [IST]
Desktop Bottom Promotion