For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చుండ్రుని శాశ్వతంగా తొలగించే.. సింపుల్ అండ్ పర్ఫెక్ట్ రెమెడీ..!!

నిమ్మలో మైక్రోబయోల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవి తలలో ఇన్ఫెక్షన్ ని నివారిస్తుంది. స్కాల్ప్ ని క్లెన్స్ చేసి.. చుండ్రుకి కారణమయ్యే బ్యాక్టీరియాని తొలగిస్తుంది.

By Swathi
|

చుండ్రు, దురద మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతోందా ? చుండ్రుని శాశ్వతంగా తొలగించి, స్కాల్ప్ ని శుభ్రం చేసే అద్భుతమైన హెయిర్ ప్యాక్ ఉంది. అదికూడా.. మీ ఇంట్లోని వస్తువులతోనే తయారు చేసుకోవచ్చు.

Lemon Hair Mask To Cleanse Scalp & Clear Dandruff!

ఈ హెయిర్ మాస్క్ లో పెరుగు, తేనె, నిమ్మ ఉపయోగిస్తాం. పెరుగులో విటమిన్ బి6, విటమిన్ బి12, లాక్టిక్ యాసిడ్, జింక్ ఉంటాయి. లాక్టిక్ యాసిడ్ జుట్టుని సాఫ్ట్ గా మారుస్తుంది. విటమిన్ బి6 జుట్టుకి కండిషనర్ లా పనిచేస్తుంది. బి12 జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

కొబ్బరినూనె, నిమ్మరసం మిశ్రమంతో జుట్టుకి కలిగే అమేజింగ్ బెన్ఫిట్స్..!కొబ్బరినూనె, నిమ్మరసం మిశ్రమంతో జుట్టుకి కలిగే అమేజింగ్ బెన్ఫిట్స్..!

నిమ్మలో మైక్రోబయోల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవి తలలో ఇన్ఫెక్షన్ ని నివారిస్తుంది. స్కాల్ప్ ని క్లెన్స్ చేసి.. చుండ్రుకి కారణమయ్యే బ్యాక్టీరియాని తొలగిస్తుంది. నిమ్మలో ఉండే సిట్రిక్ యాసిడ్ సెబమ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. జుట్టుని షైనీగా మారుస్తుంది.

తేనెలో ఉండే ఎమినో యాసిడ్ జుట్టు మాయిశ్చరైజర్ కోల్పోకుండా అడ్డుకుంటుంది. అలాగే సాఫ్ట్ గా మారుస్తుంది. ఇన్ని బెన్ఫిట్స్ ఉన్న పదార్థాలతో తయారు చేసిన హెయిర్ ప్యాక్ ఎంత అద్భుతమైన ఫలితాలు ఇస్తుందో చెప్పనక్కరలేదు. మరి ఈ ప్యాక్ ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం..

స్టెప్ 1

స్టెప్ 1

అరకప్పు పెరుగు తీసుకోవాలి. అందులో ఎలాంటి ఫ్లేవర్స్ లేకంుడా.. చాలా న్యాచురల్ గా ఉండే పెరుగు తీసుకోవాలి.

స్టెప్ 2

స్టెప్ 2

1 టీ స్పూన్ నిమ్మరసంను అందులో కలపాలి. ముందుగా నిమ్మకాయను సగానికి కట్ చసి.. స్పూన్ పై పెట్టుకోవాలి. దాన్ని 10 నుంచి 20 సెకన్లు మంటపై ఆవిరి పెట్టాలి. చల్లారిన తర్వాత రసం తీయాలి.

స్టెప్ 3

స్టెప్ 3

ఒక టేబుల్ స్పూన్ తేనెను ఈ మిశ్రమంలో కలపాలి. తేనె జుట్టుకి మాయిశ్చరైజర్ ని మాత్రమే కాదు.. విటమిన్ సి ఉండటం వల్ల జుట్టుని సూపర్ సాఫ్ట్ అండ్ సిల్కీగా మారుస్తుంది.

స్టెప్ 4

స్టెప్ 4

3 నుంచి 4 చుక్కల టీ ట్రీ ఆయిల్ ని ఈ మిశ్రమంలో కలపాలి. టీట్రీ ఆయిల్ లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉండటం వల్ల చుండ్రుని చాలా తేలికగా తొలగిస్తుంది.

స్టెప్ 5

స్టెప్ 5

పెద్ద పళ్లు ఉన్న దువ్వెన తీసుకుని జుట్టుని చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. ఒకవేళ మీ జుట్టు చాలా డ్రైగా ఉంటే.. కాస్త కొబ్బరినూనెను జుట్టు చివర్లకు అప్లై చేయాలి. జుట్టు చిక్కులు లేకుండా ఉండాలి.

స్టెప్ 6

స్టెప్ 6

ఈ హెయిర్ ప్యాక్ ని చేతివేళ్లతో స్కాల్ప్ కి, జుట్టుకి పట్టించాలి. జుట్టుని చిన్నచిన్న పాయలుగా విడదీసి తర్వాత అప్లై చేసుకుంటే.. మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

స్టెప్ 7

స్టెప్ 7

జుట్టుకి ప్యాక్ అప్లై చేసిన తర్వాత జుట్టుని గంట అలాగే వదిలేయాలి. తర్వాత షాంపూ, కండిషనర్ ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి. జుట్టుకి అప్లై చేసిన ప్యాక్ మొత్తం క్లీన్ గా తొలగించుకోవాలి. ఈ ప్యాక్ ని వారానికి ఒకసారి అప్లై చేస్తే.. మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

English summary

Lemon Hair Mask To Cleanse Scalp & Clear Dandruff!

Lemon Hair Mask To Cleanse Scalp & Clear Dandruff. Bid adieu to dandruff and clean scalp, once and for all, with this lemon hair mask!
Desktop Bottom Promotion