For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ జుట్టు ఎక్కువగా ఎందుకు రాలిపోతోందో తెలుసుకోవాలనుందా ? చెక్ ఔట్..

By Swathi
|

హెయిర్ ఫాల్ స‌మ‌స్య‌తో మీరు బాధ‌ప‌డుతున్నారా ? త‌ల‌లో దువ్వెన పెట్ట‌గానే.. జుట్టు కుచ్చులుగా ఊడిపోతోందా ? దీంతో త‌ల దువ్వ‌డానికి కూడా ఆలోచిస్తున్నారా ? అయితే ఇక‌పై టెన్ష‌న్ ప‌డాల్సిన అవ‌స‌రం. మీ జుట్టు రాల‌డానికి కార‌ణాలు తెలుసుకుంటే.. స‌మ‌స్య నుంచి ఈజీగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.

జుట్టు రాల‌డానికి కార‌ణాలు తెలుసుకోవ‌డం చాలా అవ‌స‌రం. హెల్తీ హెయిర్ ఉంటే ఓవ‌రాల్ లుక్ అమేజింగ్ గా ఉంటుంది. ప‌లుచ‌టి జుట్టు ఉండే.. ఓల్డ‌ర్ గా క‌నిపిస్తారు. అన్ హెల్తీ లుక్ పొందుతారు. ఎప్పుడైతే జుట్టు రాలే స‌మ‌స్య‌ను ఫేస్ చేస్తున్నారు.. వెంట‌నే స‌మ‌స్య‌కు కార‌ణం తెలుసుకోవాలి. అస‌మ‌తుల్య ఆహారం, కాలుష్యం, జుట్టు సంర‌క్ష‌ణ గురించి ప‌ట్టించుకోక‌పోవ‌డం, అనారోగ్యం జుట్టు రాల‌డానికి కార‌ణ‌మ‌వుతుంది. కానీ.. దీనికి అస‌లు కార‌ణాలు ఖ‌చ్చితంగా తెలుసుకోవాలి.

వార‌స‌త్వంగా

వార‌స‌త్వంగా

కొన్నిసార్లు జుట్టు రాల‌డానికి వార‌స‌త్వ కార‌ణాలు కూడా ఉంటాయి. త‌ల్లిదండ్రులు, గ్రాండ్ పేరెంట్స్ కి బ‌ట్ట‌త‌ల ఉంటే.. మీకు కూడా ఇలాంటి అనుభ‌వం ఎదుర‌య్యే అవ‌కాశం ఉంది.

బ‌ర్త్ కంట్రోల్ పిల్స్

బ‌ర్త్ కంట్రోల్ పిల్స్

చాలా సార్లు మ‌హిళ‌లు చాలా బ‌ర్త్ కంట్రోల్ పిల్స్ ఎక్కువ‌గా వాడ‌టం వ‌ల్ల, హార్మోన‌ల్ ఇంబ్యాలెన్స్ కార‌ణంగా.. శ‌రీరంలో జుట్టు రాల‌డానికి కార‌ణ‌మ‌వుతుంది.

విట‌మిన్ ఏ

విట‌మిన్ ఏ

రెగ్యుల‌ర్ గా విట‌మిన్ ఏ తీసుకోవ‌డం వ‌ల్ల జుట్టు కుదుళ్లు బ‌ల‌హీన‌మ‌వుతాయి. కార‌ణంగా హెయిర్ ఫాల్ కి కార‌ణ‌మ‌వుతాయి. కాబట్టి.. పరిమితికి మించి తీసుకోకూడదు.

హ‌ఠాత్తుగా బ‌రువు త‌గ్గ‌డం

హ‌ఠాత్తుగా బ‌రువు త‌గ్గ‌డం

ఎక్కువ‌గా డైట్ ఫాలో అవ‌డం వ‌ల్ల హ‌ఠాత్తుగా కొన్ని రోజుల్లోనే బ‌రువు త‌గ్గ‌డం వ‌ల్ల జుట్టు బ‌ల‌హీన‌మై.. జుట్టు రాల‌డానికి కార‌ణ‌మ‌వుతుంది.

యాక్సిడెంట్

యాక్సిడెంట్

యాక్సిడెంట్, ఇష్ట‌మైన‌వాళ్లు చ‌నిపోవడం వంటి కార‌ణాలు, గ‌తంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌లు మిమ్మల్ని డిప్రెష‌న్ కి గురిచేసి.. హెయిర్ ఫాల్ కి కార‌ణ‌మ‌వుతాయి.

ప్రొటీన్ త‌గ్గ‌డం

ప్రొటీన్ త‌గ్గ‌డం

ముఖ్య‌మైన ఫోష‌కాలు ఆరోగ్య‌క‌ర‌మైన జుట్టుకి చాలా అవ‌స‌రం. జుట్టు ఆరోగ్యానికి ప్రొటీన్ చాలా అవ‌స‌రం. ప్రొటీన్స్ త‌గ్గ‌డం వ‌ల్ల‌.. జుట్టు రాల‌ిపోతూ ఉంటుంది. కాబట్టి మీ డైట్ ని సరిగ్గా చెక్ చేసుకోండి.

దీర్ఘ‌కాలికంగా జ్వ‌రం

దీర్ఘ‌కాలికంగా జ్వ‌రం

వైర‌ల్ ఫీవ‌ర్, ఫీవ‌ర్ వంటి వాటి స‌మ‌స్య‌లు దీర్ఘ‌కాలంగా ఉండ‌టం, 15 రోజుల‌పాటు జ్వ‌రంతో బాధ‌ప‌డితే.. జుట్టు రాల‌డానికి కార‌ణ‌మ‌వుతుంది.

English summary

Seven Shocking Causes For Hair Fall That You Should Know!

Seven Shocking Causes For Hair Fall! However, there are a few surprising reasons that may lead to extreme hair loss, which many of us may not be aware of.
Story first published:Friday, September 2, 2016, 12:37 [IST]
Desktop Bottom Promotion