For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చుండ్రుని పర్మనెంట్‌గా నివారించే ప‌వ‌ర్‌ఫుల్ టిప్స్

By Swathi
|

తలలో చుండ్రు ఉంటే.. చాలా ఇబ్బందిగా ఉంటుంది. నలుగురిలో ఉన్నప్పుడు దురదగా ఉంటే.. ఆ ఫీలింగ్ ఎవరికీ చెప్పుకోలేరు. మాటిమాటికి దురదగా ఉండటం వల్ల చాలా చికాకుగా ఉంటుంది. డాండ్రఫ్ ఎక్కువగా డ్రై స్కిన్, తలలో డెడ్ స్కిన్ వల్ల వస్తుంది. చుండ్రు ఎక్కువైనప్పుడు అది కొంతమందికి భుజాలపై రాలుతూ అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితి చాలా ఇబ్బందికి గురిచేస్తుంది.

వేప గింజల్లో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

చుండ్రు నివారించడానికి రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే అనేక షాంపూలు యాంటీ డాండ్రఫ్ పేరుతో ఉంటాయి. వీటన్నింటినీ ప్రయత్నించినా.. ఫలితం మాత్రం దక్కదు. ఇవి తలస్నానం చేసిన రోజు రిలీఫ్ ని ఇచ్చినా.. షరామామూలే అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇలా అప్పటికప్పుడు కాకుండా.. శాశ్వతంగా చుండ్రు నివారించడానికి, చుండ్రురహిత స్కాల్ఫ్ పొందడానికి ఇక్కడున్న సింపుల్ అండ్ ఈజీ రెమిడీస్ ట్రై చేయండి. ఈ చిట్కాలు మిమ్మల్ని తప్పకుండా సర్ ప్రైజ్ చేస్తాయి. ఇంకెందుకు ఆలస్యం వెంటనే చెక్ చేయండి.

Simple Ways to Get Rid of Dandruff Permanently

వేప
చుండ్రుని శాశ్వతంగా నివారించడంలో వేప చాలా వండర్ ఫుల్ గా పనిచేస్తుంది. గుప్పెడు వేపాకులు తీసుకుని.. 4 కప్పుల నీటిలో ఉడకబెట్టాలి. 15నిమిషాల పాటు నీటిలో వేపాకులను మరిగించిన తర్వాత చల్లారనివ్వాలి. తర్వాత ఆకులను తీసేసి.. ఆ నీటితో తలను శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి మూడు నుంచి నాలుగు సార్లు స్నానం చేయడం వల్ల చుండ్రు వదిలిపోతుంది.

చుండ్రు సమస్య పని పట్టే హెన్నా హెయిర్ ప్యాక్స్

Simple Ways to Get Rid of Dandruff Permanently

కొబ్బరినూనె, నిమ్మరసం
కొబ్బరినూనెను, కొబ్బరిని నిత్యం రకరకాలుగా ఉపయోగిస్తుంటాం. అయితే డాండ్రఫ్ నివారించడానికి కొబ్బరినూనె చక్కటి పరిష్కారం. కాస్త కొబ్బరినూనె తీసుకుని, అందులో అరనిమ్మకాయ రసం కలపాలి. ఈ మిశ్రమాన్ని స్కాల్ఫ్ కి బాగా పట్టించాలి. 20 నిమిషాలు అలానే వదిలేయాలి. తర్వాత శుభ్రం చేసుకోవాలి. అవసరమైతే షాంపూ వాడవచ్చు. ఇలా వారానికి రెండు నుంచి మూడుసార్లు ప్రయత్నిస్తే.. చుండ్రు ఈజీగా తగ్గిపోతుంది.

Simple Ways to Get Rid of Dandruff Permanently

మెంతులు
మెంతులు జీర్ణక్రియకు సహాయపడతాయి. అలాగే యాంటీ ఫంగల్ గుణాలు ఇందులో మెండుగా ఉంటాయి. కాబట్టి ఇది చుండ్రుని నివారించడంలో పవర్ ఫుల్ గా పనిచేస్తుంది. రాత్రంతా మెంతులను నీళ్లలో నాననివ్వాలి. ఉదయాన్నే వీటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దానిలోకి ఒక కప్పు పెరుగు కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు, స్కాల్ఫ్ కి పట్టించి రెండు గంటలపాటు ఆరనివ్వాలి. తర్వాత షాంపూతో స్నానం చేస్తే చుండ్రు సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ చిట్కాని వారానికి రెండుసార్లు ప్రయత్నిస్తే.. మంచి ఫలితాలు పొందవచ్చు.

షుగర్ వ్యాధి కంట్రోల్ చేసే శక్తి మెంతులకే సొంతం..

Read more at:

బేకింగ్ సోడా
బేకింగ్ సోడా అంటే.. సాధారణంగా కేక్స్, బ్రెడ్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తామని భావిస్తాం. ఇది జుట్టు సంరక్షణకి ఎలా ఉపయోగపడుతుంది అని సందేహం రావచ్చు. అయితే ఇది తలలో ఉన్న అనవసర నూనెలను పీల్చుకుంటుంది. అలాగే డెడ్ స్కిన్ ని నివారించడానికి సహాయపడుతుంది. అలాగూ హానికరమైన ఫంగల్స్ ఎక్కువవకుండా ఇది కాపాడుతుంది. ఇది ఎలా అప్లై చేయాలంటే.. ఒక కప్పు బేకింగ్ సోడా తీసుకుని తడి జుట్టుపై బాగా మసాజ్ చేయాలి. 5 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో.. షాంపూ లేకుండా శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి లేదా రెండు సార్లు చేయడం వల్ల చుండ్రు నుంచి వెంటనే ఉపశమనం పొందవచ్చు.

English summary

Simple Ways to Get Rid of Dandruff Permanently

Simple Ways to Get Rid of Dandruff Permanently. Many shampoos claim to be anti-dandruff but don’t really live up to the name. So if you really want a clean, dandruff free scalp, try these easy to find ingredients and you will be amazed at how effective they are.
Story first published: Monday, January 18, 2016, 12:23 [IST]
Desktop Bottom Promotion