For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మగవారిలో జుట్టు రాలడానికి..బట్టతలకు కొన్ని సర్ ప్రైజింగ్ రీజన్స్ ...!

|

సహజంగా హెయిర్ ఫాల్ సమస్య స్త్రీలలో మాత్రమే కాదు, పురుషుల్లో కూడా ఎక్కువగా ఉంది. అయితే పురుషుల్లో హెయిర్ ఫాల్ సమస్యకు ఖచ్చితమైన కారణాలు తెలుసుకోవాల్సిందే.

20 నుండి 30ఏళ్ళలోనే జుట్టు రాలడం ప్రారంభమైతే, 40 ఏళ్ళకు మీరు ఎలా ఉంటారు? మీ వయస్సుకు ఉండాల్సిన వారికంటే ఎక్కువ వయస్సు మళ్లినవారిలా బట్టతలతో కనబడుతారు.!

పురుషుల్లో బట్టతల ఏర్పడటం వల్ల ఆందోళన చెందుతారు. నమ్మకాన్ని కోల్పోతారు. బట్టతల కారణంగా మగవారు ట్రెండీ అవుట్ ఫిట్స్, నచ్చిన అవుట్ ఫిట్స్ ను వేసుకోవడానికి మెహమాట పడుతారు. బట్టతలతో ఇటువంటి మోడ్రన్ దుస్తులు ధరించడం వల్ల యూత్ ఫుల్ లుక్, చార్మింగ్ కోల్పోతారని చాల మంది భావిస్తారు.!

మగవారిలో బట్టతల సహజం, స్త్రీలతో పోల్చితే పురుషుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఇటువంటి సమస్య 40ఏళ్ళ తర్వాత వస్తుంటుంది. అలా కాకుండా యంగ్ ఏజ్ లోనే హెయిర్ ఫాల్, బట్టతల వస్తుంటే, అందుకు ఇతర కారణాలున్నాయన్న విషయం గుర్తించాలి. సాధారణంగా, పౌష్టికాహార లోపం, కాలుష్యం, తలలో పడే యూవీ రేస్, సరైన హెయిర్ కేర్ పద్దతులను పాటించకపోవడం వల్ల జుట్టు రాలడం అధికమవుతుంది.

వీటితో పాటు మరికొన్ని ఆశ్చర్యపరిచే రీజన్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి..

ట్రిచోటిల్లోమానియా:

ట్రిచోటిల్లోమానియా:

ట్రిచోటిల్లోమానియా అంటే వీరు తరచూ చేత్తో జుట్టు లాక్కోవడం లేదా ప్లక్ చేయడం వంటి పనులు చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఆ ప్రదేశంలో హెయిర్ ఫాలిసెల్స్ వదలై జుట్టు రాలడానికి కారణమవుతుంది. దాంతో బట్టతల వస్తుంది. ఇది ఒక విధమైనటువంటి డిజార్డర్ . ఈ అలవాటున్న వారు థెరఫిస్ట్ ను సంప్రదించడం మంచిది.

ఎక్కువ సార్లు, ప్రెజర్ తో తల దువ్వడం:

ఎక్కువ సార్లు, ప్రెజర్ తో తల దువ్వడం:

మగవారిలో జుట్టు రాలడానికి మరో ఆశ్చర్యమైన కారణం, ఎక్కువ సార్లు జుట్టు దువ్వుడం వల్ల హెయిర్ ఫాలీసెల్ డ్యామేజ్ అవుతాయి,. దాంతో జుట్టు రాలి, బట్టతలకు కారణమవుతుంది.

మ్యాన్ బన్స్ :

మ్యాన్ బన్స్ :

ట్రెండింగ్ స్టైల్స్ అలవాటు పడటం, ట్రెండీగా జుట్టు వేసుకోవడం కొన్ని స్టైల్స్ మెయింటైన్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ అధికమవుతుంది. పోనీ టైల్ లేదా హెయిర్ బన్ స్టైల్ కోసం జుట్టును ఫోర్స్ గా పుల్ చేయడం వల్ల ..టైట్ గా బన్ వేసుకుని ఎక్కువ సమయంలో అదే స్టైల్ మెయింటైన్ చేయడం వల్ల హెయిర్ ఫాలీసెల్స్ డ్యామేజ్ అవుతాయి.

స్ట్రెస్ :

స్ట్రెస్ :

హెయిర్ ఫాల్ కు మరో కామన్ రీజన్ స్ట్రెస్. మగవారు ఎక్కువగా స్ట్రెస్ కు గురౌతుంటారు. కాబట్టి, స్ట్రెస్ తగ్గించుకోవడం మంచిది. స్ట్రెస్ తగ్గించుకోవడానికి యోగా, మెడిటేషన్ వంటివి ప్రాక్టీస్ చేయడం వల్ల నెర్వస్ సిస్టమ్ ప్రశాంతంగా ఉంటుంది.

మగవారు ఉపయోగించే షాంపులు:

మగవారు ఉపయోగించే షాంపులు:

చాలా సందర్బాల్లో, పురుషులు స్నానంకు ఉపయోగించే సోపులను తలకు కూడా ఉపయోగించడం వల్ల సోప్స్ లో ఉండే కెమికల్స్ జుట్టు రాలడానికి కారణమవుతుంది.

స్టెరాయిడ్స్ :

స్టెరాయిడ్స్ :

పురుషులు బాడీ బిల్డప్ కోసం స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల, శరీరంలో చూపించే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది.

హైజీన్ సమస్యలు:

హైజీన్ సమస్యలు:

సహజంగా, రెగ్యులర్ హెయిర్ కేర్ సరిగా పాటించకపోవడం వల్ల , కాలుష్యం వల్ల , తలస్నానం చాలా రోజులు చేయకపోవడం, వల్ల లేదా రోజూ తలస్నానం చేయడం వల్ల కూడా జుట్టు రాలడానికి కారణమవుతుంది.

హెల్మెట్స్:

హెల్మెట్స్:

పురుషుల్లో జుట్టు రాలడానికి మరో కారణం, హెల్మెట్స్ . తలకు క్లాత్ లేదా స్కార్ప్ చుట్టుకోకుండా హెల్మెట్స్ పెట్టుకోవడం వల్ల తలలో చెమట కారణంగా ఇన్ఫెక్షన్స్ పెరిగి హెయిర్ ఫాల్ కు దారితీస్తుంది.

 మేల్ పాట్రన్ తో వచ్చే బట్టతల:

మేల్ పాట్రన్ తో వచ్చే బట్టతల:

చాలా మంది పురుషుల్లో 30 ఏళ్ళ లోపు వారిలో ఇటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. చాలా వేగంగా జుట్టు రాలడానికి కారణమవుతుంది.

స్టైలింగ్ ప్రొడక్ట్స్ :

స్టైలింగ్ ప్రొడక్ట్స్ :

కొన్ని రకాల స్టైలింగ్ ప్రోడక్ట్స్ ఉపయోగించడం వల్ల హానికరమైన కెమికల్స్ ను ఉపయోగించడం వల్ల హెయిర్ ఫాల్ కు కారణమవుతుంది.

వర్కౌట్స్ ఎక్కువ చేయడం వల్ల:

వర్కౌట్స్ ఎక్కువ చేయడం వల్ల:

ఎక్కువ వర్కౌట్స్ చేయడం వల్ల టెస్టోస్టెరాన్ ఉత్పత్తి అవుతుంది. దాంతో జుట్టు రాలడానికి కారణమవుతుంది.

 స్మోకింగ్ :

స్మోకింగ్ :

స్మోకింగ్ వల్ల కూడా జుట్టు ఎక్కువగా రాలుతుంది. స్మోక్ చేసేవారిలో ఇదొక సీరియస్ డిజార్డర్ అని గుర్తుంచుకోవాలి.

English summary

Surprising Reasons For Hair Loss In Men!

Are you a man who is experiencing a lot of hair fall lately? If yes, then there are a few surprising reasons for your hair fall that you must be aware of.
Desktop Bottom Promotion