For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తలస్నానానికి ముందు తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి ?

By Swathi
|

జుట్టు ఫ్రెష్ గా, షైనీగా కనిపిస్తేనే ఫేస్ కూడా గ్లామరస్ గా ఉంటుంది. అందుకే చాలా మంది రెండురోజులకు ఒకసారి తలస్నానం చేస్తూ ఉంటారు. అయితే తలస్నానానికి ముందు తీసుకునే జాగ్రత్తలు మీ జుట్టు ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. తలస్నానానికి ముందు కేవలం ఆయిల్ పెడితే సరిపోదు. మరికొన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే మీ జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా ఉంటుంది.

గ్రే హెయిర్ నివారించడానికి అవసరం అయ్యే ఉత్తమ హో రెమెడీస్

తలస్నానం చేసేటప్పుడే కాకుండా.. జుట్టుని శుభ్రం చేసుకునే ముందు చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవడం మంచిది. దీనివల్ల జుట్టు తెల్లబడటం, జుట్టు రాలడం, నిర్జీవంగా మారడం, డ్రైగా మారడం, చుండ్రు వంటి రకరకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అసలు తలస్నానానికి ముందు ఎలాంటి పనులు.. జుట్టు అందాన్ని రెట్టింపు చేస్తాయో చూద్దాం..

ఆయిల్ మసాజ్

ఆయిల్ మసాజ్

తలస్నానానికి ముందు గోరువెచ్చని నూనెతో మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేయడం వల్ల జుట్టు మెరుస్తూ, ఆరోగ్యంగా ఉంటుంది.

విటమిన్ ఈ

విటమిన్ ఈ

రెండురకాల ఆయిల్స్ అంటే.. ఆలివ్ ఆయిల్, చమురు, లేదా బాదాం నూనె.. ఇలా కలిపి పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఇందులోకి విటమిన్ ఈ ట్యాబ్లెట్స్ కూడా మిక్స్ చేసి రాసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్యను వెంటనే అరికట్టవచ్చు. అయితే ఈ మిశ్రమంతో కనీసం 20 నిమిషాల పాటు మసాజ్ చేస్తే చాలా మంచి ఫలితాలు పొందుతారు.

హాట్ వాటర్

హాట్ వాటర్

తలస్నానానికి ఎప్పుడూ ఎక్కువ వేడి నీటిని ఉపయోగించరాదు. హాట్ వాటర్ వల్ల.. జుట్టు పొడిబారడమే కాకుండా.. రఫ్ గా మారిపోతుంది.

పెరుగు

పెరుగు

తలస్నానానికి ముందు పెరుగు, గుడ్డులోని సొన కలిపి జుట్టుకి పెట్టుకోవడం వల్ల కండిషనర్ లా పనిచేస్తుంది. దీనివల్ల జుట్టు షైనింగ్ గా, అందంగా మారుతుంది.

తేనె, పెరుగు

తేనె, పెరుగు

జుట్టు శుభ్రం చేసుకోవడానికి ముందు తేనె, పెరుగు కలిపి జుట్టుకి పెట్టుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. తేనె మాయిశ్చరైజింగ్ లా పనిచేసి.. కండిషనర్ లుక్ ఇస్తుంది.

అరటిపండు

అరటిపండు

రెండు బాగా పండిన అరటిపండ్లను మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి గంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే జుట్టు స్మూత్ గా, షైనింగ్ గా కనిపిస్తుంది.

మినప్పప్పు

మినప్పప్పు

మూడు టేబుల్ స్పూన్ల మినుములను రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే మెత్తటి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఇందులో ఒక ఎగ్, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి, ఒక కప్పు పెరుగు మిక్స్ చేయాలి. బాగా కలిపి.. జుట్టుకి పట్టించి అరగంత తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

Story first published:Thursday, February 11, 2016, 15:26 [IST]
Desktop Bottom Promotion