తలస్నానం తర్వాత కూడా జుట్టు జిడ్డుగా ఉంటే ఇలా చేయండి..?

By Sindhu
Subscribe to Boldsky

తలస్నానం చేసిన తర్వాత కూడా మీ జుట్టు జిడ్డుగా కనబడుతున్నదా? సాధారణంగా ప్రతి ఒక్క అమ్మాయి ఒత్తైన, స్మూత్ హెయిర్ కలిగి ఉండాలని కలలు కంటుంది . మరి అలాంటి జుట్టును పొందడం అంత సులభం కాదు . మరి అలాంటి కేశ సౌందర్యాన్ని పొందడానికి ప్రత్యేక శ్రద్ద తీసుకోక తప్పదు.

టీవీల్లో..పేపర్లలో ప్రచురించే ప్రకటనలు చూసి, వెంటవెంటనే హెయిర్ ప్రొడక్ట్స్ ను మార్చేస్తుంటారు. కానీ జుట్టుకు సరైన పోషణ, వ్యక్తిగత పరిశుభ్రత లేకపోతే అవేవీ మీకు సహాయపడవు.

అనేక జుట్టు సమస్యలకు శాశ్వత పరిష్కారం మన ఇంటి వైద్యం

ఇంకా డస్ట్, పొల్యూషన్, మరియు చుండ్రు వంటివి ఏర్పడి, తలస్నానం రెగ్యులర్ గా చేస్తున్నా కూడా జుట్టు మరింత జిడ్డుగా మరియు స్మెల్లీగా తయారవుతుంది. రెగ్యులర్ తలస్నానం తర్వాత కూడా జుట్టు ఆయిలీగా మరియు డల్ గా కనబడుతుంది.

పురుషుల జుట్టు సమస్యలకు 20 బెస్ట్ హోం రెమడీస్...!

మరి అలాంటి పరిస్థితిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆయిల్ హెయిర్ ను నివారించుకోవచ్చు? అందుకు కొన్ని హోం రెమెడీస్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. చాలా సులభంగా ఎక్సెస్ ఆయిల్ ను తగ్గించుకోవచ్చు. మరి ఆ చిట్కాలేంటో చూద్దాం...

రెగ్యులర్ గా తలస్నానం చేయకూడదు:

రెగ్యులర్ గా తలస్నానం చేయకూడదు:

ఎక్కువ సార్లు తలస్నానం చేయడం వల్ల తలలో నేచురల్ ఆయిల్ గ్రంధులు మరింత ఎక్కువ నూనెను ఉత్పత్తి చేస్తాయి. ఈ జిడ్డు తలస్నానం చేయడం వల్ల తొలగించుకోవచ్చని మీరు అనుకుంటారు. కానీ అది ఖచ్చితంగా జరగదు. కాబట్టి రెగ్యులర్ వాష్ ను నివారించాలి.

డ్రై షాంపు ఉపయోగించాలి:

డ్రై షాంపు ఉపయోగించాలి:

స్నానం చేసిన తర్వాత జిడ్డుగా ఉండే జుట్టును మీరు ఇష్టపడకపోతే డ్రై షాంపు పౌడర్ ను ఉపయోగించాలి . ఇది ఒక రకమైన పౌడర్. దీన్ని ఉపయోగించడం వల్ల నేచురల్ ఆయిల్ ప్రొడక్షన్స్ కు ఎలాంటి అంతరాయం కలిగించకుండా జుట్టులో ఉండే జిడ్డును తొలగిస్తుంది.

హెయిర్ కండీషనర్:

హెయిర్ కండీషనర్:

మీ జుట్టు జిడ్డు బారి ఉన్నదా ? తలస్నానం చేసిన తర్వాత కూడా పెరుగుతున్నదా? మరి అలాంటప్పుడు తలకు హెయిర్ కండీషనర్ ను ఉపయోగించడం మానుకోవాలి. ఆయిల్ హెయిర్ ఉన్నట్లైతే..ఇప్పటికే తలలోని నూనె గ్రంథులు విడుదల చేసే ఆయిల్స్ తలను మాయిశ్చరైజర్ గా హైడ్రేషన్ తో ఉంచుతుంది. మరి దీనికి అదనంగా ఏం చేయాల్సిన అవసరం లేదు.

షాంపును :

షాంపును :

షాంపు కొనే ముందు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి . లేబుల్ చూసి కొనాలి. ఆయిల్ హెయిర్ కు సంబంధించిన షాంపునా?అలాంటివి ఎంపిక చేసుకొని కొనాల్సి ఉంటుంది. ఈ షాంపులు ఎఫెక్టివ్ గా జుట్టులోని జిడ్డును తొలగిస్తాయి.

తలస్నానం:

తలస్నానం:

తలస్నానం చేసేప్పుడు ఆత్రుత వద్దు. నిధానంగా పూర్తిగా క్లీన్ గా షాంపు లేదా కండీషనర్ వదిలే వరకూ తలస్నానం చేయాలి. ఇది జిట్టును జిడ్డుగా మార్చడం మాత్రమే కాదు, హెయిర్ ఫాల్ కు కూడా దారి తీస్తుంది . మరియు ఎక్కువ మురికిని అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి. తలస్నానానికి ఎక్కువ సమయం కేటాయించాలి.

చుండ్రు లేకుండా చూసుకోవాలి:

చుండ్రు లేకుండా చూసుకోవాలి:

జుట్టు జిడ్డుగా మారడానికి చుండ్రు కూడా ఒక వరెక్ట్ కారణం . జుట్టు జిడ్డుగా మరియు స్మెల్లీగా మారుతుంది . హెయిర్ ఫాల్ తగ్గించాలంటే, చుండ్రు లేకుండా నివారించాలి . యాంటీడ్యాండ్రఫ్ షాంపులను వాడాలి . ఇంకా కొన్ని హోం రెమెడీస్, నిమ్మ, ఆపిల్ సైడర్ వెనిగర్ వంటివి ఉపయోగించాలి.

హాట్ వాటర్ ఉపయోగించకూడదు:

హాట్ వాటర్ ఉపయోగించకూడదు:

వేడి నీటితో స్నానం చేయడం వల్ల తలలో ఆయిల్ ప్రొడక్షన్ పూర్తిగా నిలుపుచేస్తుంది. కాబట్టి నార్మల్ వాటర్ లేదా గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి . చలికాలంలో గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. హాట్ వాటర్ ను ఉపయోగించకూడదు.

నేచురల్ షాంపు:

నేచురల్ షాంపు:

మార్కెట్లో షాంపులు అందుబాటులో ఉన్న కెమికల్ షాంపులు ఆయిల్ హెయిర్ సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి . తలస్నానం చేసిన తర్వాత జుట్టు జిడ్డుగా లేకుండా ఉండాలంటే హోం మేడ్ షాంపులను ఉపయోగించాలి. అందుకు జుట్టు పొడవును బట్టి ఓట్స్ పౌడర్ తీసుకొని నీరు వేడి చేసి అందులో ఓట్స్ పౌడర్ వేసి వడగట్టుకోవాలి . ఈ వాటర్ తో తలస్నానం చేయాలి. ఇలా కొన్ని వారాల పాటు చేస్తుంటే మంచి ఫలిత ఉంటుంది.

గుడ్డు పచ్చసొన:

గుడ్డు పచ్చసొన:

బౌన్సీ మరియు స్మూత్ హెయిర్ పొందడానికి గుడ్లు వండర్ ఫుల్ గా ఉపయోగపడుతాయి. గుడ్డులోని పచ్చసొన జుట్టులోని ఎక్సెస్ ఆయిల్ ను గ్రహిస్తుంది . దాంతో జుట్టు జిడ్డులేకుండా ఉంటుంది. గుడ్డు పచ్చసొనలో నిమ్మరసం మిక్స్ చేసి తలకు పట్టించి 15 నిముషాల తర్వాత తలస్నానం చేయాలి .

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Tips To Remove Excess Oil In Hair After Bath

    Silky smooth and bouncy hair is a dream of every girl. But, getting that is not easy and we women know the pains that we take in achieving the same. You fall for the advertisements and repeatedly change hair products, but nothing seems to help you much, right?
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more