For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలర్ట్ : జుట్టు ఎక్కువగా రాలిపోవడానికి కారణాలివే.. !

By Swathi
|

మీ జుట్టు ఊడిపోతోందా ? దువ్వినప్పుడంతా కుచ్చులు కుచ్చులుగా రాలిపోతోందా ? మీ తల దువ్విన తర్వాత ఫ్లోరంతా.. మీ జుట్టు పడిపోతోందా ? తలలో కంటే మీ దువ్వెనకే ఎక్కువ జుట్టు వచ్చేస్తోందని ఫీలవుతున్నారా ? అయితే రకరకాల ట్రీట్మెంట్స్, షాంపూలు మార్చడానికి ముందు అలర్ట్ అవండి. మీ జుట్టు ఊడిపోవడానికి కారణాలు అన్వేషించండి.

పొడవుగా, అందంగా ఉండే జుట్టు ఇటీవల పొట్టిగా మారిపోయింది. ట్రెండీగా కట్ చేసుకున్నవాళ్ల సంగతి పక్కనపెడితే.. ఉన్న జుట్టు ఊడిపోవడంతో బాధపడుతున్న వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. యువతరం నుంచి పెద్దవాళ్ల వరకూ అందరికీ జుట్టు రాలే సమస్య వేధిస్తోంది. ఇదో పెద్ద సమస్యగా భావిస్తున్న వాళ్లందరికీ గుడ్ న్యూస్. జుట్టు రాలిపోతోందని బాధపడేవాళ్లు.. కారణాలు తెలుసుకుంటే.. రాలడాన్ని ఆపడం తేలికవుతుంది. అసలు జుట్టు విపరీతంగా రాలిపోవడానికి కారణాలేంటి ? టేక్ ఎ లుక్

షాంపూ

షాంపూ

ఇప్పుడు జుట్టుకి ప్రతి ఒక్కరూ షాంపూ వాడతారు. కానీ.. షాంపూ ఎంచుకునేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఎలాంటి జుట్టు కలిగిన వాళ్లకు ఎలాంటి షాంపూ అయితే సరిపోతుందని తెలుసుకుని ఎంచుకుంటే... జుట్టు రాలడాన్ని తగ్గించవచ్చు.

కండిషనర్

కండిషనర్

కండిషనర్ ఉపయోగించే విధానంలో చాలా మంది పొరపాటు చేస్తుంటారు. కండిషనర్ ని జుట్టుకి మాత్రమే అప్లై చేయాలి. స్కాల్ఫ్ కి అప్లై చేయడం వల్ల చుండ్రుకి కారణమవుతుంది. దీనివల్ల జుట్టు రాలే సమస్య మొదలవుతుంది.

ఆయిల్

ఆయిల్

జుట్టుకి ఆయిల్ పెట్టే వాళ్ల సంఖ్య చాలా తక్కువ. అయితే తలకు ఆయిల్ పెట్టిన గంట తర్వాత స్నానం చేయాలి. అలాగే జుట్టుకి ఆయిల్ ని కూడా మరీ ఎక్కువగా అప్లై చేయకూడదు. సరైన మోతాదులో రాసుకుంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

హెయిర్ డ్రయర్

హెయిర్ డ్రయర్

ఉరుకుల పరుగుల జీవితంలో తల ఆరబెట్టుకోవడానికి కూడా సమయం ఉండదు. దీంతో ఎక్కువ హెయిర్ డ్రైయర్లపై ఆధారపడుతున్నారు. అయితే తరచుగా ఉపయోగిస్తే ఫర్వాలేదు. కానీ.. రోజూ హెయిర్ డ్రైయర్ వాడితే.. జుట్టు బలహీనమవుతుంది.

తడిజుట్టు

తడిజుట్టు

తడిజుట్టు చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. కాబట్టి తడిగా ఉన్నప్పుడు దువ్వుకోవడం వల్ల ఈజీగా ఊడిపోతుంది. అలాగే బలహీనమవుతుంది. అంతేకాదు.. ఎక్కువసార్లు, ఎక్కువసేపు జుట్టు దువ్వడం కూడా ఆరోగ్యకరం కాదు.

జుట్టు చివర్లు

జుట్టు చివర్లు

జుట్టు చివర్లను రెగ్యులర్ గా కట్ చేస్తూ ఉండాలి. అప్పుడు జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.

హెయిర్ స్టైల్

హెయిర్ స్టైల్

హెయిర్ స్టైల్ కూడా జుట్టు రాలడానికి కారణమవుతుందని ఎప్పుడైనా ఆలోచించారా ? నిజమే.. జుట్టుని మరీ బిగుతుగా, టైట్ గా ఉండే పిన్నులు, జుట్టు ఇరుక్కుపోయి రాలిపోయేలా హెయిర్ పిన్స్, బ్యాండ్స్ ఉపయోగించినా.. జుట్టు కుదుళ్లు బలహీనంగా మారతాయి.

డైట్

డైట్

ఆహారం ఆరోగ్యానికే కాదు అందానికి కూడా అవసరం. హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల జుట్టు, చర్మం కూడా హెల్తీగా ఉంటాయి. కాబట్టి జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోకూడదు.

నీళ్లు

నీళ్లు

శరీరానికి సరిపడా నీళ్లు తాగకపోతే అనారోగ్య సమస్యలతో పాటు, జుట్టు, చర్మ సమస్యలు కూడా వేధిస్తాయి. కాబట్టి కావాల్సిన మోతాదులో నీళ్లు తాగకపోయినా జుట్టు రాలే సమస్య ఎదురవుతుంది.

క్యాల్షియం

క్యాల్షియం

జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే.. క్యాల్షియం, విటమిన్ ఫుడ్ చాలా అవసరం. మీ డైట్ లో ఇవి మిస్సైతే.. జుట్టు ఎక్కువగా రాలడానికి కారణమవుతుంది. కాబట్టి.. క్యాల్షియం, విటమిన్ రిచ్ ఫుడ్ ని డైట్ లో చేర్చుకోండి.

చూశారుగా ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లకు దూరంగా ఉంటే.. జుట్టు రాలడం తగ్గుతుంది.

English summary

Top 10 causes of Hair Loss: 10 everyday habits is cause Hair Loss

Top 10 causes of Hair Loss: 10 everyday habits is cause Hair Loss. Are you losing your hair and worried about that? For women their hair is one of the best parts of their feature. So here the things that you may be doing wrong with your hair care.
Story first published: Tuesday, February 9, 2016, 14:58 [IST]
Desktop Bottom Promotion