For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తెల్ల జుట్టు నివారణకు 8 ఎఫెక్టివ్ ఆయుర్వేదిక్ రెమెడీస్

|

జుట్టు సహజరంగు కాపాడుకోవడం చెప్పినంత తేలిక కాదు. నిగనిగలాడే నల్లని జుట్టు అందానికి ప్రతీకే అయినా దాన్ని సొంతం చేసుకోవడం కొద్దిగా కష్టమైన పనే అని నిపుణులు అంటున్నారు. జుట్టు సహజ రంగు కోల్పోకుండా రక్షించుకోవడానికి అవసరమైన చిట్కాలతో పాటు, జుట్టుకు రంగు వేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

సాధారణంగా మన జుట్టు వయస్సు పెరిగే కొద్దీ , రంగు మరియు పటుత్వం కోల్పోయి తెల్లగా మారుతుంది, అంతేకాకుండా, జన్యుపరమైన సమస్యలు ,వంశపారంపర్య కారణాలు, అనారోగ్య కారణాల వల్ల సైతం ఈ ఇబ్బంది కలుగవచ్చు.అతి చిన్న వయస్సులోనే జుట్టు పొడిబారిపొవడం, పొట్లుగా మారిపోవడం ఎంతో బాదకలిగించే మరియూ ఇబ్బందిపెట్టే సమస్య, అలా బాధపడకుండా, ఆలస్యం చెయకుండా తెల్ల జుట్టు సమస్యను నివారించుకోవడానికి కొన్ని ఆయుర్వేదిక్ రెమెడీస్ ఉన్నాయి. అయితే ఈ ఆయుర్వేదిక్ రెమెడీస్ గురించి తెలుసుకోవడానికి ముందు, తెల్ల జుట్టుకు గల కారణాలను తెలుసుకుందాం..

తెల్లజుట్టుకు ప్రధానకారణాలు
హెరిడిటి, విటమిన్స్, మినిరల్స్ మరియు న్యూట్రీషియన్స్ లోపం, మెలనిన్ పిగ్మెంటేషన్ లోపం, ఆయిల్, స్పైసీ మరియు ఫ్యాట్ ఫుడ్స్ ను ఎక్కువగా తీసుకోవడం . అలాగే రెగ్యులర్ గా కలర్ కాస్మోటిక్స్ ను ఎక్కువగా ఉపయోగించడం, జుట్టుకు తనిగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం. హాట్ వాటర్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల తెల్ల జుట్టుకు కారణం అవుతుంది.

వైట్ హెయిర్ ను నివారించడంలో కలరింగ్, హెయిర్ డైయింగ్, కెమికల్ ట్రీట్మెంట్స్ కంటే ఆయుర్వేదిక్ రెమెడీస్ గ్రేట్ గా సహాయపడుతాయి . ఆయుర్వేదిక్ రెమెడీస్ తో తెల్ల జుట్టును నివారించుకోవచ్చు . వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎపెక్ట్స్ ఉండవు. వీటిని ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోవచ్చు. తెల్లజుట్టును నివారించే ఆయుర్వేదిక్ రెమెడీస్ ఏంటో ఒక సారి చూద్దాం...

ఆమ్లా పేస్ట్:

ఆమ్లా పేస్ట్:

రెండు మూడు ఉసిరికాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి, పేస్ట్ లా చేసి తలకు పట్టించి 20నిముషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

 కొబ్బరి నూనె మరియు కరివేపాకు:

కొబ్బరి నూనె మరియు కరివేపాకు:

జుట్టుకు సరిపడా కొబ్బరి నూనె తీసుకుని, అందులో కరివేపాకు ఆకులు వేసి మీడియం మంట మీద బాగా ఉడికించాలి. తర్వాత మూత పెట్టి, చల్లారినవ్వాలి. గోరువెచ్చగా చల్లారిన తర్వాత తలకు ఈ నూనెను అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. 20 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి.

బాదం నూనె, నిమ్మరసం, మరియు ఉసిరి రసం:

బాదం నూనె, నిమ్మరసం, మరియు ఉసిరి రసం:

బాదం నూనె 4 స్పూన్లు, ఒకటేబుల్ స్పూన్ ఉసిరికాయ రసం మరియు ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం మిక్స్ చేసి తలకు పెట్టి మసాజ్ చేయాలి. మసాజ్ చేసిన 45 నిముషాల తర్వాత చల్లటి నీటితో తలస్నానం చేయాలి. షాంపుతో తలస్నానం చేసిన తర్వాత హెయిర్ మాయిశ్చరైజర్ ను మరియు కండీషనర్ ను అప్లై చేయాలి.

నువ్వుల నూనె మరియు క్యారెట్ సీడ్ ఆయిల్:

నువ్వుల నూనె మరియు క్యారెట్ సీడ్ ఆయిల్:

4 టేబుల్ స్పూన్ల సీసమ్ ఆయిల్లో, అరటీస్పూన్ క్యారెట్ సీడ్ ఆయిల్ మిక్స్ చేసి బాగా షేక్ చేసి, తర్వాత ఈ నూనెను తలకు అప్లై చేసి, మసాజ్ చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో, షాంపు పెట్టి తలస్నానం చేయాలి. ఇది తెల్ల జుట్టును నివారించడంలో ఎపెక్టివ్ హోం రెమెడీ .

నిమ్మరసం మరియు ఆమ్లా పౌడర్:

నిమ్మరసం మరియు ఆమ్లా పౌడర్:

రెండు చెంచాల నిమ్మరసంలో 4 చెంచాల ఉసిరి పొడి మిక్స్ చేసి పేస్ట్ లా చేసి ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ పేస్ట్ ను జుట్టు మొదళ్ళకు అప్లై చేసి అరగంట తర్వాత చల్లటి నీటితో తలస్నానం చేయాలి . సోపు, షాంపు ఉపయోగించకూడదు.

హెన్న మెంతి పొడి:

హెన్న మెంతి పొడి:

రెండు టేబుల్ స్పూన్ల హెన్న పౌడర్ లో ఒక టీస్పూన్ మెంతి పొడి , ఒక టీస్పూన్ పెరుగు, ఒక టీస్పూన్ కాఫీ పౌడర్, 2 టీస్పూన్ల మింట్ జ్యూస్, 2 టీస్పూన్ల తులసి రసం అన్నింటిని మిక్స్ చేసి, ఈ పేస్ట్ ను తలకు పట్టించి 2 నుండి 4 గంటల తర్వాత తలస్నానం చేసుకోవాలి.

బాదం నూనె మరియు నువ్వుల నూనె:

బాదం నూనె మరియు నువ్వుల నూనె:

ఒక బౌల్లో ఒక టేబుల్ స్పూన్ నువ్వుల నూనె మరియు 4 టేబుల్ స్పూన్ల బాదం నూనె వేసి మిక్స్ చేసి తలకు పట్టించి మసాజ్ చేసి 20 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి.

 కొబ్బరి నూనె-నిమ్మరసం :

కొబ్బరి నూనె-నిమ్మరసం :

నిమ్మరసం మరియు కొబ్బరి నూనెను సమంగా తీసుకొని, బాగా మిక్స్ చేసి రోజూ తలకు అప్లై చేయాలి. ఇలా కంటిన్యూవ్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. వైట్ హెయిర్ తగ్గుతుంది.

English summary

Top 8 Ayurvedic Medicines For White Hair

Here are some Ayurvedic remedies for preventing premature greying and white hair. These are completely natural, can be easily prepared at home and non-invasive.
Story first published: Wednesday, June 8, 2016, 17:22 [IST]
Desktop Bottom Promotion