For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తెల్లజుట్టు నివారణకు గతంలో ఎప్పుడూ ట్రై చేయని పర్ఫెక్ట్ టిప్స్

By Swathi
|

తెల్లజుట్టు.. ! ఈ సమస్య మన అమ్మలు, అమ్మమ్మలు, నాన్నలది మాత్రమే కాదు. తెల్లజుట్టు సమస్య ఇప్పుడు యంగ్ ఏజ్ లోనే బాధిస్తోంది. ఎవరు చూసినా.. తెల్లజుట్టు కవర్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే.. యుక్తవయసులోనే తెల్లజుట్టు.. వాళ్ల వయసును రెట్టింపు చేస్తోంది కాబట్టి.. అందరూ తెల్లజుట్టుతో పోరాడుతూ ఉన్నారు.

తెల్లజుట్టు సమస్య ఒకరిది కాదు.. ఇద్దరిది కాదు.. చాలామంది ఫేస్ చేస్తున్న కామన్ ప్రాబ్లమ్స్. ఇక వర్కింగ్ పీపుల్ లో ఈ సమస్య ఎక్కువగా ఉంటోంది. తెల్లజుట్టుని నల్లగా మార్చుకోవడానికి హెయిర్ కలర్ వాడటం అంత శ్రేయస్కరం కాదు. ఎందుకంటే..

grey hair

దీనివల్ల.. కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలాగే హెయిర్ లాస్ కూడా అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి.. మునుపెన్నడు విననీ, ప్రయత్నించని హోం రెమిడీస్ తో మీ తెల్లజుట్టుని నల్లగా మార్చుకోండి.

బ్లాక్ టీ

బ్లాక్ టీ

మీ జుట్టుని బ్లాక్ టీతో శుభ్రం చేసుకోవడం అలవరుచుకుంటే.. తొందర్లోనే మీ జుట్టు రంగు మారిపోతుంది. మీ జుట్టుని నల్లగా మార్చడమే కాదు.. షైనింగ్ గా, బ్యూటిఫుల్ గా మార్చేస్తుంది.

ఆల్మండ్ మసాజ్

ఆల్మండ్ మసాజ్

కొబ్బరినూనె తర్వాత అంతటి అమోఘమైన ఆయిల్ ఆల్మండ్ ఆయిల్. గోరువెచ్చని ఆల్మండ్ ఆయిల్ తో స్కాల్ఫ్, జుట్టు కుదుళ్లు, జుట్టుని బాగా మసాజ్ చేయడం వల్ల జుట్టు నల్లగా మారిపోతుంది. ఇందులో విటమిన్ ఈ ఉంటుంది కాబట్టి.. జుట్టుని నల్లగా మార్చడమే కాకుండా.. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

MOST READ:నల్లగా, అసహ్యంగా మారిన మోచేతులను స్మూత్ గా మార్చే టెక్నిక్స్ MOST READ:నల్లగా, అసహ్యంగా మారిన మోచేతులను స్మూత్ గా మార్చే టెక్నిక్స్

ఆలూ మాస్క్

ఆలూ మాస్క్

బంగాళదుంపలను ఉడకబెట్టి, ఆ నీటితో.. జుట్టుని వాష్ చేసుకుంటే మీ జుట్టు నల్లగా మారుతుంది. బంగాళదుంప జ్యూస్ తో శుభ్రం చేశాక.. జుట్టు ఆరిన తర్వాత పెరుగు తలకు అప్లై చేయాలి. 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

బీరకాయ

బీరకాయ

బీరకాయలను, కొబ్బరినూనెలో వేసి ఉడకబెట్టాలి. ఉడికిన తర్వాత అంతటినీ పేస్ట్ లా చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేసి.. కాసేపటి తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా 5 సార్లు ఉపయోగించిన వెంటనే ఫలితాలు మీరే గమనిస్తారు.

బ్లాక్ కాఫీ

బ్లాక్ కాఫీ

బ్లాక్ కాఫీని డైరెక్ట్ గా జుట్టు కుదుళ్లకు అప్లై చేయాలి. అయితే ఈ చిట్కా పనిచేయడానికి చాలా సమయం తీసుకుంటుంది. కాబట్టి రెగ్యులర్ గా అప్లై చేస్తూ ఉండాలి.

MOST READ:కడుపులో బిడ్డ తన్నడం గురించి గర్భిణీలు తెలుసుకోవాల్సిన విషయాలుMOST READ:కడుపులో బిడ్డ తన్నడం గురించి గర్భిణీలు తెలుసుకోవాల్సిన విషయాలు

ఉసిరికాయ

ఉసిరికాయ

ఇది న్యాచురల్ హెయిర్ కలర్ లా పనిచేస్తుంది. నీళ్లలో ఉసిరికాయలను ఉడకబెట్టాలి. తర్వాత బాగా మెత్తగా పేస్ట్ చేసి.. తలకు పట్టించాలి. నెలకు మూడుసార్లు ఈ చిట్కా ఫాలో అయితే.. మీ తెల్లజుట్టు నల్లగా మారడం ఖాయం.

ఓట్స్ మాస్క్

ఓట్స్ మాస్క్

ఓట్స్ లో ఉండే బయోటిన్.. జుట్టుకి డార్క్ కలర్ ఇస్తుంది. అలాగే ఈ మాస్క్ చుండ్రుని కూడా నివారిస్తుంది.

English summary

Turn Your Grey Hair To Black With These Remedies

Turn Your Grey Hair To Black With These Remedies. Grey hair is surely not the blessing of a grandparent. It is the most annoying thing which can make a good-looking mane look sick and disgusted.
Desktop Bottom Promotion