For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉల్లిరసం, కొబ్బరినూనె అప్లై చేస్తే.. సూపర్ ఫాస్ట్ గా హెయిర్ గ్రోత్..!!

ఉల్లిపాయలో సల్ఫర్ ఉండటం వల్ల.. వేగంగా జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. కేవలం వారానికి 2సార్లు.. ఉల్లిపాయ రసంతో పాటు మరికొన్ని పదార్థాలు మిక్స్ చేసి జుట్టుకి పట్టించడం వల్ల.. జుట్టు వేగంగా పెరుగుతుంది.

By Swathi
|

చాలా రుచికరంగా ఉండే ఉల్లిపాయ అనేక రకాల ఇన్ఫెక్షన్స్ ని నివారిస్తుంది. అలాగే.. వంటకాల్లో ఉల్లిపాయ చాలా ముఖ్యమైనది. వంటకాల సంగతి పక్కనపెడితే.. ఉల్లిపాయ జుట్టుకి అద్భుత ఫలితాలను అందిస్తుంది. ఉల్లిపాయలో సల్ఫర్ ఎక్కువగా ఉండటం వల్ల.. చాలా వేగంగా జుట్టు పెరగడానికి సహాయపడుతుంది.

onion juice

కేవలం వారానికి రెండుసార్లు.. ఉల్లిపాయ రసంతో పాటు మరికొన్ని పదార్థాలు మిక్స్ చేసి జుట్టుకి పట్టించడం వల్ల.. జుట్టు చాలా వేగంగా పెరుగుతుంది. అలాగే జుట్టు సమస్యలను నివారిస్తుంది. మరి ఉల్లిపాయను జుట్టు వేగంగా పెరగడానికి ఎలా ఉపయోగించాలో చూద్దాం..

ఉల్లి, బీర్

ఉల్లి, బీర్

2 స్పూన్ల బీర్, 2 స్పూన్ల ఉల్లిపాయ రసంను మిక్స్ చేసి.. జుట్టుకి, కుదుళ్లకి అప్లై చేయాలి. 30 నిమిషాల తర్వాత.. శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే.. జుట్టు బలంగా, సాఫ్ట్ గా, ఒత్తుగా తయారవుతుంది.

ఉల్లిపాయ, కొబ్బరినూనె

ఉల్లిపాయ, కొబ్బరినూనె

2 స్పూన్ల ఉల్లిపాయ రసం, 1 స్పూన్ కొబ్బరినూనె మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ కి పట్టించి.. రాత్రంతా వదిలేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు పెరుగుతుంది.

ఉల్లిపాయ, తేనె

ఉల్లిపాయ, తేనె

2 స్పూన్ల ఉల్లిపాయ రసం, 1 స్పూన్ తేనె మిక్స్ చేసి.. జుట్టుకి పట్టించాలి. గంట తర్వాత జుట్టుని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే.. జుట్టు రాలడం తగ్గుతుంది.

ఉల్లిరసం, నిమ్మరసం

ఉల్లిరసం, నిమ్మరసం

ఉల్లిపాయ రసం, నిమ్మరసంను 2 స్పూన్ల చొప్పున తీసుకుని మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకి పట్టించి.. గంట తర్వాత.. శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే. .మీ జుట్టు ఒత్తుగా, బలంగా మారుతుంది.

ఉల్లిరసం, ఎగ్ వైట్

ఉల్లిరసం, ఎగ్ వైట్

ఉల్లిరసం 2 స్పూన్లు, ఒక గుడ్డులోని తెల్లసొన మిక్స్ చేసి.. స్కాల్ప్ కి పట్టించాలి. గంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తుంటే.. జుట్టు ఒత్తుగా, బలంగా మారుతుంది.

ఆల్మండ్ ఆయిల్, ఆనియన్

ఆల్మండ్ ఆయిల్, ఆనియన్

2 స్పూన్ల ఉల్లిరసం, 1 స్పూన్ ఆల్మండ్ ఆయిల్ మిక్స్ చేసి.. జుట్టుకి, స్కాల్ప్ కి పట్టించాలి. రాత్రంతా అలానే వదిలేసి.. ఉదయం శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచుగా చేస్తుంటే.. జుట్టు షైనీగా, స్ట్రాంగ్ గా మారుతుంది.

ఉల్లిపాయ, పెరుగు

ఉల్లిపాయ, పెరుగు

2 స్పూన్ల పెరుగు, 2స్పూన్ల ఉల్లిపాయ రసం, 1 స్పూన్ నిమ్మరసం, పెరుగు మిక్స్ చేసి.. స్కాల్ప్ కి మసాజ్ చేయాలి. 30 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే.. మీ జుట్టు బలంగా మారుతుంది.

English summary

Using Onion Juice Twice A Week Will Increase Your Hair Growth

Using Onion Juice Twice A Week Will Increase Your Hair Growth. Onion is full of sulphur which helps in preventing hair fall and helps in hair growth rapidly.
Story first published: Friday, October 14, 2016, 13:12 [IST]
Desktop Bottom Promotion