For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చుండ్రును నివారించే ఎఫెక్టివ్ హోం రెమెడీ: వెనిగర్ టిప్స్

|

చుండ్రును క్రోనిక్ స్కిన్ కండీషన్ కాబట్టి ఇది తలలో చర్మం మీద చాలా త్వరగా ప్రభావం చూపుతుంది. ఇలాంటి చర్మ సమస్యలతో ఎవరైతే బాధపడుతుంటారో వారు తలలో డ్రై స్కిన్, ఫ్లాకీ స్కిన్ మరియు దురద కలిగి ఉంటారు.

తలలో ఇలాంటి చర్మ సమస్యలు ఉన్నప్పుడు వింటర్ మరియు సమ్మర్లో మరింత తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా వింటర్లో తలలో అదనపు మాయిశ్చరైజర్ ఉత్పత్తి కావడం వల్ల తల డ్రైగా మారుతుంది . దాంతో తలలో దురద ప్రారంభమౌతుంది . అదనంగా చుండ్రు చేరుతుంది.

చుండ్రును తక్షణం పోగొట్టే 20 సులభ చిట్కాలు...!

ఈ సమస్యను తగ్గించుకోవడానికి, చుండ్రు నివారించుకోవడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ గ్రేట్ గా సమాయపడుతుంది. ఈ పవర్ ఫుల్ బ్యూటీ ప్రొడక్ట్ లో నేచురల్ అసిడిక్ లక్షణాలు ఉన్నాయి. ఈ గుణాలు తలలో చుండ్రు ఏర్పడకుండా చేస్తుంది. ఈ నేచురల్ రెమెడీ కెమికల్ ట్రీట్మెంట్స్ కంటే మరింత బెటర్ గా పనిచేస్తుంది.

చుండ్రు నివారించడానికి వేపాకు ఎలా ఉపయోగపడుతుంది ?

చుండ్రును తగ్గించుకోవడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ ను ఉపయోగించుకోవడం ఆరోగ్యకరం మరియు సురక్షితం. అదే విధంగా జుట్టుకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలను కూడా నివారిస్తుంది. మరి తలలో చుండ్రు నివారించుకోవాలంటే ఆలస్యం చేయకుండా ఆపిల్ సైడర్ వెనిగర్ కు కమిట్ అయిపోవండి....

వెనిగర్ మరియు పుదీనా:

వెనిగర్ మరియు పుదీనా:

పుదీనా ఆకులను కొద్దిగా తీసుకొని అందు నుండి రసాన్నీ తీసుకోవాలి. దీనికి కొద్దిగా ఆపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని తలకు మరియు కేశాలకు పూర్తిగా అప్లై చేసి 10 నిముషాల తర్వాత తలస్నానం చేయాలి. ఈ వెనిగర్ టిప్ చుండ్రును తగ్గిస్తుంది. పుదీనా మీ కేశాల వాసన మంచిగా ఫ్రెష్ గా ఉండేలా చేస్తుంది.

వెనిగర్ మరియు ఎసెన్సియల్ ఆయిల్స్:

వెనిగర్ మరియు ఎసెన్సియల్ ఆయిల్స్:

ఎసెన్సియల్ ఆయిల్ వెనిగర్ తో మిక్స్ చేసి తలకు పట్టించడం వల్ల డ్రైగా ఉన్న జుట్టు సాఫ్ట్ గా మారుతుంది . వెనిగర్ ను తలకు అప్లై చేసి, తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఎసెన్సియల్ ఆయిల్ ను రాత్రంతా తలకు అలాగే ఉంచుకోవచ్చు. ఈ పద్దతి ఆలస్యం అయినా, అద్భుతంగా ఎఫెక్టివ్ గా చుండ్రును నివారిస్తుంది.

వెనిగర్ మరియు పెరుగు:

వెనిగర్ మరియు పెరుగు:

జుట్టుకు వెనిగర్ ను అప్లై చేసి, 15నిముషాల తర్వాత తలస్నానం చేయాలి. అరగంట తర్వాత పెరుగును తలకు మాస్క్ లా అప్లై చేయాలి. తర్వాత డ్రై అయ్యే వరకూ ఉండి తర్వాత తలస్నానం చేయాలి.

 వెనిగర్ మరియు టీట్రీ ఆియల్:

వెనిగర్ మరియు టీట్రీ ఆియల్:

మొదట ఆపిల్ సైడర్ వెనిగర్ ను తలంతా తడపాలి. జుట్టు డ్రై అయిన తర్వాత టీ ట్రీ ఆయిల్ ను అప్లై చేయాలి. ఇప్పుడు తలను దువ్వుకొని, డ్రై అయ్యే వరకూ అలాగే ఉండాలి .

వెనిగర్ మరియు ఆలివ్ ఆయిల్:

వెనిగర్ మరియు ఆలివ్ ఆయిల్:

కొబ్బరినూనెకు ప్రత్యామ్నాయంగా ఆలివ్ ఆయిల్ సురక్షితం . దీన్ని ఉపయోగించడం వల్ల జుట్టుకు మరింత బెట్టర్ గా న్యూరిష్ చేస్తుంది . తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం తలస్నానం చేయాలి. తిరిగి ఆపిల్ సైడర్ వెనిగర్ ను తలారా పోసుకోవాలి. ఇలా నెలకు రెండు సార్లు చేస్తే చుండ్రును నివారించుకోవచ్చు.

వెనిగర్ మరియు మెంతి:

వెనిగర్ మరియు మెంతి:

మెంతి ఆకులను మెత్తగా పేస్ట్ చేసి అందులో ఒక కప్పు ఆపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి మసాజ్ చేయాలి . 15నిముషాలు అలాగే ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి.

వెనిగర్ మరియు తేనె:

వెనిగర్ మరియు తేనె:

జుట్టుకు తేనెను అప్లై చేసి, 5 నిముసాలతర్వాత కడిగేయాలి . కొద్దిగా జుట్టు డ్రై అయిన తర్వాత ఆపిల్ సైడర్ వెనిగర్ తో తలస్నానం చేయాలి. ఈ రెండు పదార్థాలలో బ్లీచింగ్ లక్షణాలుండటం వల్ల చుండ్రును చాలా ఎఫెక్టివ్ గా పోగొడుతుంది.

English summary

Vinegar Help To Reduce Dandruff

Vinegar Help To Reduce Dandruff,Dandruff is a chronic skin condition that affects the scalp. The person who is suffering from this skin condition is often left with a dry, flaky and itchy scalp. When this skin condition affects the scalp, it tends to worsen during the winter and summer seasons.
Desktop Bottom Promotion