For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజుకి 100 వెంట్రుకల కంటే ఎక్కువ రాలిపోతే ఏం చేయాలి ?

సాధారణంగా రోజుకి 50 నుంచి 100 వెంట్రుకలు రాలిపోతాయి. కానీ మీకు ఇంతకంటే.. ఎక్కువగా రాలిపోతున్నాయా ? మీ బెడ్ పై, దిండుపై ఎక్కువ జుట్టు ఉండటం గమనిస్తున్నారా ?

By Swathi
|

మీ జుట్టు సాధారణంగా కంటే ఎక్కువ పలుచబడిపోతోందా ? సాధారణంగా రోజుకి 50 నుంచి 100 వెంట్రుకలు రాలిపోతాయి. కానీ మీకు ఇంతకంటే.. ఎక్కువగా రాలిపోతున్నాయా ? మీ బెడ్ పై, దిండుపై ఎక్కువ జుట్టు ఉండటం గమనిస్తున్నారా ?

hair fall

ఒకవేళ మీకు ఈ సమస్యను ఫేస్ చేస్తున్నట్టు అయితే.. హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకోవడానికి కొన్ని సింపుల్ రెమిడీస్ ఫాలో అవ్వాలి. మీకు జుట్టు రాలడాన్ని వెంటనే ఆపకపోతే.. పూర్తీగా జుట్టు కోల్పోయే అవకాశం ఉంటుంది.

కెమికల్ బేస్డ్ హెయిర్ ప్రొడక్ట్స్ ఉపయోగించడం వల్ల మీ జుట్టు బలహీనంగా మారి, ఎక్కువగా రాలిపోతుంది. లేదా హార్మోన్ ఇంబ్యాలెన్స్, స్కాల్ప్ ఇన్ఫెక్షన్, థైరాయిడ్ డిసీజ్ వంటి కారణాల వల్ల.. జుట్టు రాలిపోతుంది. 70శాతం వరకు జుట్టు రాలడాన్ని తగ్గించాలంటే కారణం తెలుసుకోవాలి. సరైన జాగ్రత్తలు తీసుకోవాలి.

జుట్టుకి పోషణ అందించాలి, హెర్బల్ హెయిర్ ప్యాక్స్ వేసుకోవడం వల్ల జుట్టు రాలడాన్ని అరికట్టడమే కాకుండా.. షైన్ ని అందించవచ్చు. అయితే ఆయుర్వేదిక్ హెయిర్ ప్యాక్స్ జుట్టు రాలడాన్ని ఎఫెక్టివ్ గా తగ్గిస్తాయి. మరి మీరు రోజుకి 100 కంటే ఎక్కువ వెంట్రకలు ఊడిపోతున్నాయని గమనిస్తే.. వెంటనే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయిపోండి.

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్ లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఈ, ఎసెన్షియల్ మినరల్స్ ఉంటాయి. ఇవి జుట్టుని ఆరోగ్యంగా, ఒత్తుగా మారుస్తాయి.

స్టెప్ 1

అరకప్పు ఆలివ్ ఆయిల్ తీసుకుని సన్నని మంటపై 2 నుంచి 5 నిమిషాలు వేడి చేయాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి.. చల్లారనివ్వాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు స్కాల్ప్ కి, జుట్టుకి మసాజ్ చేయాలి.

స్టెప్ 2

స్టెప్ 2

ఆలివ్ ఆయిల్ మసాజ్ చేసిన గంట తర్వాత.. షాంపూ, కండిషనర్ ఉపయోగించి.. జుట్టుని శుభ్రం చేసుకోవాలి. అంతే.. మీ జుట్టు చాలా వేగంగా పెరుగుతుంది.

ఉల్లిపాయ

ఉల్లిపాయ

ఉల్లిపాయలో ఎక్కువ సల్ఫర్ ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడమే కాకుండా.. జుట్టు రాలడాన్ని అరికడుతుంది.

స్టెప్ 1

ఉల్లిపాయ పొట్టు తీసి.. రసం తీయాలి. కాటన్ బాల్ ఉపయోగించి.. జుట్టుకి, స్కాల్ప్ కి పట్టించాలి. చేతివేళ్ల సహాయడంతో.. గుండ్రంగా మసాజ్ చేయాలి.

స్టెప్ 2

స్టెప్ 2

ఈ మాస్క్ అప్లై చేశాక.. గంట తర్వాత మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచుగా చేస్తే.. జుట్టు రాలడం అరికట్టవచ్చు.

ఎగ్

ఎగ్

ఎగ్ లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కెరటిన్ ఉంటుంది. ఇందులో ఎలాంటి హానికారక కెమికల్స్ ఉండవు. ఇది జుట్టు ఎలాస్టిసిటీని పెంచుతుంది. జుట్టు చిట్లిపోవడాన్ని అడ్డుకుంటుంది. జుట్టుకి షైనింగ్ ని ఇస్తుంది.

స్టెప్ 1

గుడ్డులోని తెల్లసొన తీసుకుని.. 10 చుక్కల ఆల్మండ్ ఆయిల్ మిక్స్ చేయాలి. రెండూ బాగా మిక్స్ అయ్యేంతవరకు కలపాలి.

స్టెప్ 2

స్టెప్ 2

ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ కి బాగా మసాజ్ చేయాలి. తర్వాత బాగా ఆరేంతవరకు హెయిర్ ప్యాక్ ని అలాగే ఉంచాలి. తర్వాత మైల్డ్ షాంపూ ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి.

ధ్యానం

ధ్యానం

జుట్టు రాలడానికి ప్రధాన కారణం ఒత్తిడి. కనీసం 30 నిమిషాలు ధ్యానం చేయడం వల్ల.. ఒత్తిడి లెవెల్స్ తగ్గుతాయి. హార్మోన్ బ్యాలెన్స్ రీస్టోర్ అవుతాయి.

English summary

What To Do If Your Hair Fall Is More Than 100 Strands A Day!

What To Do If Your Hair Fall Is More Than 100 Strands A Day! You know something is wrong when there is more hair on the comb than scalp, here are some effective tips to control hair fall.
Story first published: Thursday, October 27, 2016, 11:45 [IST]
Desktop Bottom Promotion