For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజూ నువ్వులనూనెతో జుట్టుకి మసాజ్ చేస్తే పొందే అమేజింగ్ బెన్ఫిట్స్..!

అన్ని రకాల జుట్టు సమస్యలను.. దూరం చేయడంలో నువ్వుల నూనె చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అలాగే నువ్వులు తినడం వల్ల కూడా జుట్టు, చర్మ సమస్యలు దూరమవుతాయి.

By Swathi
|

కొబ్బరినూనె, ఆల్మండ్ ఆయిల్ లోని అమేజింగ్ బెన్ఫిట్స్ గురించి మనందరికి తెలుసు. అయితే నువ్వుల నూనెను కూడా మన పూర్వీకులు ఉపయోగించేవాళ్లు. ఇప్పుడైతే.. నువ్వుల నూనెను పూజలకు ఉపయోగిస్తాం. కానీ.. నువ్వుల నూనెతో జుట్టుకి కలిగే బెన్ఫిట్స్ మీకు తెలుసా ?

sesame oil

నువ్వుల నూనె చాలా మందంగా ఉంటుంది. అందుకే దీన్ని చాలామంది ఇష్టపడరు. కానీ ఇందులో బెన్ఫిట్స్ తెలిస్తే మాత్రం మీరు జుట్టుకి ఖచ్చితంగా అప్లై చేస్తారు. కొన్నిసార్లు కొంతమంది నువ్వుల నూనెను వంటకాల్లో కూడా ఉపయోగిస్తారు.

నువ్వుల నూనెలో మెగ్నీషియం, విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ ఈ, క్యాల్షియం ఉంటాయి. ఇవన్నీ.. జుట్టుకి చాలా అద్భుత ఫలితాలను అందిస్తాయి. అంతేకాదు.. ఇన్ని పోషకాలు ఒకే ఆయిల్ లో లభించడం చాలా కష్టం. సాధారణంగా.. ఒక్కో ఆయిల్ ఒక్కో ప్రయోజనం దాగుంటుంది.

మీకున్న అన్ని రకాల జుట్టు సమస్యలను.. దూరం చేయడంలో నువ్వుల నూనె చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అలాగే నువ్వులు తినడం వల్ల కూడా జుట్టు, చర్మ సమస్యలు దూరమవుతాయి. అయితే నువ్వుల నూనెను జుట్టుకి పట్టించడం వల్ల ఎలాంటి బెన్ఫిట్స్ పొందవచ్చో చూద్దాం..

డ్యామేజ్ హెయిర్

డ్యామేజ్ హెయిర్

నువ్వుల నూనె స్కాల్ప్ కి పోషణ అందించి.. డ్యామేజ్ అయిన జుట్టుని రిపేర్ చేస్తుంది. జుట్టు ఆరోగ్యంగా మారడానికి సహాయపడుతుంది.

చుండ్రు నివారించడానికి

చుండ్రు నివారించడానికి

చుండ్రు నివారించడంలో కూడా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది నువ్వుల నూనె. రాత్రి నిద్రపోవడానికి ముందు నువ్వుల నూనెతో స్కాల్ప్ కి బాగా మసాజ్ చేసి.. ఉదయం తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే.. చుండ్రు తొలగించవచ్చు.

తెల్లజుట్టు

తెల్లజుట్టు

నువ్వుల నూనె జుట్టుని నల్లగా మారుస్తుంది. కానీ.. ప్రతిరోజూ నువ్వుల నూనెతో స్కాల్ప్ ని మసాజ్ చేస్తేనే తెల్లజుట్టుని నల్లగా మార్చుకోవచ్చు. కానీ.. ఇలా చేస్తే కంపల్సరీ ఫలితాలు పొందుతారు.

షైనీ హెయిర్

షైనీ హెయిర్

జుట్టుకి కండిషనర్ లా కూడా నువ్వుల నూనెను ఉపయోగించవచ్చు. కండిషనర్ లా ఉపయోగిస్తే.. మీ జుట్టు మీరు ఊహించిన దానికంటే ఎక్కువ షైనీగా మారుతుంది. 2 నుంచి 3 చుక్కల నువ్వుల నూనెను.. జుట్టు చివర్లకు పట్టించి.. అలాగే వదిలేయాలి.

రఫ్ హెయిర్

రఫ్ హెయిర్

నువ్వుల నూనెను ఒకసారి మీ జుట్టుకి ఉపయోగిస్తే.. రఫ్ గా మారిన జుట్టు.. సాఫ్ట్ గా, షైనీగా మారుతుంది. రాత్రంతా అలాగే వదిలేసి.. ఉదయానికి ఫలితాలు మీరే గమనించవచ్చు.

డీప్ కండిషనర్

డీప్ కండిషనర్

నువ్వుల నూనె జుట్టుకి డీప్ కండిషనర్ లా ఉపయోగపడుతుంది. డీప్ కండిషనర్ లో నువ్వుల నూనెను మిక్స్ చేసి రాసుకుని.. గంట తర్వాత శుభ్రం చేసుకుంటే.. మరింత మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

డ్రై హెయిర్

డ్రై హెయిర్

నువ్వుల నూనె, నిమ్మరసం కలిపి జుట్టుకి అప్లై చేయాలి. వేడినీటిలో తడిపి.. పిండేసిన టవల్ ని జుట్టుకి కట్టుకోవాలి. గంట తర్వాత మామూలుగా శుభ్రం చేసుకున్న శుభ్రం చేసుకుంటే.. జుట్టు మాయిశ్చరైజ్డ్ గా ఉంటుంది.

English summary

Why You Should Use Sesame Oil For Your Hair

Why You Should Use Sesame Oil For Your Hair. Sesame oil is one great cocktail of nutrients. Here's why you should use it for your hair.
Story first published: Friday, November 18, 2016, 10:50 [IST]
Desktop Bottom Promotion