For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒక్క నెలలో జుట్టు ఒత్తుగా..పొడవుగా పెరగడానికి సహాయపడే 11 బెస్ట్ హెయిర్ ఆయిల్స్

మనం అందరం మన జుట్టు పోషణకు మరియు జుట్టు పెరుగుదల కోసం కొన్ని బెస్ట్ ఆయిల్స్ ను ఎంపిక చేసుకుంటాం. తలకు, ఆయిల్ మసాజ్ చాలా మంచిది. ఆయిల్ మసాజ్ హెయిర్ గ్రోత్ ను పెంచుతుంది.

|

మనం అందరం మన జుట్టు పోషణకు మరియు జుట్టు పెరుగుదల కోసం కొన్ని బెస్ట్ ఆయిల్స్ ను ఎంపిక చేసుకుంటాం. తలకు, ఆయిల్ మసాజ్ చాలా మంచిది. ఆయిల్ మసాజ్ హెయిర్ గ్రోత్ ను పెంచుతుంది, తల, జుట్టుకు సంబంధించి కొన్ని సమస్యలను అరికడుతుంది మరియు పొడిబారిన కేశాలను మరియు చిక్కుబడిన కేశాలకు నేచురల్ గా చికిత్సనందిస్తుంది. జుట్టు సంరక్షణలో చాలా రకాల నూనెలు ఉన్నాయి వాటిలో కొబ్బరి నూనె చాలా ప్రసిద్ది చెందినది.

జుట్టుకు పెరుగుదల కోసం ఉపయోగించే నూనెల్లో చాలా రకాలు ఉన్నాయి. అయితే ఎన్ని రకాల నూనెలున్నప్పటికి జుట్టుకు సంబంధించనంత వరకూ నేచురల్ గా పెరిగేలా చేసే నూనెలు మన ఇండియన్ ఆయిల్సే. ఈ ఆయుర్వేద జుట్టు రహస్యాన్ని పురాతన గ్రంథాలలో రాసినట్లు చెప్పబడింది. ఆయుర్వేదంలో చాలా రకాల మూలికా తైలాలు ఉన్నాయి. అవి మీ హెయిర్ డ్యామేజ్ ను అరికడుతుంది మరియు జుట్టుకు కావల్సిన పోషణను అందించడానికి సహాయపడుతాయి. మరి జుట్టును ఒత్తుగా..పొడవుగా పెరగడానికి సహాయపడే నూనెలేంటో ఒకసారి తెలుసుకుందాం..

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె:

మన భారత దేశంలో చాలా వరకూ కేశ సంరక్షణకు ఉపయోగించే నూనెలో కొబ్బరి నూనె ప్రధానమైనది. కొబ్బరి నూనెలోని ఓమేగా 3 యాసిడ్స్ హెయిర్ రూట్స్ కు చక్కటి పోషణను అందిస్తుంది. అంతే కాదు జుట్టు మందంగా మరియు వేగవంతంగా పెరుగడానికి సహాయపడుతుంది. తలస్నానాకి ముందు కొబ్బరి నూనెతో హెయిర్ మసాజ్ వారంలో రెండు మూడు సార్లు చేయడం వల్ల మంచి ఫలితాలను ఇస్తుంది. జుట్టు సమస్యలను జుట్ట పొడిబారడాన్ని మరియు దురద వంటి సమస్యలను అరికడుతుంది . కొబ్బరి నూనె తలకు మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. మరియు కేశాలకు మంచి మెరుపును ఇస్తుంది .

నువ్వుల నూనె:

నువ్వుల నూనె:

జుట్టు సంరక్షణలో కుక్కింగ్ ఆయిల్ విషయంలో, నువ్వుల నూనె లేకుండా పట్టిక పూర్తి కాదు. జుట్టు సంరక్షణకు నువ్వులను నూనెను ఎంపిక చేసుకోవడం ఒక మంచి ఎంపిక. నువ్వుల నూనెతో మీ తలకు మసాజ్ చేయడం వల్ల తలలో బ్లడ్ సర్క్యులేషన్ పెరిగుతుంది మరియు దాంతో జుట్టు పెరుగుదల ప్రారంభమౌతుంది.నువ్వుల నూనె యాంటీ డాండ్రఫ్ ఆయిల్. అయితే హెయిర్ గ్రోత్ కూడా బాగా ఉంటుంది. చుండ్ర వల్ల తలలోని చర్మ రంద్రాలు మూసుకుపోయి. జుట్టు కణాలకు గాలి సోకకుండా చేస్తుంది. కాబట్టి నువ్వుల నూనె డాండ్రఫ్ ను వదలగొడుతుంది. దాంతో కేశాలు ఆరోగ్యంగా పెరగుతాయి.

ఆముదం నూనె:

ఆముదం నూనె:

కాస్ట్రో ఆయిల్ కూడా జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడుతుంది. మీ కేశాలకు ఆముదం నూనెతో మసాజ్ చేయాలి. ఆముదం నూనెతో తలకు మసాజ్ చేయడం వల్ల జుట్టు రాలడాన్ని అరికడుతుంది మరియు జుట్టు పెరుగుదను ప్రోత్సహిస్తుంది. జుట్టు సంరక్షణలో ఇది బెస్ట్ ఆయిల్ గా భావించవచ్చు. ఇతి జుట్టు నాణ్యతను పెంచుతుంది.

మింట్ ఆయిల్ :

మింట్ ఆయిల్ :

జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే మరో నూనె పెప్పర్మింట్ ఆయిల్, పిప్పర్మింట్ ఆయిల్ నేచురల్ స్టిములాంట్ గా పనిచేస్తుంది. ఇది జుట్టుకు బాగా పడుతుంది. దాంతో జుట్టుకు కావల్సిన మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. హెయిర్ రూట్స్ ను బలోపేతం చేస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇందులో ఉండే ఆరోమా వాసన వాసను ఒత్తిడి తగ్గిస్తుంది.

ఆలివ్ ఆయిల్ :

ఆలివ్ ఆయిల్ :

ఆలివ్ ఆయిల్ (గాడ్ మదర్ ఆఫ్ హెయిర్' గా భావిస్తారు మరియు ఇది జుట్టు సంరక్షణలో అద్భుతాలను స్రుష్టిస్తుంది. ఇది జుట్టుకు అవసరం అయ్యే తేమను, పోషకాలను అధిస్తుంది మరియు లోతైన కండీషనర్ గాను ఉపయోగపడుతుంది. ఇంకా ఇది కేశాలకు బలాన్ని అధిస్తుంది మరియు చుండ్రును నివారిస్తుంది. ఆలివ్ ఆయిల్ కు కొద్దిగా తేనె మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి.

ల్యావెండర్ ఆయిల్ :

ల్యావెండర్ ఆయిల్ :

ల్యావెండర్ ఆయిల్లో అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. ఇది చాలా అద్భుతమైన నూనె . అనేక రెమెడీస్ లో దీన్ని విరివిగా ఉపయోగిస్తున్నారు. దీని ఆరోమా వాసన వల్లే బాతింగ్ ఆయిల్ గా బాగా పాపులర్ అయ్యింది. . అందుకే దీన్ని ఎక్కువగా థెరఫీలలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. హెయిర్ రూట్స్, హెడ్ మజిల్స్ ను ను రిలాక్స్ చేస్తుంది. దాంతో జుట్టు రాలడం తగ్గి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

చమోమెలీ ఆయిల్ :

చమోమెలీ ఆయిల్ :

ఒత్తైన జుట్టు పొందడానికి మరో నూనె చమోమెలీ టీ. ఇది జుట్టును పొడవుగా పెరిగేలా చేస్తుంది. ముఖ్యంగా ఇండియన్ హెయిర్ కు ఇది గ్రేట్ అని చెప్పవచ్చు. ఇందులో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. తలలో దురదను నివారిస్తుంది. జుట్టుకు రక్షణ కల్పిస్తుంది.

రోజ్మెర్రీ ఆయిల్ :

రోజ్మెర్రీ ఆయిల్ :

మరో ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్. జుట్టు రాలడం తగ్గించడంలో ఇది గ్రేట్ గా సహాయపడుతుంది. ఈ నూనె కూడా ఆరోమా వాసన కలిగి ఉంటుంది. అందుకే దీన్ని జుట్టు పెరుగుదలకు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. హెయిర్ ఫోలిసెల్స్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది . ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

బాదం ఆయిల్ :

బాదం ఆయిల్ :

బాదాం నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉండటం వల్ల హెయిర్ గ్రోత్ కు బాగా సహాయపడుతుంది. ఇది కూడా కొబ్బరి మరియు ఆమ్లా నూనెలు మాదిరే ఉంటుంది. అతి త్వరగా జుట్టు పెరగాలనుకొనే వారు బాదాం నూనెను ప్రతి రోజూ తలకు పట్టించాలి.బాదాం నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉండటం వల్ల హెయిర్ గ్రోత్ కు బాగా సహాయపడుతుంది. ఇది కూడా కొబ్బరి మరియు ఆమ్లా నూనెలు మాదిరే ఉంటుంది. అతి త్వరగా జుట్టు పెరగాలనుకొనే వారు బాదాం నూనెను ప్రతి రోజూ తలకు పట్టించాలి.

సేజ్ ఆయిల్ :

సేజ్ ఆయిల్ :

ఈ నూన ఒత్తైన, బలమైన, ప్రకాశవంతమైన జుట్టును అందిస్తుంది. ఇలాంటి జుట్టును కోరుకునే వారు, సేజ్ ఆయిల్ ను తప్పకుండా ఉపయోగించాలి. ఇందులో ఉండే ఆస్ట్రిజెంట్ నేచర్ తలను శుభ్రం చేస్తుంది. చుండ్రు నివారిస్తుంది, తలలో న్యూట్రీషియన్స్, ఆక్సిజన్ గ్రేట్ గా అబ్సార్బ్ అవుతుంది.

టీట్రీ ఆయిల్ :

టీట్రీ ఆయిల్ :

పొడి జుట్టు, డ్రై స్కాల్ప్ మరియు దురద కలిగించే చుండ్రుతో బాధపడుతుంటే తప్పకుండా టీట్రీ ఆయిల్ సహాయపడుతుంది. వీటికోసం ఎక్కువగా డబ్బు ఖర్చుచేయాల్సిన అవసరం లేదు. ఈ నూనెలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీసెప్టిక్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇది ఆరోగ్యకరమైన జుట్టును అందిస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

English summary

11 Best Oils For Hair Growth & Thickness In 1 Month

Improve your hair growth and thickness with these best hair oils to use for Indian hair!
Story first published: Friday, January 6, 2017, 16:17 [IST]
Desktop Bottom Promotion