జుట్టు ఒత్తుగా పెరగాలంటే క్యారెట్, ఉల్లిపాయ, టమోటో బాగా తినండి...

Posted By: Staff
Subscribe to Boldsky

మనం బరువు తగ్గించుకోవాలంటే, మనందరికీ తెలుసు వెజిటేబుల్స్ మనకు మంచి స్నేహాలని.డైటింగ్ మరియు ఇతర వ్యాయామాల కంటే మన తీసుకుని మంచి ఆహారం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు, బరువు తగ్గిస్తాయి!అంతే కాదు ఇటువంటి ఫ్రెష్ వెజిటేబుల్స్ జుట్టుకు కూడా అద్భుతంగా సహాయపడుతాయి. మనకు అందుబాటులో ఉండే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లో విటమిన్స్, ఫైబర్, మరియు మినిరల్స్ అధికంగా ఉన్నాయి. ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. హెయిర్ స్ట్రక్చర్ ను మెయింటైన్ చేసి, జుట్టును స్మూత్ గా మార్చుతాయి.

కాబట్టి, మీ జుట్టు అందంగా మరియు ఆరోగ్యంగా పెరగడానికి కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను లిస్ట్ అవుట్ చేయడం జరిగింది.అయితే ముందుగా వాటి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే..

ఈ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ను జుట్టుకు అప్లై చేయడం వల్ల వెంటనే డ్రైగా మారకముందు వాటిలోని న్యూట్రీషియన్స్ ను జుట్టు గ్రహించేలా చేస్తాయి. కాబట్టి, ముందుగా తలను శుభ్రంగా ఉంచుకోవాలి. అందుకు ప్యాక్ వేసుకోవడాని ముందు తలస్నానం చేయాలి. తలను శుభ్రంగా ఉంచుకోవాలి. తర్వాత హెయిర్ ప్యాక్ అప్లై చేసి,ఒకటి రెండు గంటల తర్వాత తిరిగి తలస్నానం చేయాలి. కానీ ఈ హెయిర్ మాస్క్ లు చాలా విలువైనవి, ప్రయోజనకరమైనవి. సలూన్స్ లో ఇలానే చేస్తుంటారు .

తలకు గోరువెచ్చని నీళ్లు ఉపయోగించడం వల్ల హెయిర్ మరియు తలలో చర్మ రంద్రాలు తెలరచుకుంటాయి. అయితే చల్లనీళ్లతో స్నానం చేస్తే అలా ఓపెన్ అయిన చర్మ రంద్రాలను క్లోజ్ అవుతాయి. కాబట్టి ఏవేని హెయిర్ ప్యాక్స్ ఉపయోగించడానికి ముందు హెయిర్ వాష్ కోసం గోరువెచ్చని నీటిని ఉపయోగించి , హెయిర్ ప్యాక్ వేసుకున్న తర్వాత చల్లటి నీటితో తలస్నానం చేయాలి.

మరి వేడిగా ఉన్న నీళ్లతో తలస్నానం చేయకూడదు. ఇలా చేయడం వల్ల తలలో నేచురల్ ఆయిల్స్ తగ్గి, హెయిర్ ఎలాసిటి తగ్గిపోతుంది.కొన్ని రకాల వెజిటేబుల్స్ కొంచెం ఘాటైన, ఇబ్బందికరమైన వాసన కలిగి ఉంటుంది. కాబట్టి, మీకు నచ్చిన కండీషనర్ ను ఉపయోగించడం వల్ల వాసన తగ్గుతుంది.

అయితే హెయిర్ మాస్క్ వేసుకున్న తర్వాత, అవి జుట్టు గ్రహించడానికి కొద్ది సమయం పడుతుంది కాబట్టి, కనీసం అరగంట నుండి ఒక గంట సేపు అలాగే ఉంచుకోవాలి. అయితే అంత కంటే ఎక్కువ సమయం ఉంచకూడదు. హెయిర్ మాస్క్ వేసుకున్న అరగంటకు తలస్నానం చేస్తే ఎఫెక్టివ్ రిజల్ట్ కనబడుతాయి . ఒక గంట కంటే ఎక్కువ సేపు హెయిర్ మాస్క్ ఉంచుకోవడం వల్ల ఓవర్ డ్రైయింగ్ వల్ల జుట్టులోని నీటిశాతాన్ని తగ్గించేస్తుంది. ఫలితం ఆశించినంత గా ఉండదు.

మరి జుట్టు ఆరోగ్యానికి అందానికి, పెరుగుదలను ఉపయోగించే వెజిటేబుల్స్ గురించి తెలుసుకుందాం

1. ఆకుకూర:

1. ఆకుకూర:

ఆకుకూరల్లో న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి. ఆకుకూరల్లో ఫైబర్ , ఐరన్, జింక్ అధికంగా ఉంటాయి. ఇంకా ఇతర విటమిన్స్, మినిరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ రెండు పర్టిక్యులర్ మినిరల్స్ జుట్టకు అత్యంత ఉపయోగకరమైనవి. జింక్, ఐరన్ లు జుట్టు రాలడం తగ్గిస్తాయి.

2. క్యారెట్స్ :

2. క్యారెట్స్ :

జుట్టు పెరుగుదలకు ఉపయోగపడే వెజిటేబుల్స్ లో క్యారెట్ రెండోది. క్యారెట్స్ లో విటమిన్ బి7 లేదా బయోటిన్ అధికంగా ఉంది. ఇది హెల్తీ టానిక్ లా పనిచేస్తుంది. బయోటిన్ హెయిర్ రీగ్రోత్ కు చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. అదే విధంగా జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది, జుట్టును స్ట్రాంగ్ గా ఉంచుతుంది. జుట్టు రాలడం అరికడుతుంది.కొద్దిగా క్యారెట్ ను ఉడికించి మిక్సీలో వేసి బ్లెండ్ చేయాలి. ఉడికించిన నీళ్లను పడేయకుండా గ్రైండ్ చేయడానికి ఉపయోగించుకోవాలి. ఈ పేస్ట్ ను తలకు ప్యాక్ వేసుకుని అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

3. ఉల్లిపాయలు:

3. ఉల్లిపాయలు:

ఉల్లిపాయల్లో న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరగడానికి గ్రేట్ గా సహాయపడుతాయి. ఇందులో ఉండే జింక్, ఐరెన్, బయోటిన్స్ జుట్టు పెరుగుదలకు సహాయపడుతాయి. అదనంగా జుట్టు పెరుగుదలకు సహాయపడుతాయి. ఇది ఒక అద్భుతమై వెజిటేబుల్ , తెల్ల జుట్టును నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

4. స్వీట్ పొటాటో :

4. స్వీట్ పొటాటో :

స్వీట్ పొటాటో లో అద్భుతమైన బీటాకెరోటిన్స్ ఉన్నాయి. ఈ బీటా కెరోటిన్ ను మన శరీరం విటమిన్ ఎగా మార్చుతుంది. మన శరీరంలో సెల్స్ రిపేర్ చేయడంలో బీటా కెరోటిన్ గ్రేట్ గా సహాయపడుతుంది. స్వీట్ పొటాటో విటమిన్ ఎ అవసరమైన మోతాదాలు మార్పు చేస్తుంది.

5. టమోటోలు:

5. టమోటోలు:

టమోటోల్లో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. యాంటీఆక్సిడెంట్స్ ఎఫెక్టివ్ సెల్ రిపేరింగ్ ఏజెంట్స్, ఇది శరీరంలో మలినాలను తొలగిస్తుంది. టాక్సిన్ ను తొలగిస్తుంది. టమోటోలను నేరుగా తినడం కానీ లేదా తలకు పేస్టే అప్లై చేయడం కానీ చేస్తే మంచి ఫలిత ఉంటుంది. జుట్టుకు మంచి షైనింగ్ వస్తుంది.

6. వెల్లుల్లి:

6. వెల్లుల్లి:

వెల్లుల్లిలో ఘాటైన వాసన ఉంటుంది. వెల్లుల్లి జుట్టు పెరుగుదలకు మంచి టానిక్ లా పనిచేస్తుంది. కాబట్టి రెగ్యులర్ డైట్ చార్ట్ లో చేర్చడం మంచిది. వెల్లుల్లిలో సల్ఫర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది జుట్టు రీగ్రోత్ అవ్వడానికి గ్రేట్ గా సహాయపడుతుంది.

7. బీట్ రూట్ :

7. బీట్ రూట్ :

రెడ్ కలర్ బీట్ రూట్ లో లైకోపిన్ అధికంగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. బీట్ రూట్ లో ఉండే లైకోపిన్ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, న్యూట్రీషియన్స్ ను అందిస్తుంది.

8. కరివేపాకు:

8. కరివేపాకు:

జుట్టుకు అందించే ప్రయోజనాల్లో కరివేపాకు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే కరివేపాకు జుట్టు రాలడం తగ్గించడంలో అద్భుతమైన యాంటీడోట్. కరివేపాకులో కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు ఐడియల్ టానిక్, అద్భుతమైన జుట్టును అందిస్తుంది.

9. ఫ్రెంచ్ బీన్స్ :

9. ఫ్రెంచ్ బీన్స్ :

ఫ్రెంచ్ బీన్స్ లో విటమిన్ ఎ మరియు ఇలు అధికంగా ఉంటాయి. విటమిన్ ఇ అద్భుతమైన జుట్టును అందిస్తుంది. హెయిర్ వాల్యూమ్ పెంచుతుంది. జుట్టు తెల్లగా మారకుండా నివారిస్తుంది.

10. పచ్చిమిర్చి:

10. పచ్చిమిర్చి:

కెరోటిన్, విటమిన్ ఇకి మరో సోర్స్ గ్రీన్ చిల్లీస్, ఇది జుట్టు పెరుగుదలకు గ్రేట్ గా సహాయపడుతుంది. డ్యామేజ్డ్ హెయిర్ సెల్స్ ను రిపేర్ చేస్తుంది. కొత్తగా హెయిర్ ఫాలీసెల్స్ ను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది.

11. ఆరెంజ్ బీటా కాంపౌండ్స్ ను

11. ఆరెంజ్ బీటా కాంపౌండ్స్ ను

అందిస్తుంది, దాంతో జుట్టు పొడవుగా పెరుగుతుంది. ఇవి హెయిర్ బ్రేకేజ్ మరియు హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది. ఆరెంజ్ లో ఉండే బీటా కెరోటిన్, జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. ఆరెంజ్, మరియు ఇతర ఎల్లో కరల్ వెజిటేబుల్స్ బెల్ పెప్పర్ వంటి వాటిలో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది

12. కీరదోసకాయ :

12. కీరదోసకాయ :

కీరదోసకాయ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఫ్రెష్ గా ఉండే కీరదోసకాయను మెత్తగా పేస్ట్ చేసి తలకు అప్లై చేయాలి. అవసరం అయితే, అందులో కొద్దిగా నానబెట్టిన మెంతులను జోడించడం వల్ల అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది.

English summary

12 Wonderful Vegetables For Hair Growth

Using warm water opens up your hair and scalp pores while cold water closes them. So use warm water before application and cold water post application. Avoid using hot water on your hair as it drains hair of its natural oils and lessens the elasticity.