రాత్రికి రాత్రి జుట్టును సాప్ట్ గా..మిళమిళ మెరిసేలా చేసే 5 హెయిర్ ప్యాక్స్

Posted By:
Subscribe to Boldsky

మీరు మీ జుట్టు గురించి కాస్తైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా? సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల జుట్టు పొడిబారి, చిక్కుబడి ఉంటుంది. కాబట్టి, రాత్రికి రాత్రి మీ జుట్టును సాప్ట్ గా మార్చుకోవాలంటే కొన్ని హోం మేడ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి.

కొన్ని మాయిశ్చరైజింగ్ ఉత్పత్తులను జుట్టుకు ఉపయోగించడం వల్ల జుట్టు నాణ్యత కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి కెమికల్స్ ప్రొడక్ట్స్ కాకుండా, నేచురల్ గా మన వంటింట్లో ఉండే మాయిశ్చరైజర్స్ తో జుట్టు సాప్ట్ గా మరియు ప్రకాశవంతంగా తయారవుతుంది. మరి మీ జుట్టును రాత్రికి రాత్రి సాప్ట్ గా,షైనీగా మార్చే హోం మేడ్ ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాం...

సాప్ట్ అండ్ షైనీ హెయిర్ కోసం హోం మేడ్ హెయిర్ కండీషనర్

1. కొబ్బరి పాలు-రోజ్మెర్రీ :

1. కొబ్బరి పాలు-రోజ్మెర్రీ :

కోకనట్ మిల్క్ ఎక్సలెంట్ మాయిశ్చరైజర్ . జుట్టుకు కొబ్బరి పాలను అప్లై చేయడం వల్ల జుట్టు స్ట్రాంగ్ మార్చి, సాప్ట్ గా, స్మూత్ గా, సిల్కీగా మార్చుతుంది. ఒక కప్పు కోకనట్ మిల్క్ లో, మూడు టేబుల్ స్పూన్ల రోజ్మెర్రీ కాలను కట్ చేసి వేయాలి. తర్వాత అందులోని కొద్దిగా విటమిన్ ఇ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు తలకు అప్లై చేసి మసాజ్ చేయాలి. షవర్ క్యాప్ పెట్టుకుని పడుకోవాలి. మరుసటి రోజు ఉదయం తలస్నానం చేస్తే మీరుకోరుకున్న సాఫ్ట్ అండ్ షైనీ, సిల్కీ జుట్టును పొందుతారు .

2. ఆముదం -ఆలివ్ ఆయిల్ :

2. ఆముదం -ఆలివ్ ఆయిల్ :

ఆముదం మరియు ఆలివ్ ఆయిల్ రెండూ మిక్స్ చేసి తలకు అప్లై చేస్తే జుట్టు సాప్ట్ గా, షైనీగా మారుతుంది. ఈ రెండు నూనెలను సమంగా తీసుకుని, రాత్రి నిద్రించడానికి ముందు జుట్టుకు అప్లై చేయాలి. మరుసటి రోజు ఉదయం తల స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

జుట్టు సాఫ్ట్ గా ఉండాలంటే 10 ఉత్తమ మార్గాలు

3. మెంతులు మరియు కొబ్బరి నూనె :

3. మెంతులు మరియు కొబ్బరి నూనె :

మెంతులు జుట్టును సాప్ట్ గా మార్చడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. జుట్టు రాలిపోకుండా స్ట్రాంగ్ గా మార్చుతుంది. చుండ్రు లేకుండా చేస్తుంది. కొబ్బరి నూనెలో మెంతులను వేసి వేడి చేయాలి. చల్లారిన తర్వాత తలకు అప్లై చేసి మసాజ్ చేయడం వల్ల జుట్టు సాప్ట్ గా తయారవుతుంది.ఈ నూనెను రాత్రి నిద్రించడానికి ముందు తలకు అప్లై చేసి మరుసటి రోజు ఉదయం తలస్నానం చేసుకోవాలి.

4. ఆలివ్ ఆయిల్ మరియు గుడ్డు :

4. ఆలివ్ ఆయిల్ మరియు గుడ్డు :

గుడ్డులో ఉండే కొలెస్ట్రాల్ జుట్టును సాప్ట్ గా మార్చుతుంది. రాత్రికి రాత్రి జుట్టును సాఫ్ట్ గా మరియు స్మూత్ గా మార్చుతుంది. అందుకు ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను గోరువెచ్చగా చేయాలి. తర్వాత అందులో ఎగ్ వైట్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసి షవర్ క్యాప్ పెట్టుకుని రాత్రంతా అలాగే ఉంచుకుని, మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి.

జుట్టురాలడాన్ని తగ్గించి పెరుగుదలకు సహాయపడే ఉల్లి

5. అవొకాడో :

5. అవొకాడో :

అవొకాడో నేచురల్ ఫ్యాట్ కలిగినది. ఇది జుట్టును సాఫ్ట్ గా మరియు షైనీగా మార్చుతుంది. అవొకాడో పేస్ట్ లో కొద్దిగా గుడ్డులోని పచ్చసొన, రెండు టేబుల్ స్పూన్ల పాలు కలిపి తలకు ప్యాక్ వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బ్లెండర్ లో వేసి బ్లెండ్ చేయాలి. రాత్రి నిద్రించే ముందు తలకు అప్లై చేసి మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి.

English summary

5 Best Ways to Get Soft Hair Overnight

If you have neglected your hair for too long and your hair has become dry and frizzy, you can soften your tresses overnight with simple homemade hair treatment.
Subscribe Newsletter