అలర్ట్ : బిర్యానీ ఆకుతో జుట్టు సమస్యలకు ఇక చెక్..!

Posted By:
Subscribe to Boldsky

బిర్యాని ఆకు అంటే తెలియని వారుండరు. ఆహారంలో.. ఇది.. మంచి ఫ్లేవర్ ని తీసుకొస్తుంది. బిర్యాని ఆకు గురించి జరిగిన కొన్ని అధ్యయనాలు.. అందులో దాగున్న సర్ ప్రైజింగ్ బ్యూటి బెన్ఫిట్స్ ని.. వివరిస్తోంది.

నమ్ముతారో లేదో కానీ.. ఇందులో ఉండే చాలా ముఖ్యమైన విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు, చర్మానికి అనేక ప్రయోజనాలు తీసుకొస్తాయి. జుట్టు సమస్యలను నివారించడంలో.. బిర్యాని ఆకు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అదెలాగో తెలుసుకుందాం..

చుండ్రు నివారిస్తుంది:

చుండ్రు నివారిస్తుంది:

బిర్యానీ ఆకుతో చుండ్రును సులభంగా దూరంగా చేసుకోవచ్చు. బిర్యానీ ఆకును నీటిలో కలిపి వేడి చేసి..ఆ మిశ్రమాన్ని చల్లారాక జుట్టుకు అప్లయ్ చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు జుట్టుకు పెట్టుకుంటే చుండ్రును తగ్గించుకోవచ్చు. లేదంటే బిర్యాను ఆకును నీళ్ళలో నానబెట్టి పేస్టుగా చేసుకుని జుట్టుకు పట్టిస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే చుండ్రు సమస్య అధికంగా ఉన్నవాళ్లు బిర్యానీ ఆకుల నూనెను తలకు రాసుకొని చల్లని నీళ్లతో తలకు రుద్దుకుంటే తగ్గిపోతుంది.

జుట్టు రాలడం తగ్గించి, జుట్టు పెరగడానికి సహాయపడుతుంది:

జుట్టు రాలడం తగ్గించి, జుట్టు పెరగడానికి సహాయపడుతుంది:

ఈ మిశ్రమం జుట్టు రాలటాన్ని తగ్గించి, వెంట్రుకలను మందంగా మారుస్తుంది. తలపై జుట్టు లేని ప్రాంతంలో ఈ మిశ్రమాన్ని అప్లై చేయటం వల్ల వీటిలో ఉండే ఎస్సేన్షియాల్ ఆయిల్‌, జుట్టు తిరిగి పెరిగేందుకు సాయపడతుంది అందుకే దీన్ని కొన్ని ఆయుర్వేదిక్ నూనెలో వాడటం జరిగింది.

పేలు నివారించడానికి

పేలు నివారించడానికి

తీవ్రంగా ఇబ్బందిపెట్టే పేలు నివారించడానికి 2 టేబుల్ స్పూన్ల బిర్యాని ఆకు పొడిని ఒక కప్పు నీటిలో మరిగించాలి. వడకట్టిన తర్వాత.. కాటన్ బాల్ ఉపయోగించి.. స్కాల్ప్ అంతా పట్టించాలి. గంట తర్వాత.. షాంపూతో శుభ్రం చేసుకోవాలి.

హెయిర్ కండీషనర్ గా :

హెయిర్ కండీషనర్ గా :

మీకు తెలుసా బిర్యానీ ఆకు ఒక నేచురల్ కండీషనర్ గా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ హెయిర్ ను స్మూత్ గా మార్చుతుంది. అలాగే షైనీగా కూడా మార్చుతుంది. అందుకు చేయాల్సిందల్లా బిర్యానీ ఆకులను నీటిలో వేసి 15 నిముషాలు మరిగించి, క్రింది దింపు చల్లగా ఆరనివ్వాలి. తర్వాత షాంపుతో తలస్నానం చేసిన తర్వాత చివరగా ఈ నీటితో తలారా పోసుకోవాలి. ఇలా రోజు విడిచి రోజు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

తలలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నివారిస్తుంది:

తలలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నివారిస్తుంది:

తలకు సరిగా నూనె అప్లై చేయకపోవడం వల్ల తలలో ఫంగల్ ఇన్ఫెక్షన్ పెరుగుతుంది. బిర్యానీ ఆకులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఇన్ఫెక్షన్స్ ను నాశనం చేయడానికి సహాయపడుతుంది. బిర్యానీ ఆకులను ఉడికించిన నీటితో తలకు శుభ్రం చేసుకుంటే చాలు బెటర్ రిజల్ట్ పొందుతారు.

తలలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది:

తలలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది:

కొన్ని సందర్బాల్లో తల బొడిపెలు, లేదా చిన్న చిన్న మొటిమలు లేదా వాపులకు గురి అవ్వడం గమనిస్తుంటాము. ఈ సమస్యలన్నీంటికి చెక్క పెట్టాలంటే బిర్యానీ ఆకు గొప్పగా సహాయపడుతుంది. కొన్ని బిర్యానీ ఆకులను తీసుకుని మెత్తగా పౌడర్ చేయాలి. ఈ పౌడర్ ను తలకు అప్లై చేయాలి. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవచ్చు.

తలలో దురద తగ్గిస్తుంది:

తలలో దురద తగ్గిస్తుంది:

కొద్దిగా బిర్యాని ఆకు తీసుకుని మెత్తగా పౌడర్ చేయాలి. అందులో కొద్దిగా కొబ్బరి నూనె మిక్స్ చేసి తలలో అప్లై చేయాలి. ఇది హెయిర్ ఫాలి సెల్స్ ను బలోపేతం చేస్తుంది. తలలో దురదను తగ్గిస్తుంది.

English summary

7 Benefits of Using the Bay Leaf For Hair

Bay leaf or commonly known as Tej Patta is one of the commonly used flavoured herbs in Asian countries. These leaves are always in the dried form and often used to add flavors in most of the dishes. Bay leaf is commonly used in Asian countries as a flavored herb. When it comes to beauty benefits, Bay leaf can be used in various forms right from the kitchen.
Story first published: Tuesday, April 11, 2017, 20:00 [IST]
Subscribe Newsletter