ఉంగరాల జుట్టున్న అమ్మాయి తెలుసుకోవాల్సిన 10 తెలివైన చిట్కాలు !!

Posted By: Lekhaka
Subscribe to Boldsky

ఉంగరాల జుట్టున్న అమ్మాయిలు నిత్యం ఎదుర్కునే సమస్యలు చాలానే ఉన్నాయి. ఉంగరాల జుట్టును మెయింటైన్ చేయడం చాలా కష్టంతో కూడిన పని అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

కాబట్టి, మీరు ఉంగరాల జుట్టుతో తంటాలు పడుతున్నా లేదా ఉంగరాల జుట్టుని ఎలా సవరించుకోవలో తెలుసుకోవాలి అనుకున్నాఈ ఆర్టికల్ చదవాల్సిందే మీ ఉంగరాల జుట్టు చక్కగా కనబడుతూనే ఆరోగ్యంగా ఉండడానికి పనికివచ్చే కొన్ని అద్భుతమైన, తప్పనిసరిగా ప్రయత్నించి చూడాల్సిన చిట్కాలను మేము ఈరోజు బోల్డ్ స్కై లో అందిస్తున్నాము.

కర్లీ హెయిర్ మెయింటైన్ చేయడానికి వెరీ సింపుల్ టిప్స్

కాల పరీక్షకు నిలిచిన ఈ చిట్కాలు మీ రింగుల జుట్టు జీవితాన్ని మార్చేస్తాయి పైగా ఇవి చాలా చౌకగానూ, ఇంట్లో చేసుకునేవి గానూ ఉంటాయి.

ఈ చికిత్సల కోసం బోలెడంత డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు లేదా నెలకు రెండుమూడు సార్లు సెలూన్ కి వేళ్ళనవసరం లేదు. ఈ చిట్కాలను మీరు రోజూ జడ సవరించుకునేటపుడు ప్రయత్నించి కొద్దిరోజుల్లోనే మార్పును గమనించవచ్చు.

మీ రింగుల జుట్టు చిక్కుబడకుండా ఉండేందుకు ఈ సౌందర్య చిట్కాలను పాటించి చూడండి.

ఒక వెడల్పాటి పళ్ళున్న దువ్వెన వాడండి

ఒక వెడల్పాటి పళ్ళున్న దువ్వెన వాడండి

ఇది అందరికీ తెలిసిందే అయినప్పటికీ, రింగులు తిరిగే మీ ఉంగరాల జుట్టు మీద బాగా పనిచేస్తుంది. రింగుల జుట్టును చిక్కుబడకుండా, ఊడకుండా దువ్వడానికి ఇవి బాగా పనికొస్తాయి. బైటకు వెళ్లేముందు ఇలాంటి దువ్వెనతో మీ రింగుల జుట్టు దువ్వుకుని వాటిని అలా ఉంచడానికి ఒక స్ప్రే కొట్టి చూడండి.

రింగుల జుట్టు కొస౦ తయారైన ఉత్పత్తులు వాడండి

రింగుల జుట్టు కొస౦ తయారైన ఉత్పత్తులు వాడండి

రింగుల జుట్టు కోసమే ప్రత్యేకంగా తయారైన షాంపూలు ఈ మధ్య మార్కెట్లో దొరుకుతున్నాయి. మీ ఉంగరాల జుట్టు చక్కగా ఉండేందుకు వీటిని వాడడం మంచిదని సిఫార్సుచేస్తున్నాము. షాంపూ గాని, కండిషనర్ కానీ, మూసే లేదా సీరం కానీ రింగుల జుట్టుకు పనికివస్తుందా లేదా అని లేబుల్ పరిశీలనగా చూడండి.

తడి జుట్టు తుడవడానికి కాటన్ టీషర్ట్ వాడండి

తడి జుట్టు తుడవడానికి కాటన్ టీషర్ట్ వాడండి

ఉంగరాల జుట్టు తొందరగా వూడిపోవడం లేదా చిక్కులు పడడానికి అవకాశం ఉంటుంది. ఈ చిన్న చిట్కా పాటించడం ద్వారా అనవసరమైన చిక్కుల నుండి మీ జుట్టును దూరం చేయవచ్చు. మీ జుట్టు తుడుచుకోడానికి టవల్ కి బడులుగా కాటన్ టీషర్ట్ వాడండి. ఈ చిట్కా పాటించిన కొద్ది రోజులలోనే మీ రింగుల జుట్టులో వచ్చిన మార్పు గమనించండి.

ఒక డిఫ్యూజర్ అటాచ్మెంట్ తో పొడిగా బ్లో చేయండి

ఒక డిఫ్యూజర్ అటాచ్మెంట్ తో పొడిగా బ్లో చేయండి

ఉంగరాల జుట్టు చిక్కుపడకుండా ఉండడానికి బాగా పనికివచ్చే మరో చక్కటి చిట్కా ఇది. మీ హెయిర్ డ్రయ్యర్ కి డిఫ్యూజర్ ని తగిలించి వామ్ లేదా కోల్డ్ సెట్టింగ్ లో ఉంచి వాడండి, ఎందుకంటే హాట్ సెట్టింగ్ లో ఉంచి వాడితే జుట్టు కుదుళ్ళకు బాగా నష్టం కలిగి, అవి చిట్లిపోయే అవకాశం ఉంటుంది.

షాంపూ చేసే ముందు వేడి నూనెను అప్లై చేయండి

షాంపూ చేసే ముందు వేడి నూనెను అప్లై చేయండి

వేడి నూనెతో జుట్టుకి చికిత్స చేయడం మీ ఉంగరాల జుట్టుకు జీవం పోస్తుంది. ఇంటిదగ్గర చేసుకునే ఈ చిట్కాను వారానికి ఒకసారి పాటించి మీ కుదుళ్ళ ఆరోగ్యాన్ని, వాటి రూపురేఖలను బాగా మెరుగుపరుచుకోవచ్చు. అంతేకాకుండా, ఈ సరళమైన బలమైన సాంప్రదాయ చికిత్స మీ రింగుల జుట్టును దువ్వుకోడానికి అనుకూలంగా చేస్తూ, అవి ఎండిపోయి, చిట్లిపోకుండా నివారిస్తుంది.

పడుకునే ముందు లీవ్-ఇన్-కండిషనర్ వాడండి

పడుకునే ముందు లీవ్-ఇన్-కండిషనర్ వాడండి

రాత్రిపూట మీ రింగుల జుట్టు చిక్కుబడకుండా చేయడానికి పడుకునే ముందు లీవ్-ఇన్-కండిషనర్ వాడడం మంచి ఉపాయం. పైగా, రాత్రి చేసిన ఈ చికిత్స వల్ల ఉదయం మీరు మృదువైన, తేలికైన రింగులతో నిద్రలేస్తారు. కాబట్టి, దీన్ని కనీసం వారానికి రెండుసార్లు చేయడం వల్ల మీ రింగులు రోజంతా అందంగా కనపడతాయి.

తడిగా ఉన్నపుడే జుట్టు దువ్వుకోండి

తడిగా ఉన్నపుడే జుట్టు దువ్వుకోండి

తడిగా ఉన్నపుడే జుట్టు దువ్వుకోండి. ఇది మీ రింగులను తేలికగా నిర్వహించుకోడానికి వీలు కలిపిస్తుంది. అలాగే, జుట్టు ఆరిన తరువాత రింగులను చిక్కులు తీస్తే జుట్టు వూడిపోడానికి, కుదుళ్ళు బలహీన పడడానికి అవకాశం ఉంటుంది.

English summary

7 Genius Hacks Every Curly Haired Girl Must Know

These tried and tested hacks can prove to be life-changing for your curls. Moreover, they are inexpensive and can be easily tried at the comfort of your own house.There is no need to spend big bucks on treatments or hit the salon 2-3 times a month. Just make these hacks a part of your daily hair care regimen and you will be able to witness the change in the state of your curls within a few days.
Story first published: Thursday, June 1, 2017, 14:00 [IST]
Subscribe Newsletter