జుట్టు ఆరోగ్యంగా..అందంగా పెరగడానికి 8 రకాల నూనెలు

By: Mallikarjuna
Subscribe to Boldsky

మీ జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి వెంట్రుకలకు నూనెలను అందించటం ఒక మంచి మార్గం అని చెప్పవచ్చు. ఇది భారతదేశంలో చాలా ప్రముఖ మరియు పురాతన కాలం నుండి అనుసరిస్తున్న పద్దతి. ఈ ఆధునిక కాలంలో కూడా వీటిని అనుసరించే వారి సంఖ్య ఇప్పటికి తగ్గలేదు. ఇంట్లో ఉండే ప్రతి స్త్రీ, కనీసం వారానికి ఒకసారైన జుట్టుకు నూనెలను అప్లై చేస్తున్నారు. స్కాల్ప్ పై కలిగే ఒత్తిడి, హానికర బ్యాక్టీరియా మరియు ఫంగస్ ల వలన కలిగే ఇన్ఫెక్షన్ లను తొలగించి, జుట్టుకు బలాన్ని చేసూరుస్తుంది.

వారానికి ఒకసారి వెంట్రుకలకు అందించే మాసాజ్ ను "చంపి" అని కూడా అంటారు. జుట్టు రకాన్ని బట్టి, నూనెలను మరియు అప్లై చేసే విధానాన్ని ఎంచుకోవాలి. జుట్టు పెరుగుదలకు కావసిన పోషకాలను తలపై చర్మం సహజంగా ఉత్పత్తి చేస్తుంది. కావున, తలపై చర్మానికి అందించే నూనెలు మరియు పరిమాణం చాలా ముఖ్యం. అధిక మొత్తంలో నూనెలను అందించటం వలన తలపై చర్మంలో ఉన్న రంధ్రాలు మూసుకుపోయి, వెంట్రుకలకు మరియు స్కాల్ప్ కి తీరని నష్టాన్ని కలుగచేస్తాయి. తలపై చర్మం పొడిగా ఉన్నవారి కన్నా, నూనెలను జిడ్డుగా ఉండే వారికి తక్కువ స్థాయిలో నూనెలు అందించాలి. మితిమీరిన స్థాయిలో లేదా తక్కువ స్థాయిలో నూనెలను అందించటం మీ జుట్టుకు తలపై చర్మానికి హానికరం. వీటితో పాటుగా మీ జుట్టు మరియు తలపై చర్మ రకాన్ని బట్టి నూనెల ఎంపిక చాలా ముఖ్యం.

జుట్టు రాలడం నివారించి, జుట్టు పెరగడాన్ని ప్రోత్సహించే 10 సింపుల్ టిప్స్

పనిచేసేవారు, ఉద్యగస్తులైతే రాత్రుల్లో జుట్టుకు నూనె అప్లై చేసి ఉదయం తలస్నానం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కొద్దిగా జిడ్డుగా అనిపించినా జుట్టుకు మంచి పోషణ అందుతుంది. కాబట్టి, మీ జుట్టును ఆరోగ్యంగా కాపాడుకోవడానికి కొన్ని డిఫరెంట్ ఆయిల్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి..

పామ్ ఆయిల్ :

పామ్ ఆయిల్ :

జుట్టు సమస్యలు ప్రాధమిక దశలో ఉన్నప్పుడు పామాయిల్ ను ఎంపిక చేసుకోండి. పామ్ ఆయిల్లో కెరోటినాయిడ్స్, విటమిన్ ఎ ఎక్కువగా ఉండటం వల్ల, ఇది హెయిర్ ఫోలిసెల్స్ కు పోషణను అందిస్తుంది. ఇది కొత్త జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. పాత జుట్టు మరింత బలంగా మారుతుంది. పామ్ ఆయిల్ ను షాంపుతో చేర్చి తలకు అప్లై చేయాలి. అరగంట తర్వాత తలస్నానం చేసి చూడండి వ్యత్యాసం మీకే తెలుస్తుంది. ఇలా వారానికొకసారి చేస్తే చాలు.

ఆలివ్ :

ఆలివ్ :

ఆయిల్ ఆలివ్ ఆయిల్ లో విటమిన్ ఈ ఎక్కువగా ఉండటం వల్ల స్కాల్ప్ కి పోషణ అందిస్తుంది. అలాగే జుట్టుని బలంగా, హెల్తీగా మారుస్తుంది. అలాగే.. వేగంగా పెరగడానికి సహాయపడుతుంది. కాబట్టి.. వారానికి కనీసం ఒకసారి.. ఆలివ్ ఆయిల్ మసాజ్ చేస్తే.. హెల్తీ హెయిర్ పొందుతారు. అలాగే డ్రై అండ్ డ్యామేజ్ అయిన జుట్టును రిపేర్ చేస్తుంది. తగిన మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టుకు కావల్సిన మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. అలాగే ఈ నూనెతో హెయిర్ ప్యాక్ వేసుకోవచ్చు ఎగ్ వైట్ లో ఆలివ్ ఆయిల్, తేనె కలపి తలకు ప్యాక్ వేసుకోవాలి. అరగంట తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

జుట్టురాలడాన్ని తగ్గించి పెరుగుదలకు సహాయపడే ఉల్లి

కాస్ట్రోఆయిల్(ఆముదం నూనె):

కాస్ట్రోఆయిల్(ఆముదం నూనె):

కాస్ట్రో ఆయిల్ కూడా జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడుతుంది. మీ కేశాలకు ఆముదం నూనెతో మసాజ్ చేయాలి. ఆముదం నూనెతో తలకు మసాజ్ చేయడం వల్ల జుట్టు రాలడాన్ని అరికడుతుంది మరియు జుట్టు పెరుగుదను ప్రోత్సహిస్తుంది. జుట్టు సంరక్షణలో ఇది బెస్ట్ ఆయిల్ గా భావించవచ్చు. ఇతి జుట్టు నాణ్యతను పెంచుతుంది.ఆముదంతో జుట్టుకు మర్దన చేయటం వల్ల జుట్టు రాలటం ఆగి, నల్లని, ఒత్తైన జుట్టు సొంతమవుతుంది. ఆముదానికి ఆవనూనె కలిపి రాసుకొంటే చిట్లిన జుట్టు ఆరోగ్యకరంగా మారుతుంది.

బాదాం నూనె:

బాదాం నూనె:

బాదాం నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉండటం వల్ల హెయిర్ గ్రోత్ కు బాగా సహాయపడుతుంది. ఇది కూడా కొబ్బరి మరియు ఆమ్లా నూనెలు మాదిరే ఉంటుంది. అతి త్వరగా జుట్టు పెరగాలనుకొనే వారు బాదాం నూనెను ప్రతి రోజూ తలకు పట్టించాలి.జుట్టు వత్తుగా పెరగడానికి ఇది చక్కగా పనికొస్తుంది. వారానికి రెండు సార్లు నూనెను పట్టించుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఎండకు, చలికి వెళ్లినప్పుడు.. ఉప్పునీటితో స్నానం చేసినప్పుడు.. జుట్టు చిట్లిపోకుండా ఆల్మండ్‌ నూనె కాపాడుతుంది..ఇది కూడా కొబ్బరి మరియు ఆమ్లా నూనెలు మాదిరే ఉంటుంది. అతి త్వరగా జుట్టు పెరగాలనుకొనే వారు బాదాం నూనెను ప్రతి రోజూ తలకు పట్టించాలి.

కొబ్బరినూనె:

కొబ్బరినూనె:

అందమైన జుట్టు పొందడానికి కొబ్బరినూనె చక్కటి ఆప్షన్. డ్యామేజ్ హెయిర్ ని , డ్రై హెయిర్ ని నివారించడానికి కొబ్బరినూనెతో స్కాల్ప్ ని, జుట్టుని మసాజ్ చేసి.. రాత్రంతా అలానే వదిలేసి.. ఉదయాన్నే శుభ్రం చేసుకోవాలి. కొబ్బరి నూనెలో ఉండే విటమిన్ కె మరియు ఇతర ఫ్యాటీ యాసిడ్స్ తలకు అవసరమయ్యే న్యూట్రీషియన్స్ ను అందిస్తుంది. గోరువెచ్చని కొబ్బరి నూనెను తలకు మసాజ్ చేయడం వల్ల జుట్టు సాప్ట్ గా మరియు స్ట్రాంగ్ గా మారుతుంది. కొబ్బరి నూనెలో ఉండే లూరిక్ యాసిడ్ హెల్తీ అండ్ హైడ్రేటెడ్ హెయిర్ ను అందిస్తుంది.

మస్టర్డ్ ఆయిల్(ఆవనూనె):

మస్టర్డ్ ఆయిల్(ఆవనూనె):

మందపాటి జుట్టు..నల్లటి జుట్టు పొందాలంటే మస్టర్డ్ ఆయిల్ ను ఉపయోగించవచ్చ. మస్టర్డ్ ఆయిల్ తలలో బ్లడ్ సర్కులేషన్ పెంచి జుట్టు పెరగడానికి సహాయపడుతుంది.ఈ వెజిటేబుల్ ఆయిల్ ఆవాల నుండి తయారుచేస్తారు. జుట్టు రంగును నల్లగా మార్చుతుంది. తెల్ల జుట్టును నివారిస్తుంది. ఆవనూనెను తలకు నేరుగా పట్టుకోవడం వల్ల అదనపు ప్రయోజనాలు పొందుతారు

తెల్ల జుట్టు, జుట్టు రాలడం సమస్యలెన్నైనా.. పరిష్కారం ఒక్కటే..!

సన్ ఫ్లవర్ ఆయిల్:

సన్ ఫ్లవర్ ఆయిల్:

సన్ ఫ్లవర్ ఆయిల్ ను వంటలకు కూడా ఉపయోగిస్తాం. కానీ, డ్యామేజ్ అయిన జుట్టుకు కూడా దీన్ని ఉపయోగిస్తాము. సన్ ఫ్లవర్ ఆయిల్ చాలా జిడ్డుగా ఉంటుంది. కాబట్టి, మితంగా మాత్రమే ఉపయోగించాలి. సన్ ఫ్లవర్ ఆయిల్ ఎమోలియంట్ గా పనిచేస్తుంది, ఇది మీ జుట్టు గల జుట్టుకు కండిషనర్ గా పనిచేస్తుంది. సన్ ఫ్లవర్ ఆయిల్ జుట్టు పెరుగుదలను పెంచుతుంది మరియు జుట్టు చిట్లతాన్ని నివారిస్తుంది. జుట్టు సంరక్షణలో కుక్కింగ్ ఆయిల్స్ లో కొబ్బరి నూనె తర్వాత అత్యంత ఎఫెక్టివ్ గా పనిచేసే కుక్కింగ్ ఆయిల్ సన్ ఫ్లవర్ ఆయిల్. సన్ ఫ్లవర్ ఆయిల్ కు కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి తలకు రాసి మసాజ్ చేయాలి.

గ్రేప్ సీడ్ ఆయిల్ :

గ్రేప్ సీడ్ ఆయిల్ :

గ్రేప్ సీడ్ ఆయిల్ ను జుట్టుకు అప్లై చేయడం వల్ల ఇది జుట్టు రాలే సమస్యలను తగ్గిస్తుంది. హెయిర్ ఫాలీ సెల్స్ ను స్ట్రాంగ్ గా మార్చుతుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టుకు మంచి వాల్యూమ్ ను , షైనింగ్ ను అందిస్తుంది.

ఏవిధంగా ఉపయోగించాలి: ఒక టేబుల్ స్పూన్ గ్రేప్ సీడ్ ఆయిల్ ను గోరువెచ్చగా కాచి తలకు అప్లై చేసి మసాజ్ చేయాలి. తలకు అప్లై చేసిన ఒక గంట తర్వాత రెగ్యులర్ షాంపు, కండీషనర్ తో తలస్నానం చేయాలి.

English summary

8 Different Oils That Promise Healthy And Happy Hair

Check out the list of different types of oils that you can add to your hair care agenda for managing and maintaining good hair.
Subscribe Newsletter