For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సూపర్ స్మూత్ & సిల్కీ హెయిర్ కోసం ఆపిల్ సైడర్ వినెగర్!

ఆపిల్ సైడర్ వినెగార్ చిన్న చిన్న కేశనాళికలలో కూడా రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది, ఇది జుట్టు తంతువులకి ఆక్సిజన్ మరియు పోషకాలను మెరుగ్గా అందిస్తుంది. తద్వారా జుట్టు పెరుగుదలను పెంచుతుంది..

By Ashwini Pappireddy
|

మీ జుట్టు ఎంత పొడిగా మరియు ఎంత కఠినంగా ఉందని చెప్పడానికి మీరు 1 నుండి 10 సంఖ్యలలో మీరు ఏ సంఖ్యని తీసుకుంటారు? ఎలాగో తెలుసుకోవాలని ఉందా? అయితే దీనిని తెలుసుకోవడానికి ఇక్కడ ఒక చిన్న కిటుకు వుంది. అదేంటంటే మీ అరచేతితో కొన్ని వెంట్రుకలను తీసుకొని కుదుళ్ళ దగ్గర నుండి చివరిదాకా నెమ్మదిగా కదపండి ఇలా జుట్టు ముందు వైపు, వెనుక భాగంలో కూడా చేయండి. అలా చేస్తున్నపుడు మీ జుట్టు చాలా గరుకుగా లేదా పొడిగా మరియు మీ చర్మం ఎర్రగా మారినట్లైతే, మీ జుట్టు బాగా పాడైందని అర్థం! ఈ సమస్యని పోగొట్టడానికి మీరు కేవలం చేయాల్సిందల్లా సహజమైన జుట్టు రెమెడీస్ ని ఉపయోగించడమే మీకున్న ఏకైక పరిష్కారం.

అవును, సహజ లక్షణాలను కలిగివున్న ఆపిల్ సైడర్ వినెగార్ తో జుట్టుని కడగటం వలన మీ జుట్టుని కచ్చితంగా కాపాడుతుంది. ఎలా వాడాలనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.యాపిల్ సైడర్ వినెగార్ లోవుండేఆమ్ల పదార్థం మీ జుట్టుని సంరక్షిస్తుంది. ఇందులో వుండే సహజ పిహె సంతులనాన్ని పాడవనివ్వకుండా చేసి, మీ స్కాల్ప్ ని శుభ్రపరుస్తుంది.

natural hair rinse recipe

వినెగార్ లో ఉండే ఎసిటిక్ యాసిడ్ చుండ్రు పెరుగుదలను విచ్ఛిన్నం చేస్తుంది మరియు దీని సంక్రమణకి కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగిస్తుంది, అంతేకాకుండా ఇది జుట్టుకి ఒక శక్తివంతమైన యాంటిమైక్రోబయాల్ ఏజెంట్ గా పనిచేస్తుంది.

ఆపిల్ సైడర్ వినెగార్ చిన్న చిన్న కేశనాళికలలో కూడా రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది, ఇది జుట్టు తంతువులకి ఆక్సిజన్ మరియు పోషకాలను మెరుగ్గా అందిస్తుంది. తద్వారా జుట్టు పెరుగుదలను పెంచుతుంది.

అంతేకాకుండా, ఆపిల్ సైడర్ వెనీగర్ జుట్టును స్మూత్ గా చేసి, చిట్లిన వెంట్రుకలను తొలగిస్తుంది మరియు జుట్టు కుదుళ్ళని బల పరిచి, సిల్కీ గా ఉండేలా చేస్తుంది.

మీ జుట్టు ని సహజంగా సిల్కీ గా వుంచుకోవడానికి ఈ క్రింది పద్ధతులని అనుసరించండి.

 దశ 1:

దశ 1:

కాచి చల్లార్చిన నీరు లేదా ఫిల్టర్ నీటిని ఒక కప్పులో తీసుకొని దానికి 2 టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వినెగార్ ని కలపండి. ఇది మీ జుట్టు యొక్క మందం మరియు పొడవు మీద ఆధారపడి, మీ జుట్టుకి

కావాల్సినంత తీసుకోండి.

దశ 2:

దశ 2:

తరువాత, ఈ మిశ్రమానికి 10 చుక్కల నిమ్మ నూనెని కలపండి. నిమ్మకాయ నూనెలో సిట్రిక్ ఆమ్లం మరియు విటమిన్ సి అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. వీటిలో వుండే ఈ రెండు గుణాల వలన మీ చర్మం ఆరోగ్యంగా మరియు జుట్టు మెరిసేలా ఉంచడానికి పని చేస్తుంది.

దశ 3:

దశ 3:

ఈ మిశ్రమానికి 10 చుక్కల రోస్మేరీ నూనె ని కలపండి. రోజ్మేరీ నూనె సుమారు 22.4% జుట్టు పెరగడంలో సహాయపడుతుంది. ఇంకా ఇది అకాలంగా మారె జుట్టు రంగుని తగ్గిస్తుంది.

దశ 4:

దశ 4:

కావాలనుకుంటే ఈ మిశ్రమానికి ఒక టేబుల్ స్పూన్ సేజ్ పొడిని కూడా కలపవచ్చును. సేజ్ ఆకులు మీ స్కాల్ప్ ని స్మూత్ గా చేసి, చిట్లిన వెంట్రుకల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

దశ 5:

దశ 5:

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని గాలి చేరని ఒక గట్టి సీసాలోకి బదిలీ చేయండి. అన్ని పదార్ధాలను బాగా కలపండి మరియు తరువాత 2 గంటల పాటు బాగా నాననివ్వండి.

దశ 6:

దశ 6:

మీ జుట్టునుండి చిక్కు ని తొలగించడానికి దువ్వెనని ఉపయోగించండి. దీనికోసం ప్రత్యేకంగా పెద్ద పళ్ళున్న దువ్వెనని ఎంచుకోండి. దీనివలన మీ వెంట్రుకలకి ఎక్కువ నష్టం కలగకుండా సులభంగా చిక్కుని వదిలించవచ్చును.

దశ 7:

దశ 7:

సాధారణంగా మీ జుట్టుని షాంపూ తో కడగండి. తర్వాత మీరు తయారుచేసుకున్న నూనెని తలమొత్తం బాగా రాసి 5 నిముషాల పాటు నెమ్మదిగా మసాజ్ చేయండి. మరొక 10 నిముషాల పాటు ఉండనిచ్చి తర్వాత సాదా నీటితో శుభ్రం చేసుకోండి.

దశ 8:

దశ 8:

ఇప్పుడు కావాలనుకుంటే తక్కువ రసాయనాలు ఉన్నటువంటి కండీషనర్ ని రాసుకోవచ్చు. కండీషనర్ రాసిన తరువాత మిగిలిన నీటిని జుట్టునుండి తొలగించండి. అదనపు తేమను తొలగించడానికి పాత టి-షర్టుతో మీ జుట్టు ని తుడుచుకోండి.

ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు

ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు

పలుచగా వున్న దానికి బదులుగా కొంచం మందంగా లిక్విడ్ గా వున్న వినెగార్ ని ఎంపిక చేసుకోండి, వీటిలో సాధారణంగా ఎక్కువ పోషకాలతో నిండి ఉంటుంది.

ఎల్లప్పుడూ లేబుల్ మీద 'సేంద్రీయ' మరియు 'వడకట్టబడని' అని వున్న బ్రాండ్ నే ఎంపిక చేసుకోండి.

చివరి ఫలితం

చివరి ఫలితం

ప్రతిసారి ఆపిల్ సైడర్ వినెగార్తో మీ జుట్టును శుభ్రం చేయాలి, దీనివల్ల ఎంతో మృదువైన సిల్కీ మరియు మెరిసే జుట్టుని మీరే చూస్తారు. మంచి ఫలితాలను పొందాలనుకుంటే ఈ సహజ మిశ్రమాన్ని వారానికి ఒకసారి ఉపయోగించండి.

English summary

Natural Hair Rinse Recipe | Hair Rinse Recipe With Apple Cider Vinegar | How To Make Hair Silky Naturally | Natural Ingredients To Make Hair Smooth | DIY Hair Smoothening Rinse |

On the scale of 1 to 10, how rough and dry is your hair? Here is a simple trick to find out. Turn inner side of your arm up. Take a small strand of your hair end and run it repeatedly on your arm. Back and forth. Does it feel spiky, and rough, and is your skin turning red?
Story first published:Saturday, December 9, 2017, 15:10 [IST]
Desktop Bottom Promotion