For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెయిర్ ఫాల్..డ్యాండ్రఫ్ ..వైట్ హెయిర్..ఇతర జుట్టు సమస్యలకు చెక్ పెట్టే కరివేపాకు!!

హెయిర్ కేర్ కోసం నేచురల్ హోం రెమెడీస్ ను ఎంపిక చేసుకోవడం మంచిది. అటువంటి నేచురల్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ లో కరివేపాకు ఒకటి. కరివేపాకేంటి ..జుట్టుకు ఎలా ఉపయోగపడుతుందన్న సందేహం చాలా మందికి కలగవచ్చు.

|

అందం విషయంలో జుట్టు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అలాగని పొడివాటి ఒత్తైన, ప్రకాశవంతమైన జుట్టును మెయింటైన్ చేయడం అంత సులభం కాదు. మార్కెట్లో అందుబాటులో ఉండే హెయిర్ ప్రొడక్ట్స్ అన్నీ ఏదో ఒకరకంగా జుట్టు మీద ప్రభావాన్ని చూపుతాయి. ప్రస్తుతానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనబడకపోయినా, ఈ కెమికల్స్ ప్రొడక్ట్స్ ను ఉపయోగించడం వల్ల దీర్ఘకాలం సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అందువల్ల అలాంటి పరిస్థితిని ఎదుర్కోకుండా ఉండాలంటే హెయిర్ కేర్ కోసం నేచురల్ హోం రెమెడీస్ ను ఎంపిక చేసుకోవడం మంచిది. అటువంటి నేచురల్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ లో కరివేపాకు ఒకటి. కరివేపాకేంటి ..జుట్టుకు ఎలా ఉపయోగపడుతుందన్న సందేహం చాలా మందికి కలగవచ్చు. కరివేపాకులు మీరు ఊహించని అమేజింగ్ బెనిఫిట్స్ దాగున్నాయి.

కరవేపాకే కదా....అనకండి అందులోని గొప్ప ఔషధ గుణాలు చూడండి...కరవేపాకే కదా....అనకండి అందులోని గొప్ప ఔషధ గుణాలు చూడండి...

ఒత్తైన..పొడవైన జుట్టును కోరుకునే వారు ఇతర సమస్యలు కూడా లేకుండా చేసుకోవాలి. తలలో దురద, చుండ్రు, జుట్టు పల్చగా మారడం, జుట్టులో నేచురల్ మాయిశ్చరైజింగ్ గుణాలు కోల్పోవడం వంటి సమస్యలు లేకుండా ఉండాలంటే కరివేపాకు గ్రేట్ గా సహాయపడుతుంది. కరివేపాకు అన్ని రకాల హెయిర్ రూట్ సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. కరివేపాకులో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి . ఇందులో ఉండే బీటా కెరోటిన్, అమినో యాసిడ్స్, ప్రోటీన్స్ మొదలగునవి డెడ్ హెయిర్ ఫోలిసెల్స్ ను నివారించడంలో సహాయపడుతాయి. దాంతో జుట్టు పెరుగుదలకు రక్షణగా సహాయపడుతుంది. కాబట్టి, రెగ్యులర్ హెయిర్ కేర్ లో కరివేపాకును తప్పనిసరిగా చేర్చుకోవాలి...

కరివేపాకుతో జుట్టు పొందే అమేజింగ్ బెనిఫిట్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం...

తెల్ల జుట్టును నివారిస్తుంది:

తెల్ల జుట్టును నివారిస్తుంది:

తెల్ల జుట్టును నివారించడంలో కరివేపాకు గ్రేట్ పదార్థం అని చెప్పవచ్చు. జుట్టు తెల్లబడుకు ముఖ్య కారణం పోషకాహార లోపం, ఆల్కహాల్ తీసుకోవడం మరియు జెనెటిక్ సమస్యలు . కరివేపాకులో ఉండే విటమిన్ బి , జుట్టు కోల్పోయిన నేచురల్ కలర్ మరియు పోషణను తిరిగి పునరుద్దరింపచేస్తుంది. కరివేపాకుతో హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ గా మారుతాయి. జుట్టుకు మరింత బెటర్ గా షైనింగ్ వస్తుంది.

జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది:

జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది:

కరివేపాకును రెగ్యులర్ గా జుట్టుకు ఉపయోగించడం వల్ల జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అందుకు మీరు చేయాల్సిందల్లా గుప్పెడు కరివేపాకు తీసుకుని, ఎండలో ఎండబెట్టాలి. తర్వాత ఈ ఆకులను మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈపౌడర్ కు కొద్దిగా పెరుగు చేర్చి, ఈ పేస్ట్ ను హెయిర్ రూట్స్ కు అప్లై చేయాలి. జుట్టు చివర్ల వరకూ అప్లై చేసి, అరగంట తర్వాత స్నానం చేయాలి.

హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది:

హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది:

ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఎదుర్కుంటున్న సమస్య హెయిర్ ఫాల్. కాబట్టి, సరైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. కరివేపాకు కొద్దిగా తీసుకుని అందులో పాలు జోడించి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ను హెయిర్ రూట్స్ కు అప్లై చేయాలి. ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి.

 జుట్టు పల్చబడటం తగ్గిస్తుంది:

జుట్టు పల్చబడటం తగ్గిస్తుంది:

70శాతం మంది మహిళలు జుట్టు పల్చబడే సమస్యతో బాధపడుతున్నారు. అందుకు అనేక రకాల కారణాలున్నాయి. ఈ సమస్యను నివారించడంలో కరివేపాకు గ్రేట్ గా సహాయపడుతుంది. కరివేపాకులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ హెయిర్ ఫాలీసెల్స్ ను బలోపేతం చేస్తుంది. జుట్టు పెరుగుదలకు సహాయపడి, జుట్టును స్ట్రాంగ్ గా మార్చుతుంది. ఇంకా కరివేపాకులో ఉండే బీటా కెరోటిన్ జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. జుట్టు పల్చగా మారకుండా అరికడుతుంది.

చుండ్రు నివారిస్తుంది:

చుండ్రు నివారిస్తుంది:

కరివేపాకులో ఉండే అనేక యాంటీఆక్సిడెంట్స్ డెడ్ స్కిన్ సెల్స్ ఏర్పడకుండా ఫోలిక్యులర్స్ ను నివారిస్తుంది. చుండ్రుకు ప్రధానకారణమైన వీటిని డెడ్స్ సెల్స్ ను నివారించడంలో కరివేపాకు గ్రేట్ గా సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్స్ తో పాటు, అమినో యాసిడ్స్ కూడా అధికంగా ఉన్నాయి. ఇది జుట్టుకు తగిన మాయిశ్చరైజర్ ను అందిస్తుంది.

హెయిర్ టానిక్ గా పనిచేస్తుంది:

హెయిర్ టానిక్ గా పనిచేస్తుంది:

కరివేపాకులో ఉండే గుణాలు హెయిర్ టానిక్ గా పనిచేస్తుంది. తలకు ఎప్పుడూ పోషణను , మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. గుప్పెడు కరివేపాకు తీసుకుని అందులో రెండు మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె మిక్స్ చేయాలి. రెండూ బాగా వేడి చేయాలి. తర్వాత చల్లారనివ్వాలి. ఇందులో ఉండే విటమిన్ బి6 హెయిర్ రూట్స్ ను స్ట్రాంగ్ గా మార్చుతుంది.

డ్యామేజ్ అయిన హెయిర్ రూట్స్ ను రిపేర్ చేస్తుంది:

డ్యామేజ్ అయిన హెయిర్ రూట్స్ ను రిపేర్ చేస్తుంది:

కాలుష్యం కారణంగా ..ఇతర కెమికల్ ట్రీట్మెంట్స్ కారణంగా డ్యామేజ్ అయిన జుట్టును, డ్రైగా మారిన జుట్టును నివారించడంలో కరివేపాకు గొప్పగా సహాయపడుతుంది. కరివేపాకులో ఉండే కొన్ని రకాల న్యూట్రీషియన్స్ డ్యామేజ్ అయిన హెయిర్ రూట్స్ ను రిపేర్ చేస్తుంది. కరివేపాకును పేస్ట్ చేసి అందులో కొద్దిగా మీకు నచ్చిన ఆయిల్ మిక్స్ చేసి తలకు అప్లై చేసి మసాజ్ చేయాలి. ఇది డ్యామేజ్ అయిన జుట్టును రిపేర్ చేయడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

English summary

Benefits Of Curry Leaves For Hair Care

We all know curry leaves are great ingredients to use for hair care, this article speaks about the benefits curry leaves have for hair and why we should use them often.
Desktop Bottom Promotion