శాశ్వతంగా జుట్టు రాలడం తగ్గించి,జుట్టు పెరుగేలా చేసే ఆయుర్వేదిక్ నూనెలు..

Posted By:
Subscribe to Boldsky

జుట్టు సంరక్షణ విషయంలో ఇప్పుడంటే రకరకాల నూనెలో అందుబాటులోకి వచ్చాయి కానీ, పురాతన కాలంలో ఎక్కువగా ఆయుర్వేదిక్ నూనెలను ఉపయోగించేవారు. ఆయుర్వేదిక్ నూనెలు జుట్టు రాలడం నివారించడంతో పాటు,తెల్ల జుట్టు, చుండ్రు వంటి సమస్యలను కూడా నివారిస్తుంది. ముఖ్యంగా ఆయుర్వేదిక్ నూనెలు పొడవైన..ఒత్తైన జుట్టు కలవారికి గ్రేట్ గా సహాయపడుతుంది.

ఈ మద్య కాలంలో డెర్మటాలజిస్ట్ సూచిస్తున్న ఆయుర్వేదిక్ నూనెలో జుట్టు సమస్యలను నివారించడం మాత్రమే కాదు, వాటి వల్ల జుట్టు పెరుగుదల కూడా ఉంటుందంటున్నారు.

అందువల్ల మీరు కూడా అటువంటి పొడవైన, ఒత్తైన...అందమైన జుట్టును కోరుకుంటున్నట్లైతే వెంటే కొన్ని రకాల ఆయుర్వేదిక్ నూనెలను ఫాలో అవ్వండి. ఈ ఆయుర్వేదిక్ నూనెలు పురాతన కాలం నుండి ఉపయోగించినవి కాబట్టి, వీటిని ఎంపిక చేసుకోమని సలహాలిస్తున్నారు నిపుణులు .

చుండ్రును తగ్గించే 15 ఆయుర్వేదిక్ రెమెడీస్

పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్న ఈ నూనెల వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. 100శాతం నేచురల్ గా పనిచేస్తాయి. ఈ ఆయుర్వేదిక్ నూనెలో నేచురల్ గా పోషకాలు, విటమిన్స్ , జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.

మరి ఈ ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్స్ గురించి తెలుసుకుని, మీ జుట్టు సమస్యలను శాశ్వతంగా దూరం చేసుకోండి. మరి ఆయుర్వేదిక్ నూనెలలో ఉండే ఎఫెక్టివ్ బెనిఫిట్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం..

ఆమ్లా ఆయిల్ :

ఆమ్లా ఆయిల్ :

ఉసిరికాయలతో తయారుచేసిన నూనెలను పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. ఈ నూనెలో ఉండే గుణాలు జుట్టు రాలడం నివారించి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఈ ఆమ్లా ఆయిల్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.అందుకే ఈ నూనెను ఆనాటి కాలం నుండి ఈ నాటి కాలం వరకూ ఉపయోగిస్తున్నారు. జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో ఆమ్లా ఆయిల్ గ్రేట్ గా సహాయపడుతుంది. ఆమ్లా ఆయిల్ కు వెజిటేబుల్ ఆయిల్ కొనోలా లేదా పీనట్ ఆయిల్ ను ఉపయోగించుకోవచ్చు.

ఏవిధంగా ఉపయోగించాలి:

ఆమ్లా ఆయిల్ ను తీసుకుని, జుట్టుకు అప్లై చేసి తలకు బాగా మసాజ్ చేయాలి. తర్వాత షవర్ క్యాప్ పెట్టుకుని రాత్రి అలాగే నిద్రించి, తర్వాత రోజు ఉదయం హెర్బల్ షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు సమస్యలు తగ్గుతాయి. జుట్టు పెరుగుదల మెరుగ్గా ఉంటుంది.

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె:

మిరాకులస్ ఆయుర్వేదిక్ ఆయిల్. దీన్ని కొన్ని శతాబ్దాల కాలం నుండి ఉపయోగిస్తున్నారు. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇంకా ఇందులో ఉండే ట్రైగ్లిజరైడ్స్ ప్రోటీన్స్ కూడా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. ఆ ఆయుర్వేదిక్ నూనెను తలకు అప్లై చేయడం వల్ల జుట్టు స్ట్రాంగ్ గా..ఒత్తుగా పెరుగతాయి.

ఏవిధంగా ఉపయోగించాలి:

రెండు మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె తీసుకుని గోరువెచ్చగా వేడి చేసి తలకు అప్లై చేసి మసాజ్ చేయాలి. రాత్రింతా అలాగే ఉండనిచ్చి మరుసటి రోజు ఉదయం తలస్నానం స్నానం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది.

 బ్రింగరాజ్ ఆయిల్ :

బ్రింగరాజ్ ఆయిల్ :

ఇండియన్స్ హెయిర్ కు ఫర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. జుట్టు రాలడం నివారిస్తుంది. జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. జుట్టు రాలడం నివారించుకోవడానికి ఉపయోగించే ఈ ఆయుర్వేదిక్ నూనె ఆయుర్వేద హెర్బ బ్రింగరాజ్, సింటెల్లా ఉండటం వల్ల జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే గుణాలు ఇందులో అధికంగా ఉన్నాయి.

ఏవిధంగా ఉపయోగించాలి:

కొద్దిగా బ్రింగరాజ్ ఆయిల్ ను తీసుకుని, చేతిలో వేసుకుని, తలకు పట్టించి, బాగా మసాజ్ చేయాలి. మసాజ్ చేసిన తర్వాత రెండు మూడు గంటలు అలాగే వదిలేసి, మరుసటి రోజు ఉదయం హెర్బల్ షాంపు మరియు కండీషనర్ తో తలస్నానం చేసుకోవాలి.

నువ్వుల నూనె:

నువ్వుల నూనె:

బెస్ట్ ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ . ఈ నూనె జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఈ నూనెలో అనేక ప్రయోజనాలున్నాయి. ఈ నూనెలో ఉండే విటమిన్ ఇ, మెగ్నీషియం జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు రాలే సమస్యలను ఎఫెక్టివ్ గా నివారిస్తుంది.

ఏవిధంగా ఉపయోగించాలి:

నువ్వుల నూనెకు కొబ్బరి నూనె కూడా సమంగా మిక్స్ చేసి తలకు అప్లై చేసి మసాజ్ చేయాలి. మూడు నాలుగు గంటల తర్వాత హెర్బల్ షాంపుతో తలస్నానం చేయాలి.

ఆముదం నూనె:

ఆముదం నూనె:

ఆముదం పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్న బెస్ట్ ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు రాలడం తగ్గిస్తుంది. ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేసి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు వాల్యూమ్ పెంచుతుంది. అదనంగా జుట్టుకు అవసరమయ్యే విటమిన్స్, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ను అందిస్తుంది. జుట్టు సమస్యలను నివారిస్తుంది.

ఏవిధంగా ఉపయోగించాలి:

ఆముదం నూనెను ఫింగర్ టిప్స్ తో తలకు అప్లై చేసి మసాజ్ చేయాలి. మసాజ్ చేసిన ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి.

ఆలివ్ ఆయిల్ :

ఆలివ్ ఆయిల్ :

జుట్టు రాలడం నివారించి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో మరో ఎఫెక్టివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ . ఆలివ్ ఆయిల్లో జుట్టు పెరుగుదలను అవసరమయ్యే మినిరల్స్, మోనోశ్యాచురేటెడ్ యాసిడ్స్ అధికంగా ఉండటం వల్ల ఇది మహిళల జుట్టుకు గ్రేట్ గా సహాయపడుతుంది. దీన్ని వారానికొకసారి అప్లై చేస్తే చాలు మంచి ఫలితం ఉంటుంది. జుట్టు పెరుగుతుంది.

ఏవిధంగా ఉపయోగించాలి:

ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ ను గోరువెచ్చగా చేసి, అందులో ఒక టేబుల్ స్పూన్ తేనె, దాల్చిన చెక్క పొడి మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి. డ్రై అయిన తర్వాత రెగ్యులర్ షాంపుతో తలస్నానం చేయాలి.

జోజోబ ఆయిల్ :

జోజోబ ఆయిల్ :

మరో ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ జోజోబ హెయిర్ ఆయిల్. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఈ పురాత ఆయుర్వేదిక్ ఆయిల్ ను జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడం మాత్రమే కాదు, హెయిర్ ఫోలిసెల్స్ ను స్ట్రాంగ్ గా మార్చుతుంది. నేచురల్ షైనింగ్ ను ఇస్తుంది.

ఏవిధంగా ఉపయోగించాలి: కొన్ని చుక్కల జోజోబ ఆయిల్లో కొద్దిగా ల్యావెండర్ ఆయిల్ మిక్స్ చేసి తర్వాత తలకు అప్లై చేయాలి. రెండు గంటల తర్వాత మీ ఫేవరెట్ షాంపు కండీషనర్ తో తలస్నానం చేయాలి.

గార్లిక్ ఆయిల్ :

గార్లిక్ ఆయిల్ :

ఇండియన్ ఆయిల్స్ లో గార్లిక్ ఆయిల్ ఒకటి. ఇది జుట్టు సమస్యలను ముఖ్యంగా తలలో ఇన్ఫెక్షన్, మొటిమలను, చుండ్రును, తగ్గిస్తుంది. ఇందులో ఉండే విటిమన్ ఇ, పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్ జుట్టు రాలడం తగ్గిస్తుంది. జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఏవిధంగా ఉపయోగించాలి: 5-6 చుక్కల గార్లిక్ నూనె తీసుకుని అందులో 5-6 రోజ్మెర్రీ ఆయిల్ మిక్స్ చేసి, తలకు అప్లై చేసి మసాజ్ చేయాలి. ఒక గంట తర్వాత రెగ్యులర్ షాంపుతో తలస్నానం చేయాలి.

గ్రేప్ సీడ్ ఆయిల్ :

గ్రేప్ సీడ్ ఆయిల్ :

గ్రేప్ సీడ్ ఆయిల్ ను జుట్టుకు అప్లై చేయడం వల్ల ఇది జుట్టు రాలే సమస్యలను తగ్గిస్తుంది. హెయిర్ ఫాలీ సెల్స్ ను స్ట్రాంగ్ గా మార్చుతుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టుకు మంచి వాల్యూమ్ ను , షైనింగ్ ను అందిస్తుంది.

ఏవిధంగా ఉపయోగించాలి: ఒక టేబుల్ స్పూన్ గ్రేప్ సీడ్ ఆయిల్ ను గోరువెచ్చగా కాచి తలకు అప్లై చేసి మసాజ్ చేయాలి. తలకు అప్లై చేసిన ఒక గంట తర్వాత రెగ్యులర్ షాంపు, కండీషనర్ తో తలస్నానం చేయాలి.

దానిమ్మ నూనె:

దానిమ్మ నూనె:

దానిమ్మ నూనె, మరో ఇండియన్ హెర్బల్ నూనె. పాలిశ్యాచురేటెడ్ ఆయిల్స్ కు పవర్ హౌస్ వంటిది. ఈ నూనెను తలకు అప్లై చేయడం వల్ల తలలో రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది. దీన్ని ఉపయోగించడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.

ఏవిధంగా ఉపయోగించాలి: కొన్ని చుక్కల దాన్ని నూనెను తలకు అప్లై చేసి, అందులో కొద్దిగా కొబ్బరి నూనెను మిక్స్ చేసి తలకు అప్లై చేసి మసాజ్ చేయాలి. ఈ కాంబినేషన్ నూనె జుట్టు రాలడంతో పాటు ఇతర సమస్యలను కూడా ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది.

English summary

Best Ayurvedic Hair Oils For Hair Growth And Thickness

Since time immemorial Ayurvedic hair oils have been used to treat all kinds of issues such as hair loss, thinning hair, greying of hair, etc, especially by Indians, who are known worldwide for their lustrous and long locks.
Story first published: Wednesday, May 24, 2017, 10:58 [IST]
Subscribe Newsletter