Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
జుట్టుకి రంగువేస్తున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే!
జుత్తుకి రంగు వేసుకోవడం అనేది ఇప్పుడు ఓ ఫ్యాషన్ అయింది. కొన్ని సంవత్సరాల క్రితం వరకూ తలకి రంగు వేసుకోవడం నామోషీగా భావించేవారు. ఇప్పుడు అవసరం ఉన్నా లేకపోయినా ఫ్యాషన్ పేరుతో రకరకాల రంగులు జుత్తుకు అప్లయ్ చేయడం యువతకు అలవాటుగా మారింది. అదే వారికి ప్రాణాంతకమవుతోంది అంటున్నారు పరిశోధకులు.
యువతులు తలకి రంగు వేసుకోవడం వలన వారికి రొమ్ము కాన్సర్ వచ్చే అవకాశాలు 23 శాతం ఉన్న విషయం వీరి అధ్యయనంలో వెల్లడైంది. గతంలో గర్భనిరోధక సాధనాలు ఉపయోగించడం, లేటు వయస్సులో బిడ్డకు జన్మనివ్వడం, పిల్లలకు పాలు ఇవ్వక పోవడం వంటి కారణాలు రొమ్ము కాన్సర్‌కు కారణమని వెల్లడయ్యింది.

ఇప్పుడు తలకి వేసుకునే రంగు కూడా రొమ్ము కాన్సర్ రావడానికి కారణం అవుతుందని వారు అంటున్నారు. ఈ రంగులలో ఉపయోగించే రసాయనాలు దీనికి ప్రధానకారణం కావచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయం మీద ఇంకా కొన్ని పరిశోధనలు నిర్వహించాల్సి ఉందని వారు చెబుతున్నారు. అంతలోపు మనం జుట్టుకు రంగు వేసుకునే ముందు తీసుకోవల్సిన కొన్ని జాగ్రత్తలు గురించి తెలుసుకుందాం...

రసాయనాలు లేని షాంపు
1. రసాయనాలు లేని షాంపులను ఎంపిక చేసుకోవాలి.

వాడే ఉత్పత్తుల్లో సల్ఫేట్ ఎక్కువగా ఉండకూడదు
2, వాడే ఉత్పత్తుల్లో సల్ఫేట్ ఎక్కువగా ఉండకూడదు. దీని వల్ల రంగు త్వరగా పోతుంది.

తలకు రంగు వేసుకున్న వారు ఎక్కువ సార్లు
3. తలకు రంగు వేసుకున్న వారు ఎక్కువ సార్లు తలస్నానం చేయకూడదు.

ప్రోటీన్లు అధికంగా ఉండే కండీషనర్లు
4. ప్రోటీన్లు అధికంగా ఉండే కండీషనర్లు వాడడం వల్ల జుట్టుకు బలాన్నిస్తాయిజ

జుట్టుకు రంగు వేసే వారు డ్రయర్లు వాడకపోవడం
5. వీలైనంత వరకు జుట్టుకు రంగు వేసే వారు డ్రయర్లు వాడకపోవడం చాలా మంచిదిజ

జుట్టుకు కొబ్బరి నూనె
6. తలస్నానం చేసే ముందు జుట్టుకు కొబ్బరి నూనె రాసుకోవాలి.

జుట్టుకు రంగు వేసుకునేటప్పుడు
7. జుట్టుకు రంగు వేసుకునేటప్పుడు తలలో చర్మానికి తగలకుండా జాగ్రత్త పడాలి.



Click it and Unblock the Notifications