ఇంట్లో స్వయంగా కోకనట్ క్రీమ్ తో హెయిర్ స్పా చేసుకునే పద్దతి!

Posted By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

ఈ రోజు నేను నిస్తేజంగా, పొడిగా మరియు దెబ్బతిన్న జుట్టుకు కొత్త జీవితాన్ని ఇచ్చే మరియు కొత్త జుట్టు పెరగడానికి సహాయపడే ఒక అద్భుతమైన జుట్టు స్పా చికిత్స గురించి మీతో షేర్ చేయాలనుకుంటున్నాను.

ఈ చికిత్స కోసం మీకు కిరాణా దుకాణాలలో వుండే 100% సహజమైన మరియు సులభంగా అందుబాటులో ఉండే 1 ఇంగ్రిడియెంట్ మాత్రమే మీకు అవసరమవుతుంది. అదేంటో చూసేద్దామా మరి!

Coconut Cream Hair Spa Treatment

½ కప్పు కొబ్బరి క్రీమ్

ఆవిరి కోసం ఉడికించిన నీరు

టవల్

ప్రిపరేషన్ సమయం

2 నిమిషాలు

చికిత్స సమయం

1 గంట మరియు 10 నిమిషాలు

Coconut Cream Hair Spa Treatment

తయారీ విధానం:

1. కొబ్బరి క్రీం ని సగం కప్పు తీసుకోండి మరియు ఉపయోగించడానికి వీలుగా దీనిని ప్రక్కన పెట్టండి.

2. సుమారు 10 నిమిషాలు మీ జుట్టును ఆవిరి పట్టండి. దీనికోసం ఒక కుండలో వీడి నీటిని ఉంచి మీరు మీ జుట్ట్టుకి ఆవిరి పట్టవచ్చు.

3. ఒక టవల్ తో మీ జుట్టు ని కవర్ చేసుకొని కుండ మీదకి వంగి మరియు కుండ మూత తీసి

మీ జుట్టుకి ఆవిరి పట్టించవచ్చు.

4.10 నిమిషాల తరువాత, ఆవిరి పట్టడం ఆపండి మరియు మీ జుట్టు మీద కొబ్బరి క్రీమ్ను అప్లై చేయండి.

5. సుమారు గంట సేపు అలానే క్రీమ్ ని వదిలివేయండి, కాసేపటి తరువాత మీ జుట్టును చల్లని నీటితో మరియు ఒక తేలికపాటి సల్ఫేట్ లేని షాంపూతో కడిగేయండి.

Coconut Cream Hair Spa Treatment

ఎంత తరచుగా దీనిని చేయాలి?

వారానికి ఒకసారి ఈవిధంగా చేయాలి.

Coconut Cream Hair Spa Treatment

ఇది ఎలా ఉపయోగపడుతుంది?

కొబ్బరి క్రీం లో కొవ్వు నూనెలు, విటమిన్లు B1, B3, B5, B6, C మరియు E లను సమృద్ధిగా కలిగివుంటుంది. ఇంకా కాల్షియం, ఇనుము, సెలీనియం, మెగ్నీషియం మరియు ఫాస్ఫరస్ వంటి ఖనిజాలను కూడా కలిగి ఉంది. ఈ పోషకాలు, లోతుగా మీ జుట్టు పరిస్థితి కి సహాయపడతాయి మరియు మీ జుట్టు ని పోషించి, మీ కుదుళ్లను ఆరోగ్యవంతంగా మరియు బలంగా తయారుచేస్తాయి. ఈ చికిత్స పొడి జుట్టు కోసం అద్భుతంగా పనిచేస్తుంది.

English summary

Coconut Cream Hair Spa Treatment

Coconut Cream Hair Spa Treatment,Read on to know more..