చుండ్రుతో సైడ్ ఎఫెక్ట్స్, నివారించే చిట్కాలు

Posted By:
Subscribe to Boldsky

టీనేజర్స్ ను ఎక్కువగా వేధించే సమస్య చుండ్రు. జుట్టు రాలడం ఒక సమస్య అయితే.. చుండ్రు మరింత ఇబ్బంది పెట్టే సమస్య. దీనివల్ల స్కాల్ఫ్ పై దుష్ర్పభావం చూపుతుంది. సాధారణంగా స్కాల్ఫ్ పొడిబారి, దురగా ఉంది అంటే.. చుండ్రు సమస్య మొదలైనట్టే. ఈ సమస్య ఎక్కువగా వింటర్, సమ్మర్ లో కనిపిస్తూ ఉంటుంది.

చలికాలంలో స్కాల్ఫ్ లో ఎక్స్ ట్రా మాయిశ్చరైజర్ విడుదలైతే.. సమ్మర్ లో స్కాల్ఫ్ పొడిబారుతుంది. దీనివల్ల చుండ్రు మొదలై.. దురద ఎక్కువగా ఉంటుంది. చుండ్రు ఒక్కసారి మొదలైంటి దాన్ని వదిలించడం చాలా కష్టమైన పని. షాంపూలు, కండిషనర్స్, ఆయిల్స్ వాడినా.. తాత్కాలిక ఉపశమనం పొందవచ్చు. కానీ.. మళ్లీ రెండ్రోజులకే.. డాండ్రఫ్ మొదలవుతుంది.

చుండ్రుతో సైడ్ ఎఫెక్ట్స్, నివారించే చిట్కాలు

చుండ్రు ఉందంటే ప్రశాంతతను కోల్పోయినట్టే. ఎందుకంటే.. దీనివల్ల వచ్చే దురద వల్ల.. ఇబ్బందిగా ఉంటుంది. కొంతమంది పెచ్చులు పెచ్చులగా భుజాలపై రాలుతుంది. మరికొందరికి.. తలలోనే అతుక్కుని ఉంటుంది. అయితే చుండ్రు సాధారణ సమస్యగా అందరికీ తెలుసు. కానీ.. చుండ్రు వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఎవరికీ తెలియదు. అవేంటో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి.

మొటిమలు

మొటిమలు

చుండ్రు రాలే సమస్య ఉన్న వాళ్లలో వాటి కారణంగా.. మొటిమలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ మీద పింపుల్స్ ఏర్పడే చర్మం అయితే.. డాండ్రఫ్ మరింత సమస్య తీసుకొస్తుంది. కాబట్టి వీలైనంత త్వరగా చుండ్రు నివారించే ప్రయత్నం చేయండి. అలాగే.. జుట్టు ముఖంపై పడకుండా జాగ్రత్త పడటం మంచిది.

జుట్టు రాలడం, బట్టతల, చుండ్రు నివారించే ఆనియన్ జ్యూస్ ట్రీట్మెంట్

చుండ్రుతో తలలో దురద

చుండ్రుతో తలలో దురద

తలలో డాండ్రఫ్ ఎక్కువగా ఉంటే.. స్కాల్ప్ ఎక్కువ డెడ్ స్కిన్ సెల్స్ ని ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల.. తల మాడు ఎక్కువ దురద పెడుతుంది. కాబట్టి.. చుండ్రు సమస్య మరీ ఎక్కువై.. దురదకు కారణమవుతుంటే.. చక్కటి హోం రెమిడీస్ ప్రయత్నించండి. లేదా డాక్టర్ ని సంప్రదించండి.

బ్యాక్ యాక్నె

బ్యాక్ యాక్నె

వెనక మెడ భాగంలో యాక్నేకి చుండ్రు ప్రధాన సమస్య అని నిపుణులు చెబుతున్నారు. బ్యాక్ యాక్నే నివారించాలంటే.. దానికి కారణమైన చుండ్రుని వదిలించడం చాలా ముఖ్యం.

చుండ్రుతో జుట్టు రాలే సమస్యలు

చుండ్రుతో జుట్టు రాలే సమస్యలు

చుండ్రు జుట్టు రాలే సమస్యకు డైరెక్ట్ గా కారణం కాకపోయినా.. చుండ్రు వల్ల వచ్చే దురద హెయిర్ ఫాల్ కి కారణమవుతుంది. కాబట్టి..చుండ్రుని నివారించడం వల్ల.. హెయిర్ ఫాల్ తగ్గించవచ్చు.

సొరియాసిస్

సొరియాసిస్

చుండ్రు సోరియాసిస్ కి కూడా కారణమయ్యే ఛాన్స్ ఉంది. చుండ్రు వల్ల చర్మంతో పాటు, తలలో కూడా ఎర్రటి పెచ్చులు ఏర్పడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ స్కిన్ ప్యాచెస్.. చెవి వెనక భాగంలో, వీపుపై ఏర్పడుతాయి.

చుండ్రు నివారించడానికి 7 ఉత్తమ హోం రెమెడీస్

చుండ్రుతో కంటి ఇన్ఫెక్షన్

చుండ్రుతో కంటి ఇన్ఫెక్షన్

చుండ్రు వల్ల ఐ ఇన్ఫెక్షన్ కి అవకాశం ఉందని.. నిపుణులు చెబుతున్నారు. కళ్లు ఎర్రబడటం, కళ్లు దురదగా ఉండటం వంటి సమస్యలు చుండ్రు వల్ల వస్తాయి.

చుండ్రుతో జుట్టు జిడ్డుగా

చుండ్రుతో జుట్టు జిడ్డుగా

చుండ్రు సమస్య ఉన్నప్పుడు.. తలలో ఆయిల్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. దానివల్ల జుట్టు ఆయిలీగా, గ్రీజీగా మారుతుంది. అలాంటి సమస్య ఉన్నప్పుడు రెగ్యులర్ గా జుట్టుని శుభ్రం చేసుకోవాలి.

 వేప

వేప

చుండ్రుని శాశ్వతంగా నివారించడంలో వేప చాలా వండర్ ఫుల్ గా పనిచేస్తుంది. గుప్పెడు వేపాకులు తీసుకుని.. 4 కప్పుల నీటిలో ఉడకబెట్టాలి. 15నిమిషాల పాటు నీటిలో వేపాకులను మరిగించిన తర్వాత చల్లారనివ్వాలి. తర్వాత ఆకులను తీసేసి.. ఆ నీటితో తలను శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి మూడు నుంచి నాలుగు సార్లు స్నానం చేయడం వల్ల చుండ్రు వదిలిపోతుంది.

కొబ్బరినూనె, నిమ్మరసం

కొబ్బరినూనె, నిమ్మరసం

కాస్త కొబ్బరినూనె తీసుకుని, అందులో అరనిమ్మకాయ రసం కలపాలి. ఈ మిశ్రమాన్ని స్కాల్ఫ్ కి బాగా పట్టించాలి. 20 నిమిషాలు అలానే వదిలేయాలి. తర్వాత శుభ్రం చేసుకోవాలి. అవసరమైతే షాంపూ వాడవచ్చు. ఇలా వారానికి రెండు నుంచి మూడుసార్లు ప్రయత్నిస్తే.. చుండ్రు ఈజీగా తగ్గిపోతుంది.

పురుషుల్లో చుండ్రు: నిమ్మతో నివారణా చిట్కాలు

మెంతులు

మెంతులు

రాత్రంతా మెంతులను నీళ్లలో నాననివ్వాలి. ఉదయాన్నే వీటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దానిలోకి ఒక కప్పు పెరుగు కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు, స్కాల్ఫ్ కి పట్టించి రెండు గంటలపాటు ఆరనివ్వాలి. తర్వాత షాంపూతో స్నానం చేస్తే చుండ్రు సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ చిట్కాని వారానికి రెండుసార్లు ప్రయత్నిస్తే.. మంచి ఫలితాలు పొందవచ్చు.

బేకింగ్ సోడా

బేకింగ్ సోడా

ఒక కప్పు బేకింగ్ సోడా తీసుకుని తడి జుట్టుపై బాగా మసాజ్ చేయాలి. 5 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో.. షాంపూ లేకుండా శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి లేదా రెండు సార్లు చేయడం వల్ల చుండ్రు నుంచి వెంటనే ఉపశమనం పొందవచ్చు.

వేపాకు, పెరుగు, మెంతులు

వేపాకు, పెరుగు, మెంతులు

వేపాకు, మెంతులలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్నాయి. పెరుగు కండిషనర్ లా పనిచేస్తుంది. ఈ హెయిర్ ప్యాక్ ద్వారా చుండ్రు సమస్య తగ్గడమే కాదు, దురద కూడా తగ్గిపోతుంది. నానబెట్టిన మెంతులు, వేపాకు, పెరుగు సమానంగా తీసుకుని పేస్ట్ లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి గంట తర్వాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

కలబంద, నిమ్మరసం

కలబంద, నిమ్మరసం

నిమ్మరసంలో ఉండే అసిడిక్ నేచర్ వల్ల చుండ్రుకు కారణం అయ్యే ఫంగస్ ను నివారిస్తుంది. అలోవెరా జెల్ కు కొద్దిగా నిమ్మరసం కలిపి తలకు అప్లై చేయాలి. అరగంట తర్వాత తలస్నానం చేయడం వల్ల చుండ్రుని ఎఫెక్టివ్ గా నివారించవచ్చు.

హెన్నా, నిమ్మరసం, పెరుగు

హెన్నా, నిమ్మరసం, పెరుగు

హెన్నా, నిమ్మరసం, పెరుగు బాగా మిక్స్ చేసి ప్యాక్ వేసుకోవడం వల్ల హెయిర్ లాస్, చుండ్రు నివారిచవచ్చు. నిమ్మరసం, పెరుగు సమానంగా తీసుకుని 2 చెంచాలా హెన్నా మిక్స్ చేయాలి. దీన్ని తలకు పట్టించి కాసేపటి తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచుగా చేయడం వల్ల చుండ్రు నివారించవచ్చు.

జుట్టు రాలడం, బట్టతల, చుండ్రు నివారించే ఆనియన్ జ్యూస్ ట్రీట్మెంట్

English summary

Dandruff Side Effects and Natural Remedies to treat Dandruff !

Side Effects of Dandruff and Remedies to treat Dandruff ! Dandruff is never a pleasant thing to have. And it's just not because you can have flakes on your shoulder and it's just too gross, but also because it can have a host of other side effects too..
Story first published: Saturday, July 8, 2017, 16:40 [IST]
Subscribe Newsletter