జుట్టు పొడవుగా పెరగడానికి బాదం ఆయిల్ హెయిర్ ట్రీట్మెంట్

Posted By:
Subscribe to Boldsky

జుట్టు సమస్యలను నివారించే జుట్టు పొడవుగా పెంచుకోవడానికి బాదం ఆయిల్ బెస్ట్ ట్రీట్మెంట్ అని మీకు తెలుసా? మహిళల బ్యూటి విషయంలో జుట్టు ప్రధాన ఆస్తి, ఎందుకంటే జుట్టు అందాన్ని రెట్టింపు చేస్తుంది. జుట్టు ఉన్నవారు వివిధ రకాలుగా హెయిర్ స్టైల్ ను ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా ఈ మోడ్రన్ ప్రపంచంలో ఫ్యాషన్, ఇంటర్నెంట్ ప్రభావం హెయిర్ స్టైల్ మీద చాలా ప్రభావం చూపుతున్నది . కొంత మంది కర్లింగ్ హెయిర్ డిఫరెంట్ హెయిర్ కట్స్ తో స్టైల్ గా మార్చుకుంటుంటారు.

బాదం ఆయిల్

కాలేజికి వెళ్లే పిల్లల దగ్గర నుండి ఇల్లలో ఉండే హౌస్ వైఫ్, ఆంటీల వరకూ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ను ప్రత్నిస్తుంటారు. అందంగా ఎవరైనా అలంకరించుకోవడం చూస్తే అలా తయారవ్వలాని కోరుకోవడం స్త్రీలకు సహజం. అయితే కొంత మందికి అది సాధ్యపడదు. పొడవాటి జుట్టు ఉన్న వారు స్టైల్ మెయింటైన్ చేయడం కష్టం. కొంత మందికి జుట్టు పల్చగా ఉండటం వల్ల హెయిర్ స్టైల్ జోలికే వెళ్లరు. మరి అలాంటి వారు జుట్టును అందంగా మార్చుకోవడానికి బాదం ఆయిల్ గ్రేట్ గా సహాయపడుతుంది.

అందం పెంచుకోవడానికి బాదం -ఆలివ్ ఆయిల్ ఈ రెండింటిలో ఏది బెటర్ ..!

బాదం నూనెలో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ , ఫాస్పోలిపిడ్స్, విటమిన్ ఇ మరియు మెగ్నీషియంలు అధికంగా ఉన్నాయి. ఇన్ని సుగుణాలున్న బాదం నూనెను జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టుకు పోషణ అందుతుంది. జుట్టు ఆరోగ్యంగా పొడవుగా పెరుగుతుంది. జుట్టు రాలడం నివారించడానికి జుట్టు డ్యామేజ్ కాకుండా నివారించడానికి బాదం నూనె ఉత్తమం. కొన్ని చుక్కల బాదం నూనె చాలు మీ జుట్టును సిల్కీగా మరియు షైనీగా మార్చడానికి. మిర బాదం నూనెను ఉపయోగించి ఇంట్లోనే హెయిర్ ట్రీట్మెంట్ ను ఎలాగో తెలుసుకుందాం..

కావల్సిన పదార్థాలు:

కావల్సిన పదార్థాలు:

బాదం ఆయిల్

షవర్ క్యాప్

వెడల్పు పళ్ళున్న దువ్వెన

ఉపయోగించే పద్దతి:

ఉపయోగించే పద్దతి:

 • జుట్టు తడి చేసి దువ్వెనెతో చిక్కులేకుండా దువ్వాలి. ఇలా చిక్కులేకుండా ఉంటేనే జుట్టు నూనెను సులభంగా గ్రహిస్తుంది.
 • తర్వాత బాదం నూనె తీసుకుని తలకు అప్లై చేసి మసాజ్ చేయాలి. ఇలా మసాజ్ చేయడం వల్ల తలలో బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
 • నూనె అప్లై చేసిన తర్వాత మరోసారి దువ్వెనతో తలదువ్వడం వల్ల కేశాలకు మరియు హెయిర్ ఫోలిసెల్స్ కు నూనె బాగా గ్రహించబడి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
 • తర్వాత షవర్ క్యాప్ వేసుకుని ఒక గంట సేపు అలాగే వదిలేయడం వల్ల జుట్టుకు నూనె బాగా గ్రహిస్తుంది.
 • ఒక గంట తర్వాత షాంపుతో తలస్నానం చేయడం వల్ల జుట్టు సాప్ట్ గా మరియు సిల్కీగా మారుతుంది.
 • ఇలా వారానికొకసారి చేస్తుంటే చాలు మంచి ఫలితం ఉంటుంది.

టీట్రీ ఆయిల్, బాదం ఆయిల్ ట్రీట్మెంట్ :

టీట్రీ ఆయిల్, బాదం ఆయిల్ ట్రీట్మెంట్ :

టీట్రీ ఆయిల్ తలలో బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తుంది. హెయిర్ ఫాలీ సెల్స్ వద్ద పేరుకున్న మురికిని తొలగిస్తుంది. టీట్రీ ఆయిల్లో యాంటీసెప్టిక్, యాంటీ ఫంగల్, యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ ప్రొపర్టీస్ అధికంగా ఉండటం వల్ల తలలో, జుట్టు క్లీన్ గా మరియు హెల్తీగా ఉంటుంది. జుట్టుకు సంబంధించిన హెయిర్ ఫాలీ సెల్స్ యాక్టివ్ గా హెల్తీగా ఉండి చర్మ రంద్రాలను తెరుచుకునేలా చేసి పెరగకుండా ఉండిపోయిన జుట్టును తిరిగి పేరిగేలా చేస్తుంది.

కావల్సినవి:

కావల్సినవి:

-బాదం ఆయిల్ : 2 tbsp

- టీట్రీ ఆయిల్ : 10చుక్కలు

- హాట్ టవల్

మీ చర్మాన్ని ప్రకాశవంతము చేసే సుగంధ నూనెలు

ఉపయోగించే పద్దతి

ఉపయోగించే పద్దతి

 • ఒక బౌల్ తీసుకుని, అందులో బాదం, టీట్రీ ఆయిల్ ను మిక్స్ చేయాలి.
 • ఈ మిశ్రమాన్ని జుట్టు పొడవునా పట్టించాలి.
 • తర్వాత వేడి నీటిలో ముంచిన టవల్ ను తలకు చుట్టుకుని, ఒక గంట పాటు అలాగే వదిలేయాలి.
 • ఒక గంట తర్వాత రెగ్యులర్ షాంపుతో తలస్నానం చేయాలి.
 • ఈ పద్ధతిని వారానికొకసారి అనుసరిస్తే చాలు మంచి ఫలితం ఉంటుంది.

బాదం ఆయిల్ ఎగ్ మాస్క్ :

బాదం ఆయిల్ ఎగ్ మాస్క్ :

గుడ్డులో న్యూట్రీషియన్, పోషక విలువలు అధికంగా ఉన్నాయి. ఇవి జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి చాలా అవసరం . వీటిలో ప్రోటీన్స్, విటమిన్స్, ఫ్యాటీయాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండి అన్ని రకాల హెయిర్ సమస్యలను నివారిస్తాయి.

కావల్సిన పదార్థాలు :

కావల్సిన పదార్థాలు :

గుడ్డు : 1

బాదం ఆయిల్ :1 టేబుల్ స్పూన్

జుట్టుకు, చర్మానికి బాదం ఆయిల్..!! అద్భుతమైన ప్రయోజనాలు..!

ఉపయోగించే పద్దతి

ఉపయోగించే పద్దతి

 • ఒక బౌల్లో ఒక ఎగ్ వైట్ మరియు బాదం ఆయిల్ ను వేసి బాగా రెండూ కలిసే వరకూ మిక్స్ చేయాలి.
 • బాదం నూనె, ఎగ్ వైట్ రెండూ కలిసిపోయే వరకూ స్పూన్ తో బీట్ చేయాలి.
 • తర్వాత ఈ మిశ్రమాన్ని తలకు, జుట్టుపొడవునా అప్లై చేయాలి.
 • అరగంట తర్వాత చన్నీలు, షాంపుతో తలస్నానం చేయాలి.
 • ఈ ట్రీట్మెంట్స్ తో పాటు, డైట్ ను బ్యాలెన్స్ చేసుకోవాలి. జుట్టుకు అవసరమయ్యే న్యూట్రీషియన్స్ ఫర్ఫెక్ట్ గా అందేట్లు మంచి పౌష్టికాహార్ని తీసుకోవాలి.

అలాగే ప్రోటీన్ రిచ్ డైట్ ను ఫాలో అవ్వాలి. ఇవి జుట్టు పెరుగుదలను మెరుగ్గా ప్రోత్సహిస్తాయి, అలాగే కొన్ని విటమిన్ సప్లిమెంట్ తీసుకోవడం కూడా మంచిదే. మీరు కోరుకున్న పొడవాటి, బ్యూటిఫుల్ హెయిర్ ను పొందుతారు.

English summary

DIY Hacks To Grow Super Long Hair Using Almond Oil in Telugu

This article will tell you how to get back your long tresses in no time using a wonder ingredient - Almond oil. Almond oil contains all kinds of healthy ingredients for the hair like omega-3 fatty acids, phospholipids, vitamin E and magnesium. Using almond oil nourishes and strengthens your hair, and is optimal for treating hair loss and damaged hair.
Story first published: Tuesday, June 13, 2017, 11:12 [IST]
Subscribe Newsletter