సిల్కీ అండ్ స్మూత్ హెయిర్ పొందడానికి మందారంతో హెయిర్ మాస్క్

Posted By: Lekhaka
Subscribe to Boldsky

జుట్టు సమస్యల్లో ప్రదానమైనవి చుండ్రు, డ్రై హెయిర్, డస్ట్ మరియు పొల్యూషన్ వంటివి జుట్టును ఎక్కువగా డ్యామేజ్ చేస్తాయి. . ఫలితంగా జుట్టు చిట్లిపోవడం, పల్చగామారడం, హెయిర్ ఫాల్ వంటి లక్షణాలు కనబడుతుంటాయి. ప్రస్తుత రోజుల్లో స్త్రీ, పురుషులు ఎదుర్కొంటున్న ఒక సహజ శారీరక సమస్య.

చిన్న వయస్సులోనే బట్టతల రావడం అనేది ఫిజికల్స్ గానే కాకుండా మానసికంగా కూడా క్రుంగదీస్తుంది. ఈ సమస్యను నివారించుకోవడం కోసం అనేక ప్రొడక్ట్స్ ను ఉపయోగిస్తుంటారు, ఇవి రసాయనాలతో తయారుచేయడం వల్ల ఇన్ స్టాంట్ గా ప్రయోజనాలను అందించినా, దీర్ఘకాలంలో వీటి వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.కాబట్టి, వీటి స్థానంలో నేచురల్ ప్రొడక్ట్స్ ను ఎందుకు ఎంపిక చేసుకోకూడదు?

మందార ఆకులతో పొందే వైద్య ప్రయోజనాలు

పురాతన కాలం నుండి అనేక నేచురల్ రెమెడీస్ ను ఆరోగ్యం కోసం ఉపయోగించే వారు, కెమికల్స్ ప్రొడక్ట్స్ కంటే అనేక హెర్బల్ ఆయుర్వేదిక్ రెమెడీస్ ఆరోగ్యం పరంగా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించినట్లు, ఎన్నో రకాల వ్యాధులను నివారించినట్లు నిరూపించబడినవి. అంతే కాదు వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.

DIY Hibiscus Hair Masks For Silky Smooth Hair

జుట్టును సిల్కీగా మరియు స్మూత్ గా మార్చడానికి వివిధ రకాల నేచురల్ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో మందారం ఒకటి. ఎలాంటి జుట్టు సమస్యలను నివారించుకోవాలన్నా మందారం గొప్పగా సహాయపడుతుంది. మందారం ఆకులు, పువ్వులను సౌందర్యాన్ని పెంచుకోవడం కోసం కొన్ని వేల సంవత్సరాల నుండి ఉపయోగిస్తున్నారు . మందారం ఆకులు, లేదా పువ్వులు జుట్టు సంరక్షణకు ఉపయోగించినప్పుడు జుట్టు స్ట్రాంగ్ గా మారుతుంది. హెయిర్ రూట్స్ ను స్ట్రాంగ్ గా చేస్తుంది. మందారం ఆకులు, పువ్వులు ఏవైనా సరే నేరుగా ఉపయోగించినా లేదా వేరే ఇతర పదార్థాలతో మిక్స్ చేసి హెయిర్ మాస్క్ గా వేసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.

మందారం (హైబిస్కస్)టీ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు

మందారం జుట్టును స్ట్రాంగ్ గా మార్చడం మాత్రమే కాదు, ఇది జుట్టుకు పోషణను అందిస్తుంది, జుట్టును సాప్ట్ గా మరియు షైనీగా మార్చుతుంది. ఈ హోం మేడ్ హైబిస్కస్ మీ జుట్టును అందంగా మార్చుతుంది. మందారం జుట్టు రాలడం అదుపు చేయడం మాత్రమే కాదు, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, హెయిర్ వాల్యూమ్ పెంచుతుంది.

మందార నూనెతో అందం, యవ్వనం రెండూ సొంతమే

మరి అలాంటి జుట్టును మీరు కూడా పొందాలనుకుంటే మీకోసం ఒక ఎఫెక్టివ్ హోం మేడ్ హెయిర్ మాస్క్ ఇక్కడ పరిచయం చేస్తున్నాం. ఇది అన్ని రకాల హెయిర్ సమస్యలను నివారిస్తుంది. స్కిల్కీ అండ్ స్మూత్ హెయిర్ ను అందిస్తుంది

1. మందారం మరియు పెరుగు హెయిర్ మాస్క్

1. మందారం మరియు పెరుగు హెయిర్ మాస్క్

ఈ రెండు పదార్థాల కాంబినేషన్ జుట్టుకు మంచి పోషణను అందిస్తాయి. మందారం పువ్వులను, ఆకులను మెత్తగా పేస్ట్ చేయాలి. దీనికి కొద్దిగా పెరుగు చేర్చి, జుట్టు మొదళ్ల నుండి కొనల వరకూ అప్లై చేయాలి. అరగంట నుండి ఒక గంట తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలి.

2. మందారం, గోరింట ఆకులతో హెయిర్ ప్యాక్ :

2. మందారం, గోరింట ఆకులతో హెయిర్ ప్యాక్ :

జుట్టు రాలడానికి ప్రధానకారణం చుండ్రు, చుండ్రును నివారించడంలో మందారం, గోరింట హెయిర్ ప్యాక్ గొప్పగా సహాయపడుతుంది. ఈ మాస్క్ ను రెడీ చేసుకోవడానికి కొన్ని మందారం పువ్వులు, ఆకులు, గోరింటాకు, కొద్దిగా నిమ్మరసం చేర్చి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ను జుట్టు మొత్తానికి అప్లై చేయాలి. ఈ హెయిర్ ప్యాక్ జుట్టుకు మాయిశ్చరైజింగ్ లక్షణాలను అందిస్తుంది, చుండ్రు నివారిస్తుంది.

3. మందారం , మెంతులు హెయిర్ మాస్క్

3. మందారం , మెంతులు హెయిర్ మాస్క్

మరో ఎఫెక్టివ్ హెయిర్ మాస్క్ , ఇది చుండ్రుతో చాలా ఎఫెక్టివ్ గా పోరాడుతుంది. ఈ హెయిర్ మాస్క్ తయారుచేయడానికి కేవలం మందారం ఆకులు మాత్రమే తీసుకోవాలి. తర్వాత మెంతులను రాత్రంతా మజ్జిగలో నానబెట్టి, , మరుసటి రోజు ఈ మెంతులను , మందారం ఆకులను రెండింటిని చేర్చి, మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను తలకు ప్యాక్ వేసుకోవడం వల్ల చుండ్రు నివారిస్తుంది, ఇతర జుట్టు సమస్యలను నివారించి, పోషణను అందిస్తుంది.

4. మందారం, ఉసిరికాయ మాస్క్

4. మందారం, ఉసిరికాయ మాస్క్

ఆమ్లాలోని హెయిర్ బెనిఫిట్స్ గురించి మనందరికీ తెలిసినదే. ఉసిరికాయకు మందారం ఆకులను జోడించి హెయిర్ మాస్క్ వేసుకవోడం వల్ల మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇది హెయిర్ ఫాలీ సెల్స్ ను మెరుగుపరుస్తుంది. హెయిర్ కండీషన్ మెరుగుపరుస్తుంది. అలాగే మందారం పువ్వులను పేస్ట్ చేసి, అందో ఆమ్లా పౌడర్ మిక్స్ చేసి, తలకు అప్లై చేసి ఒక గంట తర్వాత తలస్నానం చేసుకోవాలి.

5. మందారం , కొబ్బరి పాలు :

5. మందారం , కొబ్బరి పాలు :

డ్రైగా , చిక్కుబడిన జుట్టుతో బాధపడుతున్నట్లైతే ఈ రెండింటి కాంబినేషన్ గ్రేట్ గా సహాయపడుతుంది. కొన్ని మందారపువ్వులు తీసుకుని,పేస్ట్ చేయాలి. దీనికి కొద్దిగా కొబ్బరి నూనె, అలోవెర జెల్, తేనె, పెరుగు చేర్చి పేస్ట్ కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేసి ఒక గంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి.

6. మందారం , అల్లం

6. మందారం , అల్లం

ఎక్స్ ట్రా జింజర్ జ్యూస్ తీసుకుని, మందారం ఆకుల పేస్ట్ తో కలిపి జుట్టుకు మాస్క్ వేసుకోవడం వల్ల జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. లేదా పువ్వులను పేస్ట్ చేసి, అల్లం రసం మిక్స్ చేసి తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా వేసుకుంటుంటే మంచి ఫలితం ఉంటుంది

English summary

DIY Hibiscus Hair Masks For Silky Smooth Hair

There are several natural products which can help you to have silky smooth hair and hibiscus is one of them. To treat hair issues, hibiscus flower has been used since many years. Even the use of hibiscus to strengthen hair roots is an old practice. You can apply it as it is or use it with other ingredients to make effective hair masks.
Story first published: Wednesday, April 12, 2017, 13:50 [IST]
Subscribe Newsletter