ఉల్లిపాయ, తేనె మరియు నూనెతో సింపుల్ హోమ్మేడ్ హెయిర్ ట్రీట్మెంట్ రిసిపి

Posted By: Lekhaka
Subscribe to Boldsky

ఒకవేళ మీకు జుట్టు రాలడం లేదా బట్టతల పెరగడం వలన మీరు ఆందోళన చెందుతున్నట్లైతే, ఈ హోమ్ మేడ్( DIY) హెయిర్ ట్రీట్మెంట్ రెసిపీ మిమల్ని ఈ సమస్య నుండి కాపాడుతుంది. దీనిని తయారు చేయడానికి మీకు కావాల్సిందల్లా కేవలం ఉల్లిపాయలు, తేనె మరియు ఎసెన్షియల్ ఆయిల్.

ఈ హెయిర్ ట్రీట్మెంట్ రెసిపీని మీరు రాత్రి మొత్తం మీ జుట్టు మీద ఉండేలా చుసుకోవాలి మరియు ఎక్కువసేపు మీ చేతులకి పనిపెట్టాల్సివుంటుంది. నిజానికి,ఈ DIYహెయిర్ ట్రీట్మెంట్ రెసిపీని తయారు చేయడానికి కూడా కొంత సమయం పడుతుంది.

రెసిపీకి వెళ్లడానికి ముందు, జుట్టు పెరుగుదలకు సహాయపడే పదార్థాలేంటో ముందుగా తెలుసుకుందాం.

జుట్టు రాలడం, బట్టతల, చుండ్రు నివారించే ఆనియన్ జ్యూస్ ట్రీట్మెంట్

హోమ్మేడ్ హెయిర్ ట్రీట్మెంట్ రెసిపీ

home-made hair treatment recipe

ఉల్లిపాయలు

a) ఉల్లిపాయలో సల్ఫర్ అధికంగా ఉంటుంది, ఇది జుట్టు పల్చగా మారకుండా,బ్రేక్ చేయకుండా చేస్తుంది. ఇది జుట్టుని పొడి గా లేదా పెళుసైన జుట్టు కోసం ఇదొక డైరెక్ట్ సొల్యూషన్ అని చెప్పవచ్చు.

బి) ఉల్లిపాయ గుజ్జు లేదా రసం అప్లై చేయడం వలన ఇది హెయిర్ ఫాలీసెల్స్ కు కు పోషణను అందిస్తుంది. ఉల్లిపాయలు తలలో దురద, చర్మం ఎర్రబడటం లేదా పొడి చర్మం లేకుండా నివారిస్తుంది.

c)ఉల్లిపాయలు యుక్త వయసులో వెంట్రుకలు తెల్లబడకుండా చేస్తాయి.

ఎసెన్షియల్ ఆయిల్

ఎ) నూనెల లో ఉన్నటువంటి ఔషధ లక్షణాలు చర్మం మీద బాగా పని చేస్తాయి.

బి) ఇది వాటర్ ప్రూఫ్ ని కలిగివుండి, ఇంకా జుట్టుకు రక్షణ పొరను ఏర్పాటు చేస్తుంది.

c) కొన్ని ముఖ్యమైన నూనెలు చుండ్రు లేదా పేను వంటి స్థూల జుట్టు సమస్యలపై పని చేస్తాయి.

జుట్టురాలడాన్ని తగ్గించి పెరుగుదలకు సహాయపడే ఉల్లి

DIY హోమ్మేడ్ హెయిర్ ట్రీట్మెంట్ రెసిపీ

రెసిపీ కోసం కావలసిన పదార్థాలు

5 మీడియం సైజు ఉల్లిపాయలు

ముడి తేనె 1/2 చిన్న కప్పు

ఎసెన్షియల్ ఆయిల్ 10 చుక్కలు ( ఆప్షనల్ ఫ్లేవర్)

మొదట, ఉల్లిపాయల తొక్క తీసి మరియు చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. ఇప్పుడు వాటిని మిక్సీ లో వేసి ఉల్లిపాయ రసాన్ని సేకరించండి.

రెండవది, ఉల్లిపాయ రసం, తేనెని బాగా మిక్స్ చేయాలి. ఈ ఉల్లిపాయ రసం మరియు తేనె వేరు వేరుగా ఉంటాయి కలవడానికి కొంచం సమయం పడుతుంది.

చివరగా, ఎస్సెన్సిల్ ఆయిల్ ని కలపండి. కలిపిన తర్వాత దానిని ఒకసారి బాగా కదపండి మరియు హోమ్మేడ్ హెయిర్ ట్రీట్మెంట్ రెసిపీ సిద్ధం అయిపోయంది.

మీ జుట్టు కి మరియు తలపై ఉల్లిపాయ, తేనె మరియు ఎసెన్షియల్ ఆయిల్ యొక్క ఈ హోంమేడ్ హెయిర్ రెసిపీని ఉపయోగించండి. 45 నిముషాల పాటు మసాజ్ చేసి,రాత్రిపూట అలానే వదిలివేయండి మరియు మరుసటి రోజు కడగాలి.

English summary

Home-made Hair Treatment Recipe | DIY Hair Treatment Recipe | Hair Treatment At Home

Now, you can make a hair treatment at home using three simple ingredients—onion, honey and essential oil.
Subscribe Newsletter