ఆవనూనె మసాజ్ తో ఎలాంటి జుట్టైనా స్మూత్ అండ్ షైనీగా మెరవాల్సిందే!

Posted By:
Subscribe to Boldsky

కేశ సౌందర్యంలో ఆవనూనె ట్రీట్మెంట్ గురించి తెలుసా? సాధారణంగా స్త్రీ, పురుషుల సౌందర్య పోషణలో మగువల జుట్టుకి ఉన్న ప్రాధాన్యం అంతా, ఇంతా కాదు. ఎవరయినా ఎంత ఆరోగ్యంగా ఉన్నారో, వారిని జుట్టును చూసి చెప్పవచ్చని అంటుంటారు. ఎందుకంటే, నిగనిగలాడే ఒత్తైన జుట్టు ఆరోగ్యానికి సంకేతం కాబట్టి. సాధారణంగా వాతావరణ కాలుష్యం వల్ల, సరైన పోషణ లేక జుట్టు పొడిబారిపోయి రాలుతుంది. అలా కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకొంటే సరిపోతుంది. ముఖ్యంగా చర్మ సౌందర్యంలో, కేశ సౌందర్యంలో ఆవనూనెను విరివిగా ఉపయోగిస్తారు. పోవు దినుసుగా ప్రతి ఇంట్లో ఉండే ఆవాలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

 ఆవనూనె

వీటిలో మెగ్నీషియం , కాల్సియం, మాగనీస్, జింక్, ఒమెగా 3 ఫ్యాటియాసిడ్స్, ప్రోటీన్లు, పీచుపదార్దము ఉంటాయి. ఘాటైన వాసనను కలిగి ఉండే ఆవాలు ఆయుర్వేదంలో ఎంతో బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా జుట్టు సమస్యలను నివారించుకోవడంలో ఆవనూనె గ్రేట్ గా సహాయపడుతుంది. జుట్టు చిక్కువడటం, చుండ్రు, డ్రై హెయిర్ వంటి అనేక సమస్యలకు ఆవనూనె పరిష్కారం చూపుతుంది.

నల్లగా నిగనిగలాడే జుట్టును పొందడానికి హాట్ మస్టర్డ్ ఆయిల్ మసాజ్

జుట్టుకు నూనెరాయటం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉండటమే గాక అందంగా, సహజంగా ఉంటుంది. దీనివల్ల జుట్టు పొడిబారదు. జుట్టుకు అవసరమైన పోషకాలు సమకూరి కుదుళ్లు గట్టిపడతాయి. తద్వారా జుట్టు రాలే సమస్యా దూరమవుతుంది. చాలామంది జుట్టుకు కేవలం కొబ్బరినూనె మాత్రమే వాడతారు గానీ కురుల స్వభావం, అవసరాలకు తగిన పలురకాల నూనెలూ అవసరం కావచ్చు. జుట్టు అందాన్ని, ఆరోగ్యాన్ని పెంచే నూనెలెన్ని ఉన్నా ఆవనూనెకు సాటి రాదంటారు నిపుణులు. ఆవనూనె జుట్టుకు మంచి మాయిశ్చరైజింగ్ గుణాలను ఇస్తుంది. డ్రై హెయిర్ తగ్గిస్తుంది. నిర్జీవమైన జుట్టును నివారిస్తుంది. బ్యాడ్ హెయిర్, డ్రై హెయిర్ నివారించడంలో ఆవనూనెను ఏవిధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం..

మెంతులు, పెరుగు మరియు ఆవనూనెతో హెయిర్ మాస్క్ :

మెంతులు, పెరుగు మరియు ఆవనూనెతో హెయిర్ మాస్క్ :

ఆవనూనె జుట్టును హెల్తీగా, స్మూత్ గా మరియు సిల్కీగా మార్చుతుంది. పెరుగు గ్రేట్ కండీషనర్. మెంతులు జుట్టుకు అవసరమయ్యే మాయిశ్చరైజింగ్ గుణాలను అందిస్తుంది. ఈ హెయిర్ మాస్క్ చిక్కుబడి జుట్టును నివారిస్తుంది. ఆలివ్ ఆయిల్ జుట్టుకు ఎక్స్ ట్రా షైనింగ్ ను అందిస్తుంది.

కావల్సిన పదార్థాలు :

- ఒక గుప్పెడు మెంతులను రాత్రంతా నీళ్లలో వేసి నానబెట్టుకోవాలి.

- ఒక కప్పు పెరుగు

- 2 టేబుల్ స్పూన్ల ఆవనూనె

- కొద్దిగా ఆలివ్ ఆయిల్

తయారీ:

• రాత్రి నీళ్లలో నానబెట్టిన మెంతులను మిక్సీలో వేసి పేస్ట్ చేయాలి.

• తర్వాత అందులో పెరుగు, ఆలివ్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్ వేయాలి. పెరుగు, ఆవనూనె, ఆలివ్ ఆయిల్ మీ జుట్టు ఒత్తు, పొడవును బట్టి ఎంపిక చేసుకోవాలి.

• ఈ పేస్ట్ ను తలకు, జుట్టు పొడవునా అప్లై చేసుకోవాలి.

• ఒక గంట తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి.

ఆవనూనెను జుట్టుకి అప్లై చేస్తే కలిగే అమేజింగ్ బెన్ఫిట్స్..!

త్రీ ఆయిల్స్ తో ట్రీట్మెంట్ :

త్రీ ఆయిల్స్ తో ట్రీట్మెంట్ :

ఆముదం, ఆవనూనె, ఆలివ్ ఆయిల్. ఈ మూడింటి కాంబినేషన్ తో తయారుచేసుకుని హోం రెమెడీ జుట్టు చిక్కుబడకుండా, డ్రైగా మారకుండా నివారిస్తుంది. ఈ మూడు నూనెల కాంబినేషన్ జుట్టును స్మూత్ గా , షైనీగా మార్చుతుంది.

కావల్సినవి:

- ఆముదం, ఆలివ్, ఆవనూనె మూడు సమంగా తీసుకోవాలి. అది కూడా మీ జుట్టు పొడవును బట్టి తీసుకోవాలి.

తయారీ:

• ఈ మూడు నూనెలను ఒక బౌల్లో తీసుకుని గోరువెచ్చగా చేయాలి. తర్వాత తల మరియు జుట్టు పొడవునా అప్లై చేయాలి.

• ఒక గంట తర్వాత షాంపుతో తలస్నానం చేసుకోవాలి.

డ్రై హెయిర్ ను నివారించే 12 హెయిర్ ట్రీట్మెంట్స్...

అరటి, ఆవనూనెతో మాస్క్ :

అరటి, ఆవనూనెతో మాస్క్ :

అరటి పండ్లు గ్రేట్ హెయిర్ కండీషనర్ గా పనిచేస్తుంది. ఇందులో న్యాచురల్ ఆయిల్స్, పొటాషియం, కార్బోహైడ్రేట్స్ మరియు విటమిన్స్ అధికంగా ఉన్నాయి. ఈ పదార్థాలన్నీ జుట్టుకు తగిన మాయిశ్చరైజర్ ను అందిస్తుంది, జుట్టును సాఫ్ట్ గా మరియు షైనీగా మార్చుతుంది.

కావాల్సినవి:

- 1 బాగా పండిన అరటిపండు

- 1/4th పెరుగు

- 2 ఆవనూనె

తయారీ:

• బాగా పండిన అరటిపండు తీసుకొని ఫోర్క్ తో మ్యాష్ చేయాలి.

• తర్వాత అందులో ఆవనూనె, పెరుగు వేసి స్మూత్ గా పేస్ట్ లా ఉండలు లేకుండా తయారుచేసుకోవాలి.

• ఈ మాస్క్ ను తలకు, జుట్టు పొడవునా అప్లై చేయాలి. ఒక గంట తర్వాత షాంపు మరియు కండీషనర్ తో తలస్నానం చేయాలి.

• ఇలా వారానికొకసారి చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

డ్రై హెయిర్, చిట్లిన జుట్టును నివారించి, సూపర్ సిల్కీ గా మార్చే బనానా హెయిర్ మాస్క్

 అలోవెర మరియు మస్టర్డ్ ఆయిల్

అలోవెర మరియు మస్టర్డ్ ఆయిల్

అలోవెరాలో సూపర్ మాయిశ్చరైజింగ్ గుణాలున్నాయి. ఆవనూనె, అలోవెర కాంబినేషన్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో గ్రేట్ గా పనిచేస్తుంది.

కావాల్సినవి:

- ఆవనూనె కావల్సినంత

- 2 టేబుల్ స్పూన్ల అలోవెర జెల్

తయారీ:

• ఈ రెండు పదార్థాలను మిక్స్ చేసి జుట్టు పొడవునా అప్లై చేయాలి.

• తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి. ఇన్ స్టాంట్ గా జుట్టును స్మూత్ గా మార్చుతుంది.

ఈ హోం రెమెడీస్ సులభంగా ఇంట్లోనే ఎఫెక్టివ్ గా తయారుచేసుకోవచ్చు. జుట్టును అందంగా స్మూత్ గా, షైనిగా మార్చుకోవచ్చు.

డ్రై అండ్ రఫ్ హెయిర్ ను సాప్ట్ గా మార్చే 7 హెయిర్ మాస్క్స్

English summary

DIY: Mustard Oil Treatments For Dry Hair

Frizzy hair can be very difficult to style. The main cause of it is lack of moisture. The cuticle layers on the hair strand need moisture to make it smooth. Here, you will find a few natural DIY mustard oil treatments and masks for dry, lifeless hair. So, say good-bye to your bad hair days for good.
Subscribe Newsletter