Latest Updates
-
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై
అన్ని రకాల జుట్టు సమస్యలకు ఇంట్లో చేసుకునే ఓవర్ నైట్ హెయిర్ మాస్క్ రిసిపిలు
అన్ని రకాల జుట్టు సమస్యలకు ఇంట్లో చేసుకునే ఓవర్ నైట్ హెయిర్ మాస్క్ రిసిపిలు
అందమైన సిల్కీ అండ్ సాప్ట్ హెయిర్ కలిగి ఉండటం ఒక వరమే. అలా లేని వారికి అది ఒక డ్రీమ్ . అయితే అలాంటి హెయిర్ పొందడానికి ప్రస్తుత రోజుల్లో ప్రొఫిషనల్ హెయిర్ స్టైలిస్ట్ ద్వారా రాత్రికి రాత్రే హెయిర్ స్టైల్స్ ను మార్చేసుకుంటున్నారు. అవును ఇది అక్షరాల నిజం, నిన్న ఉన్న హెయిర్ స్టైలో ఈరోజుండదు, మరో కొత్త హెయిర్ స్టైల్ తో కనబడుతుంటారు .
ఏదేమైనా, రొటీన్ గా తీసుకొనే జాగ్రత్తలతో అందమైన, సాప్ట్ అండ్ షైనీ హెయిర్ పొందవచ్చు, అందుకు ఇన్ స్టాంట్ హెయిర్ కేర్ టిప్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ చిట్కాలను కనుక ప్రతి రోజూ నిద్రించడానికి ముందు ప్రయత్నిస్తే మరుసటి రోజు ఉదయానికల్లా, అందమైన, సాఫ్ట్, షైనీ హెయిర్ ను పొందుతారు.

హెయిర్ బ్యూటీషియన్ నిపుణుల ప్రకారం నైట్ టైమ్ హెయి స్టైలింగ్ వల్ల, ఉదయం సమయం ఆదా అవుతుంది. ఇది అందమైన కేశసౌందర్యంతో కొత్తగా కనబడుటకు సహాయపడుతుంది. రోజులో చర్మ ఆరోగ్యం గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో, అదేవిధంగా కేశ సంరక్షణ, జాగ్రత్తలు కూడా చాలా అవసరం అవుతాయి.
ముఖ్యంగా వీకెండ్స్ లో ఇటువంటి హెయిర్ మాస్క్ ల వల్ల జుట్టు అందంగా..ఆరోగ్యంగా మార్చుకోవచ్చు. అటువంటి హెయిర్ మాస్క్ లు ఏంటో ఒక సారి చూద్దాం...

ఆముదం+బీర్ +గుడ్డులోని పచ్చసొన+తేనె హెయిర్ మాస్క్
1. ముందుగా ఒక బౌల్లో ఆముదం, బీర్ ను సమంగా తీసుకోవాలి.
2. తర్వాత ఆముదం, బీర్ రెండూ బాగా మిక్స్ చేయాలి.
3. ఒక టేబుల్ స్పూన్ బీర్, ఆయిల్ మిశ్రమానికి ఒక గుడ్డులోని పచ్చసొన వేయాలి.
4. తర్వాత మూడు మిక్స్ చేసి, తేనె కూడా కలపాలి.
5. అంతే హోం మేడ్ హెయిర్ మాస్క్ రెడీ.
6. ఈ హయిర్ మాస్క్ ను తలకు, జుట్టు పొడవునా అప్లై చేసి, షవర్ క్యాప్ పెట్టుకుని రాత్రిపడుకోవాలి. మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి.

అరటి+అవొకాడో+కొబ్బరి నూనెతో ఓవర్ నైట్ హెయిర్ మాస్క్
రాత్రుల్లో నిద్రించే ముందు జుట్టుకు కొబ్బరి నూనెలో అప్లై చేయడం సహజం. అలాంటి కొబ్బరి నూనెకు రెండు పండ్ల రసాలను మిక్స్ చేయాండి. అవే అరటి, అవొకాడో పండ్లు.
2. అయితే అవొకాడో, అరటి, కొబ్బరి నూనెను సరైన మోతాదులో తీసుకోవాలి. ఏదైనా ఎక్కువ తక్కువైతే హెయిర్ మాస్క్ వేస్ట్ అవుతుంది.
3. అవొకాడో పొట్టు తీసి, పేస్ట్ తీసి రసం తియ్యాలి. అందుకు సగం అవొకాడో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
4. ఈ మిశ్రమానికి సగం అరటిపండు గుజ్జును వేయాలి.
5. కొబ్బరి నూనెను గోరువెచ్చగా చేసి, పండ్ల రసాలతో కలపాలి. 3 టేబుల్ స్పూన్ల వరకూ నూనె కలపవచ్చు.
6. ఈ ఫ్రూట్ బేస్డ్ ఆయిల్ హెయిర్ మాస్క్ ను నిద్రించే ముందు జుట్టు మొత్తానికి అప్లై చేసి, షవర్ క్యాప్ పెట్టుకుని నిద్రపోవాలి. ఇది అన్ని రకాల జుట్టు సమస్యలను నివారిస్తుంది.
7. మరుసటి రోజు ఉదయం చల్లటి నీటితో షాంపుతో తలస్నానం చేసుకోవాలి.

కొబ్బరిపాలు+ఆర్గాన్ ఆయిల్ హెయిర్ మాస్క్
1. ఒక కప్పు కొబ్బరిను పేస్ట్ చేసి, అందులో నీళ్ళు కలిపి వడగడితే కొబ్బరి పాలు తయారవుతాయి.
2. తర్వాత ఒక క్పు కోకనట్ మిల్క్ కు ఒక కప్పు ఆర్గాన్ అయిల్ మిక్స్ చేయాలి. ఈ రెండు కలపడానికి కొంత సమయం పడుతుంది.
3. ఈ రెండు మిశ్రమాలను తలకు అప్లై చేసి మసాజ్ చేయాలి.
4. షవర్ క్యాప్ వేసుకుని నిద్రపోవాలి.
5. మరుసటి రోజు ఉదయం షాంపుతో తలస్నానం చేయాలి.



Click it and Unblock the Notifications