సిల్కీ అండ్ సాఫ్ట్ హెయిర్ కోసం ఇంట్లో తయారుచేసుకునే హెయిర్ మాస్క్

Posted By: LAKSHMI BAI PRAHARAJU
Subscribe to Boldsky

ప్రాచీనకాలం నుండి, స్త్రీలు పొడవైన, మృదువైన జుట్టును కలిగి ఉండేవారు. ఈరకమైన జుట్టు వ్యక్తి అందాన్ని పెంచి, వారు ఎక్కడ ఉన్నా, వారినే అందరిలో ప్రత్యేకంగా ఆకర్షించేలా చేస్తుంది.

అయితే, ఇటువంటి ప్రశంసలు పొందడం సులభం కాదు, చాలామంది ఈ విషయాన్నీ తెలుసుకోవాలి. కాలుష్యం, ప్రమాదకర సూర్యకిరణాల తాకిడి, రసాయనాలతో కూడిన ఉత్పత్తులను వాడడం, వేడి చేసే వస్తువులు మొదలైన అనివార్యమైన పనులు నిస్తేజంగా కనిపించే, పెళుసైన జుట్టుకు ప్రధాన కారణాలు అవుతాయి.

అయితే, ఎక్కువమంది స్త్రీలు జుట్టును మృదువుగా, మెరిసేలా చేయడానికి వాణిజ్యపరమైన ఉత్పత్తులను ప్రయత్నిస్తున్నారు లేదా కొంతమంది ఖరీదైన చికిత్సలకు కూడా వెళ్లి, అసంత్రుప్తికర ఫలితాలను పొందారు.

Simple Hair Mask For Silky Soft Hair That You Could Make At Home

జుట్టు పొడిబారి, చిక్కుతో, పేలవంగా ఎవరికీ ఉంటుందో, వారు ఇది తప్పక చదవండి. బోల్డ్ స్కై వారు నేడు మృదువైన, సున్నితమైన జుట్టును పొందడానికి ఇంట్లో తయారుచేసే చికిత్స గురించి మీరు తెలుసుకునేలా చేస్తున్నారు.

మీరు స్వంతంగా హెయిర్ మాస్క్ చేసుకోవడానికి కొన్ని పదార్ధాలు అవసరమవుతాయి. ఉసిరి పొడి, రీటా పౌడర్, శీకాయ పొడి, తేనె, ఒక గుడ్డు వంటి పదార్ధాలు.

తేలికగా దొరికే, సమర్ధవంతమైన, శక్తివంతమైన జుట్టును మెరుగుపరిచే లక్షణాలు కలిగిన పైన పేర్కొన్న అన్ని పదార్ధాలు మీ జుట్టు నిర్మాణం, మొత్తం ఆకృతిని మెరుగుపరచడం ద్వారా మీజుట్టు సహజ అందాన్ని పునరుద్ధరించవచ్చు.

ఇక్కడ, సిల్కీ అండ్ సాఫ్ట్ హెయిర్ కోసం ఒక అద్భుతమైన హెయిర్ మాస్క్ వివరాలను అందించాము. ఒకసారి చూడండి...

తేనె వాడకంలో ప్రయోజనాలు:

తేనె వాడకంలో ప్రయోజనాలు:

మీ మాడు సహజ తేమను కోల్పోతే, జుట్టు మొదళ్ళు దెబ్బతిని, జుట్టు గరుకుగా, పొడిగా కనిపించడం ప్రారంభమవుతుంది. ఇలాంటి సందర్భాలలో తేనె మీ చర్మాన్ని, జుట్టును కాపాడుతుంది.

తేనె తేమతో కూడిన లక్షణాలు ఎక్కువగా నిండి ఉన్న ఒక సహజ పదార్ధం, ఇది మీ మాడు, జుట్టు తేమని పునరుద్ధరిస్తుంది.

దానితోపాటు, తేనె జుట్టును బలపరిచే ఏజెంట్ గా పనిచేస్తుంది, ఇది జుట్టు రాలడాన్ని నిరోధించి, సిల్కీ సాఫ్ట్, బలమైన జుట్టును కలుగ చేస్తుంది.

గుడ్డు వాడకంలో ప్రయోజనాలు:

గుడ్డు వాడకంలో ప్రయోజనాలు:

హెయిర్ కండిషనింగ్ చికిత్సలో గుడ్డు నిజానికి అనువైన పదార్ధం. ఇందులో ఉండే పోషకాలు, ప్రోటీన్లు మీ జుట్టుపై బలమైన ప్రభావాన్ని చూపుతాయి.

ఈ లక్షణాలు మీ జుట్టును మూలాల నుండి పెంచడమే కాకుండా, మీ జుట్టు మృదువుగా, సున్నితంగా ఉండేట్టు చేస్తుంది.

అంతేకాకుండా, గుడ్డును జుట్టుకు పట్టించడం వల్ల దెబ్బతిన్న జుట్టును పునర్నిర్మించి, భవిష్యత్తులో కఠినంగా, పెళుసుగా తయారవకుండా కాపాడుతుంది.

హెర్బల్ పౌడర్ ల వల్ల ప్రయోజనాలు:

హెర్బల్ పౌడర్ ల వల్ల ప్రయోజనాలు:

శీకాయ పొడి:

విటమిన్ c, యాంటీ ఆక్సిడెంట్లు, కోల్లెజేన్ ని పెంచే సమ్మేళనాలను కలిగి ఉన్న శీకాయ పొడి పొడితనం, కరుకుతనం వంటి వివిధ జుట్టు పరిస్థితుల పరిష్కారంలో ఉత్తమ హెర్బల్ పౌడర్ లలో ఒకటిగా గుర్తించబడింది.

హెర్బల్ పౌడర్ ల వల్ల ప్రయోజనాలు:

హెర్బల్ పౌడర్ ల వల్ల ప్రయోజనాలు:

ఉసిరి పొడి :

ఉసిరి పొడిలో ఉన్న శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు మీ జుట్టు మూలల నుండి బలంగా చేసి, దాన్ని రూపాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

అంతేకాకుండా, ఇది మీ మాడుకు అవసరమైన తేమను, అర్ద్రతను అందించి, పొడితనం, కరుకుదనం కూడా తగ్గిస్తుంది.

ఈ హెయిర్ మాస్క్ కు అవసరం అయినవి:

ఈ హెయిర్ మాస్క్ కు అవసరం అయినవి:

1 టీస్పూన్ ఉసిరి పొడి

1 టీస్పూన్ శీకాయ పొడి

1 టీస్పూన్ రీటా పొడి

½ టీస్పూన్ తేనె

1 కోడిగుడ్డు

తయారుచేయడం ఎలా:

తయారుచేయడం ఎలా:

-ఒక గాజు గిన్నెలో అన్ని పదార్ధాలను తీసుకోండి.

-కొద్దిగా నీటితో కూడిన పేస్ట్ రూపంలో బాగా కలపండి.

ఎలా వాడాలి:

ఎలా వాడాలి:

-ఈ పేస్ట్ ని మాడుకు, జుట్టు పొడవు నుండి మూలాల వరకు రాయండి.

-కొద్ది నిమిషాలపాటు మీ వేళ్ళతో స్కాల్ప్ పై సున్నితంగా మర్దనా చేయండి.

-40 నుండి 50 నిమిషాల పాటు అలా వదిలేయండి.

-చల్ల నీటితో శుభ్రంగా కడగండి.

గుర్తుంచుకోవాల్సిన విషయాలు:

గుర్తుంచుకోవాల్సిన విషయాలు:

-మంచి ఫలితాల కోసం, ఇంట్లో తయారుచేసిన ఈ మాస్క్ ని కనీసం వారానికి రెండుసార్లు వాడాలి.

-హెయిర్ డ్రయ్యర్ కి బదులు జుట్టును గాలిలో ఆరబెట్టుకోండి.

-జుట్టును శుభ్రం చేయడానికి హెర్బల్ షాంపూ ని వాడండి.

English summary

Simple Hair Mask For Silky Soft Hair That You Could Make At Home

Does your hair look dry, dull and rough all the time? Then, we have a solution for the same. Using certain home remedies such as honey, eggs, etc., can help you attain silky and soft hair..
Story first published: Thursday, December 14, 2017, 8:30 [IST]