For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తెల్ల జుట్టును శాశ్వతంగా దూరం చేసే హోంమేడ్ హెయిర్ మాస్కులు

|

జుట్టు నల్లగా ఉంటేనే అందం. జుట్టు తెల్లబడడం మొదలు పెడితే నేటి యంగ్ స్టర్స్ మానసికంగా కృంగిపోతున్నారు. మన జుట్టు రంగు చిన్న వయసులోనే నిర్ణయించబడుతుంది. మన జుట్టు క్రిందిభాగంలో ఉండే మెలానో సైట్స్ అనే కణాలు జుట్టుకి రంగునిస్తాయి. మన శరీరంలోని మెలానిన్ స్థాయిని బట్టి చర్మం మరియు జుట్టు రంగులు ఏర్పడతాయి. వయసు పైబడుతున్నప్పుడు మెలానిన్ ఉత్పత్తి తగ్గిపోయి క్రమంగా ఆగిపోతుంది. ఫలితంగా జుట్టు తెల్లబడుతుంది.

వయసు వల్ల నెరసిన జుట్టు ఇక నల్లబడదు. తెల్ల జుట్టును తిరిగి నల్లగా మార్చలేము. కానీ, యుక్త వయసులో జుట్టు తెల్లబడితే అంటే బాల నెరుపు వస్తే దాన్ని నివారించవచ్చు అంటున్నారు సౌందర్య నిపుణులు. పెద్దలైతే హెయిర్ డైలు, హెయిర్ కలరింగ్ లు, హెన్నా పెట్టుకోవడం చేస్తుంటారు. మరి అయితే 20's లేదా 30's ఉన్న యంగ్ స్టర్స్ సంగతేంటి?

తెల్ల జుట్టును శాశ్వతంగా దూరం చేసే హోంమేడ్ హెయిర్ మాస్కులు

యంగ్ స్టర్స్ లో జుట్టు తెల్లబడటానికి స్ట్రెస్, కాలుష్యం, ఆహారపు అలవాట్లు, అనారోగ్యకరమైన జీవనశైలే కారణం. చిన్న వయస్సులో తెల్ల జుట్టు నివారించుకోవడం కొంచెం కష్టమే. ఈవయస్సు వారు కలరింగ్ వేసుకోవడం పరిస్థితి మరింత అద్వాన్నంగా మారుతుంది. అందుకోసం మీరు తిరిగి స్ట్రెస్ పెంచుకోవాల్సిన పనిలేదు. తెల్ల జుట్టును పర్మనెంట్ గా తొలగించుకోవడానికి కొన్ని హోం మేడ్ టిప్స్ ఉన్నాయి.

1) ఉల్లిపాయ మరియు నిమ్మరసం :

1) ఉల్లిపాయ మరియు నిమ్మరసం :

ఈ హేర్బల్ రెమెడీ తెల్ల జుట్టును నివారించడంలో గ్రేట్ గా సహాయడుతుంది. ఉల్లిపాయ రసంలో ఉండే ఎంజైమ్స్ హైడ్రోజెన్ పెరాక్సైడ్ ను క్రమబద్దం చేస్తుంది. దాంతో తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.

అందుకు కావల్సిన పదార్థాలు:

- 1 మీడియం సైజ్ ఉల్లిపాయలు

- 1 నిమ్మకాయ

తయారుచేయు విధానం:

1) ఉల్లిపాయకు పొట్టు తీసి, చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.

2) ఈ పేస్ట్ నుండి రసాన్ని వేరుచేసుకుని, అందులో ఒక నిమ్మపండులోని నిమ్మరసంను వేయాలి.

3) ఈ మిశ్రమాన్ని ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు జుట్టుకు అప్లై చేయాలి. క్రమతప్పకుండా ఇలా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

పొటాటో స్కిన్ తో తెల్లజుట్టుని నల్లగా మార్చే అమేజింగ్ సొల్యూషన్..! పొటాటో స్కిన్ తో తెల్లజుట్టుని నల్లగా మార్చే అమేజింగ్ సొల్యూషన్..!

2) గోధుమ గడ్డి మరియు బార్లీ గడ్డి :

2) గోధుమ గడ్డి మరియు బార్లీ గడ్డి :

గోధుమ గడ్డి, బార్లీ గడ్డిలో తెల్ల జుట్టును నివారించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి తెల్ల జుట్టును వ్యతిరేకిస్తుంది.

కావల్సిన పదార్థాలు:

- గుప్పెడు గోధుమ గడ్డి

- బార్లీ గడ్డి

తయారుచేయు విధానం:

1) గోధుమ గడ్డి, బార్లీ గడ్డిని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి.

2) ఈ పేస్ట్ ను రాత్రి నిద్రించే ముందు తలకు అప్లై చేసి అలాగే ఉంచాలి.

3) ఉదయం నిద్రలేచిన తర్వాత నేచురల్ షాంపుతో తలస్నానం చేయాలి.

3) ఆమ్లా, బాదం ఆయిల్ మరియు కోకనట్ ఆయిల్ :

3) ఆమ్లా, బాదం ఆయిల్ మరియు కోకనట్ ఆయిల్ :

తెల్ల జుట్టును నివారించడంలో ఇది ఒక అద్భుతమైన రెమెడీ.

కావల్సిన పదార్థాలు:

- 4-5 ఆమ్లా (ఎడినవి)

- 2 టేబుల్ స్పూన్ల బాదం ఆయిల్

- 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె

తయారుచేయు విధానం:

1) ఎండిన ఆమ్లాను మెత్తగా పొడి చేసుకోవాలి, దీనికి కొద్దిగా బాదం నూనె, కొబ్బరి నూనె వేసి మిక్స్ చేయాలి.

2) ఈ మిశ్రమాన్ని ప్రతి రోజూ రాత్రి తలకు అప్లై చేయాలి.

3) మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన వెంటనే తలస్నానం చేయాలి.

4) కరివేపాకు మిశ్రమం:

4) కరివేపాకు మిశ్రమం:

ఈ హెయిర్ టానిక్ ను జుట్టుకు ఉపయోగించడం వల్ల జుట్టుకు డార్క్ పిగ్మెంటేషన్ ను ప్రోత్సహిస్తుంది. ఇందులో బి గ్రూప్ విటమిన్స్ అధికంగా ఉన్నాయి. దీనికి కొబ్బరి నూనె మిక్స్ చేసి మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

కావల్సిన పదార్థాలు:

- ఒక గుప్పెడు కరివేపాకు

- 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె

తయారుచేయు విధానం:

1) ఒక గుప్పెడు కరివేపాకు వేడి నీళ్లలో వేసి కడగాలి.

2) తర్వాత,కొబ్బరి నూనెలో కరివేపాకు వేసి బాయిల్ చేయాలి. కరివేపాకు నల్లగా మారే వరకూ వేడి చేయాలి.

3) కరివేపాకు నల్లగా మారిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి క్రిందికి దింపేయాలి.

4) ఈ నూనెను ఒక బౌల్లోకి వడగట్టుకోవాలి. ఈ నూనెను రాత్రి నిద్రించడానికి ముందు తలకు అప్లై చేయాలి.

5) తర్వాత రోజు ఉదయం తలస్నానం చేసుకోవాలి. ఇలా వారంలో మూడు, నాలుగు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

గ్రే హెయిర్ నివారించడానికి అవసరం అయ్యే ఉత్తమ హో రెమెడీస్ గ్రే హెయిర్ నివారించడానికి అవసరం అయ్యే ఉత్తమ హో రెమెడీస్

5) బ్లాక్ సీడ్స్ , ఆలివ్ ఆయిల్ ట్రీట్మెంట్ :

5) బ్లాక్ సీడ్స్ , ఆలివ్ ఆయిల్ ట్రీట్మెంట్ :

ఈ రెండూ తెల్ల జుట్టును నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఈ రెండింటి మిశ్రమం వల్ల జుట్టు షైనీగా హెల్తీగా మార్చి, కొత్తగా హెయిర్ ఫాలీసెల్స్ పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

కావల్సిన పదార్థాలు:

- 2 టేబుల్ స్పూన్ల బ్లాక్ సీడ్ ఆయిల్ తీసుకోవాలి

- 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ తీసుకోవాలి

తయారుచేయు విధానం:

1) ఒక బౌల్ తీసుకుని అందులో బ్లాక్ సీడ్ ఆయిల్ మరియు ఆలివ్ ఆయిల్ వేసి వేడి చేయాలి.

2) ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేయాలి.

3) ఒక గంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి.

ఈ హోం రెమెడీస్ తెల్ల జుట్టును ఎఫెక్టివ్ గా నివారిస్తాయి. అయితే బహిర్గతంగా మాత్రమే వీటిని అప్లై చేయడం వల్ల కోరుకున్న ఫలితాలు పొందరు. అంతర్గతంగా మరియు బహిర్గతంగా రెండు రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఫలితం మరింత ఎఫెక్టివ్ గా ఉంటుంది. అప్పుడే తెల్లజుట్టును పూర్తిగా నివారించుకోవచ్చు.

బ్లాక్ సీడ్ ఆయిల్లో శరీరానికి అవసరమయ్యే న్యూట్రీషియన్స్ అధికంగా ఉన్నాయి. కాబట్టి వంటలకు ఈ నూనెను ఉపయోగించుకోవచ్చు. వీటితో పాటు ఫ్రెష్ గా ఉండే పండ్లు, వెజిటేబుల్స్, అల్లం, వెల్లుల్లి మరియు పసుపు వంటివి అంతర్గతంగా తీసుకోవడం చాలా అవసరం.

తెల్ల జుట్టుకు మరో అతి పెద్ద కారణం స్ట్రెస్ అండ్ స్మోకింగ్. ఈ రెండింటిని కనుక తగ్గించుకొన్నట్లైతే తెల్ల జుట్టు క్రమంగా తగ్గుతుంది!

English summary

DIY: Remedies To Get Rid Of Premature Grey Hair

We have compiled a list of natural remedies to treat and cure the problem of grey hair permanently.
Story first published:Tuesday, June 20, 2017, 12:57 [IST]
Desktop Bottom Promotion