For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దుర్గా పూజ స్పెషల్: మీకు నచ్చే డిఫరెంట్ హెయిర్ స్టైల్స్

By Ashwini Pappireddy
|

దుర్గా పూజ అన్ని అలంకరణలతో సిద్దమవుతుంది. తల నుండి కాలి వరకు, లెఫ్ట్ నుండి రైట్ వరకు, శరీరంలోని ప్రతి ఒక్క భాగం అలంకరణతో నిండి పోతుంది. దుర్గ పూజ యొక్క రూపకల్పన ప్రక్రియలో, ఈ రోజు మీ జుట్టు ఒక ప్రత్యేక పాత్రను పోషిస్తుంది. ఎలా అనుకుంటున్నారా? అదేనండి అందరిలో మీరు స్పెషల్ గా కొత్తగా కనిపించాలనుకుంటే మీకు ట్రెండీ హెయిర్ స్టైల్ తప్పనిసరి కదా.

దుర్గా పూజకి మహిళలు ప్రతిరోజూ ఒకే స్టైల్ ని రిపీట్ చేయకుండా ప్రతిరోజూ క్రొత్త హెయిర్ స్టైల్ తో ఇతరులకి స్ఫూర్తినిచ్చే విధంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి, అలాంటి "హాట్కీ" లుక్ కోసం ప్రముఖ టాలీవుడ్- హెయిర్ స్టైల్స్ ని మీకోసం ఎంచుకోవడం జరిగింది. అవేంటో మీరే చూడండి.

భారతీయ మహిళలకు 6 ఉత్తమ కేశాలంకరణ రీతులుభారతీయ మహిళలకు 6 ఉత్తమ కేశాలంకరణ రీతులు

ఈ దుర్గ పూజ కోసం టాలీవుడ్ నటీనటులు హెయిర్ స్టైల్స్ తో ఒక గోల్ ని సెట్ చేసారు. మీరు ఆ స్టైల్స్ ని దొంగతనం చేసి వాటిని ప్రత్నించి అన్ని రోజుల పాటు- షష్ఠి నుండి ఇమ్మర్షన్ రోజువరకు అందరిలో పర్ఫెక్ట్ లుక్ ని మీ సొంతం చేసుకోండి.

వివిధ కేశాలంకరణ విధానాలను చూడండి మరియు మీకు చాలా నచ్చిన వాటిని అందులో నుండి ఎంచుకోండి..

లోయర్ ఎండ్ నుండి చిక్కైన కర్ల్స్ హెయిర్ తో హైలైట్స్

లోయర్ ఎండ్ నుండి చిక్కైన కర్ల్స్ హెయిర్ తో హైలైట్స్

ఈ పొడవాటి జుట్టు వున్నవారికి చాలా అందంగా ఉంటుంది. ఇందులో పొడవైన కర్ల్స్ హెయిర్ తో పాటు రంగు హైలైట్ అవుతుంది. ఎగువ ప్రాంతం మొత్తం బ్లాక్ కలర్ తో దిగువున మీకు ఇష్టమైన కలర్ ని ఎంచుకోవచ్చు. పూజ జరుగుతున్నప్పుడు కర్ల్స్ ని సలోన్ కి వెళ్లి అమర్చుకోవచ్చు.ఈ కేశాలంకరణను మధ్య భాగం, సైడ్ లో కూడా సెట్ చేస్తారు.

పిక్సీ తో ఫ్రిన్గ్స్

పిక్సీ తో ఫ్రిన్గ్స్

దీనిని చూసి వెస్టర్న్ మోడల్ అని భావించకండి. మీరు దానిని ఎలా క్యారీ చేయాలో తెలిస్తే, ఈ పిక్సీ కట్ అన్ని రకాల దుస్తులతో బాగా మ్యాచ్ అవుతుంది. కొన్ని ఫ్రిన్గ్స్ మరియు బ్యాక్ లిఫ్ట్ ఒక పరిపూర్ణ పిక్సీ లుక్ నిస్తుంది. ఈ పూజ, మీరు ఒక జెట్ బ్లాక్ పిక్సీ హెయిర్ స్టైల్ తో లేదా మీకు ఇష్టమైన కలర్స్ ని ఎంపిక చేసుకోవచ్చు.

పట్టెర్న్డ్ హెయిర్ కలరింగ్

పట్టెర్న్డ్ హెయిర్ కలరింగ్

పట్టెర్న్డ్ హెయిర్ కలర్ కోసం, మీరు జుట్టు కచ్చితంగా పొడవు ఉండాల్సిన అవసరం లేదు. పొడవాటి, చిన్న లేదా మధ్యస్థ పొడవుగల వెంట్రుకలతో వివిధ రంగుల స్ట్రోకుల తో మీ ముఖంలో అందాన్ని తీసుకొచ్చేలా ఏర్పాటు చేయవచ్చు. మంచి స్టైల్ కోసం మీరు సరైన రంగుని మరియు మంచి సలోన్ ఎంచుకోండి. చీప్ హెయిర్ కలర్స్ తరచుగా జుట్టు మరియు దాని నాణ్యతని దెబ్బతీస్తాయి.

ఫ్రంట్ లాక్స్ తో స్ట్రెయిట్ హెయిర్

ఫ్రంట్ లాక్స్ తో స్ట్రెయిట్ హెయిర్

దుర్గా పూజ స్టైల్స్ లో ఎప్పటికి ఓల్డ్ అవని మరియు ఎన్నటికీ సాంప్రదాయ కేశాలంకరణలలో దర్శనమిచ్చే స్టయిలే ఈ ముందరి లాక్స్ తో స్ట్రెయిట్ హెయిర్. సాధారణంగా ఇది జుట్టు యొక్క పొడవు మీద ఆధారపడివుంటుంది. కొందరిలో ఇది పొరలు పొరలు లేదా స్టెప్స్ గా ఉండవచ్చు. మీరు ఈ హెయిర్ స్టైల్ ని కావాలనుకున్నప్పుడు , మీ జుట్టును ఓపెన్ గా లీవ్ చేసి ఉంచడం లేదా మంచి హెయిర్ బన్ ని కూడా వాడుకోవచ్చు.

బిగ్ హెయిర్ బన్

బిగ్ హెయిర్ బన్

ఏదైనా ఫంక్షన్ లేదా వేడుకల హెయిర్ స్టైల్స్ విషయానికి వస్తే బన్ స్టైల్ తప్పనిసరి అని చెప్పవచ్చు. అయితే, బన్ హెయిర్ స్టైల్ కేవలం సాంప్రదాయ దుస్తులకు మాత్రమే సూట్ అవడం కాకుండా అన్నివెస్ట్రన్ వేర్ లకి కూడా, కావాలనుకుంటే మీరు ఒక ఫాన్సీ హెయిర్ బన్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ హెయిర్ బన్ లో వున్న మంచి విషయం, ఇది మీ జుట్టుని మంచి ఆకారంలో ఉంచుతుంది మరియు పూజల యొక్క హడావిడిలో ఇది మీకు ఇబ్బందిని కల్పించకుండా ఎలాంటి డామేజ్ ను ఏర్పరచదు. దీనిని అలంకరించేందుకు మీ బన్ మీద జుట్టు సంబంధిన అలంకారణాలని ఉపయోగించండి.

సైడ్ హెయిర్ ప్లైట్

సైడ్ హెయిర్ ప్లైట్

దుర్గా పూజ రోజులలో మీరు నిజంగా సోమరితనంతో ఉంటే, ఈ చిన్న హెయిర్ ప్లైట్ త్వరగా వేసుకోవడానికి మరియు సౌకర్యవంతంగా ఉండటానికి మీకు చక్కటి పరిష్కారాన్ని ఇస్తుంది. ఈ సైడ్ హెయిర్ ప్లైట్ కోసం మీ జుట్టు మొత్తాన్ని ఒకే వైపుకి ఉంచండి.ప్లైట్స్ వెస్టర్న్ మరియు ఈస్టర్న్ దుస్తులకు రెండింటికీ మ్యాచ్ అవుతుంది. అయినప్పటికీ, జుట్టును సరిగా ఉంచడం మరియు స్టైల్ గా ఉండటానికి పొడవాటి జుట్టును కలిగి ఉండాలి.

సైడ్ స్వేప్ట్ కేశాలంకరణ

సైడ్ స్వేప్ట్ కేశాలంకరణ

కేవలం మీ జుట్టు విభజన తో మరియు ఒక అద్భుతమైన ఈ హెయిర్ స్టైల్ తో దుర్గ పూజ ఈ సంవత్సరం లుక్ ని ఆనందించండి. ప్లైట్ లను రెండు వ్యతిరేక దిశలలో అలంక అలంకరించడం మంచిది. మీరు మీ జుట్టును స్ట్రెయిట్ గా లేదా సాధారణంగా ఉంచవచ్చు.

ప్రెట్టీ పోనీ టైల్

ప్రెట్టీ పోనీ టైల్

దుర్గా పూజ రోజు ప్రత్యేక జాబితాలో చాలా సులభంగా చేయగల కేశాలంకరణలో పోనీ టైల్ కూడా ఒకటి. కానీ మీ పోనీటైల్ ని మంచి కలర్ లేదా స్టైల్ లో ట్వీక్ చేయడమే ఇక్కడ ట్రిక్. ఒకవేళ మీరు పోనీ టైల్ వేసుకోవాలనుకున్నప్పుడు, మీ జుట్టు బాగా బ్రష్ చేయండి మరియు ఎక్కడా జుట్టు చిక్కు బట్టకుండా చూసుకోండి. మీరు చిత్రంలో ఉన్నటువంటి పోనీ టైల్ని కావాలనుకుంటే మీరు ఒక ఎలక్ట్రానిక్ హెయిర్ కర్లెర్ కూడా ఉపయోగించవచ్చు.

ఏ వేలితో బొట్టు పెట్టుకోవాలి ? ఎరుపు రంగు తిలకమే ఎందుకు ?ఏ వేలితో బొట్టు పెట్టుకోవాలి ? ఎరుపు రంగు తిలకమే ఎందుకు ?

English summary

Durga Puja Hairstyles | Tollywood-inspired Hairstyles | Hairstyles For Durga Puja

Try these tollywood-inspired hairstyles this Durga puja and go for a massive makeover.
Story first published:Saturday, September 23, 2017, 9:50 [IST]
Desktop Bottom Promotion