For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టు రాలడం, జుట్టు పల్చబడుటను నివారించే ఎఫెక్టివ్ హెయిర్ మాస్క్..!!

జుట్టు అందంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ ఆశపడుతుంటారు. అయితే ఆ ఆశను నిజం చేసుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మన వంటగదిలో ఉండే పదార్థాలే మనకు తెలయనిఎన్నోహెయిర్ బెనిఫిట్ ను అందిస్తాయి

By Lekhaka
|

జుట్టు అందంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ ఆశపడుతుంటారు. అయితే ఆ ఆశను నిజం చేసుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మన వంటగదిలో ఉండే పదార్థాలే మనకు తెలయని ఎన్న హెయిర్ బెనిఫిట్ ను అందిస్తాయి. జుట్టు రాలడం నివారించి, జుట్టు పల్చగా మారకుండా చేయడానికి కొన్ని బెస్ట్ హెయిర్ మాస్క్ ఉన్నాయి.

Effective Hair Masks That Can Help To Prevent Hair Thinning

జుట్టు రాలడం వల్ల జుట్టు పల్చగా మారడం ప్రస్తుతం అనేక మందిని వేధిస్తున్న సమస్య.అలాంటి వారిలో మీరూ ఒకరైతే ఈ సమస్యను నివారించుకోవడానికి అనేక హెయిర్ మాస్క్ లున్నాయి. ఈ హెయిర్ మాస్క్ లో జుట్టు రాలడం తగ్గించి, పల్చగా మారకుండా నివారిస్తాయి.

జుట్టు పల్చగా మారకుండా నివారించడం కోసం కొన్ని హోం రెమెడీస్ ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఇవి జుట్టు పల్చడకుండా నివారిస్తాయి. మరి అవేంటో తెలుసుకుందాం...

1. గుడ్డు మరియు అలోవెర మాస్క్

1. గుడ్డు మరియు అలోవెర మాస్క్

అలోవెర, మరియు గుడ్డు హెయిర్ మాస్క్ ను ఉపయోగించడం వల్ల జుట్టు పల్చగా మారకుండా ఒత్తైన జుట్టును అందిస్తుంది. ఒక గుడ్డులో వైట్ తీసుకుని, అందులో రెండు స్పూన్ల అలోవెర జెల్ , చిటికెడు పసుపు మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి, జుట్టుకు అప్లై చేసి ఒక గంట ఆరనివ్వాలి. షవర్ క్యాప్ వేసుకోవడం వల్ల గుడ్డు మిశ్రమం కరగకుండా ఉంటుంది. ఒక గంట తర్వాత మన్నికైన షాంపుతో తలస్నానం చేయాలి. జుట్టు రాలడం తగ్గుతుంది.

2. మెంతులతో హెయిర్ మాస్క్

2. మెంతులతో హెయిర్ మాస్క్

మెంతులతో హెయిర్ మాస్క్ వేసుకోవడం వల్ల జుట్టు పల్చబడటం తగ్గుతుంది. హెయిర్ రూట్స్ ను స్ట్రాంగ్ గా మార్చుతుంది. మెంతులు జుట్టును స్ట్రాంగ్ గా మార్చడం మాత్రమే కాదు, చుండ్రును నివారిస్తుంది. జుట్టుకు మంచి పోషణను అందిస్తుంది.కొన్ని మెంతులు తీసుకుని నీళ్లలో వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం వాటిని మెత్తగా పేస్ట్ చేసి అందులో ఒక కప్పు పెరుగు చేర్చి తలకు అప్లై చేయాలి. ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి.

3. స్ట్రాబెర్రీ మరియు బనానా హెయిర్ మాస్క్

3. స్ట్రాబెర్రీ మరియు బనానా హెయిర్ మాస్క్

స్ట్రాబెర్రీస్ మరియు అరటిపండ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ మరియు న్యూట్రీషియన్స్ జుట్టు పల్చగా మారడాన్ని నివారిస్తుంది. ఫ్రూట్స్ తో హెయిర్ మాస్క్ ను ఉపయోగించడం వల్ల జుట్టు పెరుగుతుంది. జుట్టు పల్చగా మారడం నివారిస్తుంది. కొన్ని స్ట్రాబెర్రీ తీసుకుని, స్లైస్ గా కట్ చేసుకోవాలి.

అరటిపండు తీసుకుని, మెత్తగా పేస్ట్ చేయాలి. అందులో ఒక స్పూన్ నిమ్మరసం, పెరుగు మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు హెయిర్ మాస్క్ గా వేసుకుని ఒక గంట తర్వాత చల్లనీళ్లతో తలస్నానం చేయాలి.

4. బనానా హెయిర్ మాస్క్

4. బనానా హెయిర్ మాస్క్

అరటి పండ్లలో ఉండే న్యూట్రీషియన్స్, జుట్టును స్ట్రాంగ్ గా మార్చుతుంది.జుట్టు రాలడం నివారిస్తుంది. బాగా పండిన అరటిపండు తీసుకుని మెత్తగా పేస్ట్ చేయాలి. ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి, నిమ్మరసం, కొబ్బరి నూనె మిక్స్ చేయాలి. ఈ రెండూ మిక్స్ చేసి తలకు మాస్క్ వేసుకోవాలి. 15 నిముషాల తర్వాత చల్లనీళ్లతో తలస్నానం చేయాలి.

5. పెరుగు హెయిర్ మాస్క్

5. పెరుగు హెయిర్ మాస్క్

పెరుగులో యాక్టివ్ ఎజైమ్స్ అధికంగా ఉంటాయి. ఇవి జుట్టును తేమగా ఉంచుతుంది. హెయిర్ రూట్స్ ను స్ట్రాంగ్ గా మార్చుతాయి. మరియు హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది. ఒక కప్పు పెరుగు తీసుకుని, అందులో ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ మిక్స్ చేయాలి. అలాగే అందులో యాపిల్ సైడర్ వెనిగర్ కూడా మిక్స్ చేయాలి. తేనె మిక్స్చేసి అన్ని కలగలుపుకోవాలి. ఈ మాస్క్ ను తలకు అప్లై చేసి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

6. స్ట్రాబెర్రీ మాస్క్

6. స్ట్రాబెర్రీ మాస్క్

స్ట్రాబెర్రీ హెయిర్ మాస్క్ తలలో బ్లాక్ అయిన హెయిర్ పాలీసెల్స్ ను ఓపెన్ చేస్తుంది. హెయిర్ ఫాలీ సెల్స్ శుభ్రం చేసి, జుట్టును సాప్ట్ గా మరియు హెల్తీగా మార్చుతుంది. జుట్టు రాలడం తగ్గిస్తుంది.

5-10 స్ట్రాబెర్రీలను ముక్కలుగా కట్ చేసి, అందులో రెండు టీస్పూన్ల తేనె, ఆలివ్ ఆయిల్, బాదం ఆయిల్ మిక్స్ చేయాలి. ఈ మిశ్రామాన్ని తలకు అప్లై చేసి, 20 నిముషాల తర్వాత చన్నీళ్లతో తలస్నానం చేయాలి.

7. ఆముదం నూనెతో హెయిర్ మాస్క్

7. ఆముదం నూనెతో హెయిర్ మాస్క్

ఒక కప్పు ఆముదం నూనె తీసుకుని అందులో ఒక గుడ్డు మిశ్రమాన్ని , 10 స్పూన్ల బ్రాందీ వేసి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత తలకు అప్లై చేసి 10 నిముషాల తర్వాత తలస్నానం చేయాలి. ఈ మిశ్రమంలో ప్రోటీన్స్, విటమిన్స్ అధికంగా ఉండటం వల్ల తలకు కావాల్సిన పోషణను అందిస్తుంది.

English summary

Effective Hair Masks That Can Help To Prevent Hair Thinning

Simple ingredients in your daily hair care regimen can help benefit your hair in several ways. Read to know about some of the best hair masks to prevent hair thinning.
Story first published: Saturday, May 6, 2017, 15:10 [IST]
Desktop Bottom Promotion