తలలో జిడ్డును పోగొట్టడానికి న్యాచురల్ పదార్థాలతో హెయిర్ ప్యాక్స్

Posted By:
Subscribe to Boldsky

ఏదో ఒక సందర్భంలో ప్రతి ఒక్కరూ ఫేస్ చేసే సమస్య ఆయిల్ హెయిర్. తలస్నానం చేసిన, హెయిర్ ట్రీట్మెంట్స్ తీసుకున్నా జుట్టులో మాత్రం జిడ్డు తగ్గదు. ఈ జిడ్డు తత్వం వల్ల మనిషిలో కాన్ఫిడెన్స్ ను తగ్గిస్తుంది. జిడ్డు జుట్టును మ్యానేజ్ చేయడం కూడా కష్టమే,.

చర్మంలో డ్రై స్కిన్, ఆయిల్ స్కిన్ ఉన్నట్లు, తలలో జుట్టు కూడా డ్రై హెయిర్, ఆయిల్ హెయిర్ సమస్యలుంటాయి. మీ కేశాలకు ఎలాంటి నూనెలు ఉపయోగించకుండానే మీ జుట్టు కూడా జిడ్డుగా, ఆయిలీగా కనబడుతుంటే దీన్ని ఆయిలీ హెయిర్ గా పిలుస్తారు.

ఇలాంటి ఆయిల్ హెయిర్ ను ఏ ఒక్కరూ ఇష్టపడరు. ఒక వేల ఈ సమస్యను తగ్గించుకోవడానికి రోజు తలస్నానం చేస్తే, జుట్టులో ఉండే న్యాచురల్ ఆయిల్ తగ్గిపోయి, జుట్టు డ్యామేజ్ అవుతుంది. తలలో సెబమ్ ఎక్కువగా ఉత్పత్తి అయినప్పుడు జుట్టు జిడ్డుగా మారుతుంది. సెబమ్ హెయిర్ ఫాలీసెల్స్ వేడి వల్ల, కాలుష్యం వల్ల డ్యామేజ్ కాకుండా రక్షణ కల్పిస్తుంది.

తలలో జిడ్డును పోగొట్టడానికి ఎఫెక్టివ్ పదార్థాలు

జుట్టు జిడ్డుగా ఉండటం వల్ల చుండ్రు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, వంటి సమస్యలు పెరుగుతాయి. తలలో ఎక్సెస్ ఆయిల్ ఉత్పత్తి అవ్వడానికి స్ట్రెస్, హార్మోనుల అసమతుల్యతలు, ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్ తీసుకోవడం మొదలగునవి కారణమవుతాయి. తలలో జిడ్డును తొలగించుకోవడానికి రోజూ తలస్నానం ఒక్కటే మార్గమని చాలా మంది అనుకుంటారు.

అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజూ తలస్నానం చేయడం వల్ల హెయిర్ ఫాలీసెల్స్ దెబ్బతింటాయని, దాంతో జుట్టుకు ఎక్కువ నష్టం జరుగుతుందని అంటారు. కాబట్టి, తలలో జిడ్డు తొలగించుకోవడానికి కొన్ని నేచురల్ రెమెడీస్ మన వంటగదిలోనే ఉన్నాయంటున్నారు నిపుణులు..

ఆయిలీ, స్మెల్లీ హెయిర్ కు చెక్ పెట్టే 10 మిరాకిల్ హోం రెమెడీస్..

బేకింగ్ సోడ :

బేకింగ్ సోడ :

బేకింగ్ సోడ తలలో ఎక్సెస్ ఆయిల్ ను గ్రహిస్తుంది. తలలో జిడ్డు లేకుండా హెయిర్ ఫ్రెష్ గా, క్లీన్ గా మార్చుతుంది.

కావల్సినవి:

3 స్పూన్ల బేకింగ్ సోడా

1 క్పు నీళ్ళు

పద్దతి:

1. బేకింగ్ సోడలో కొద్దిగా నీళ్ళు మిక్స్ చేసి చిక్కట పేస్ట్ చేయాలి.

2. ఈ పేస్ట్ ను జుట్టుకు అప్లై చేసి 10 నిముషాలు అలాగే ఉంచాలి.

3. పది నిముషాల తర్వాత చన్నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికొకసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

నిమ్మరసం :

నిమ్మరసం :

స్కిన్ అండ్ హెయిర్ బ్యూటీ కోసం నిమ్మరసంను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. నిమ్మరసంలో ఉండే విటమిన్, మినిరల్స్ , అసిడ్ స్వభావం వల్ల తలలో ఎక్సెస్ సెబమ్ ఉత్పత్తి కాకుండా కంట్రోల్ చేసి తలలో జిడ్డును తొలగిస్తుంది.

కావల్సినవి-

-2 నిమ్మకాయలు

-2 నీళ్ళు

పద్థతి-

1) రెండు కప్పుల నీటిలో రెండు నిమ్మకాయల రసాన్ని పిండాలి

2) ఈ మిశ్రమాన్ని తలకు, కేశాల పొడవునా అప్లై చేసి 5 నిముషాలు అలాగే ఉంచాలి

3) 10 నిముషాల తర్వాత తలస్నానం చేయాలి. ఈ చిట్కాను వారంలో రెండు సార్లు ఫాలో అయితే చాలు మంచి ఫలితం ఉంటుంది.

ఎగ్ వైట్

ఎగ్ వైట్

ఎగ్ వైట్ మంచి కండీషనర్ గా పనిచేస్తుంది. తలలో జిడ్డును తొలగిస్తుంది

కావల్సినవి-

-3 ఎగ్ వైట్

పద్దతి-

1) మూడు గుడ్లు తీసుకుని వాటిలోని తెల్లని పదార్థం మాత్రం ఒక బౌల్లోనికి తీసుకుని బాగా గిలకొట్టాలి

2) దీన్ని జుట్టుకు అప్లై చేసి 30 నిముషాలు అలాగే ఉంచాలి

3) 20 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే జిడ్డు సమస్య ఉండదు.

పురుషుల జుట్టు సమస్యలకు 20 బెస్ట్ హోం రెమడీస్...!

యాపిల్ సైడర్ వెనిగర్

యాపిల్ సైడర్ వెనిగర్

యాపిల్ సైడర్ వెనిగర్ లో ఉండే అసిడిక్ నేచర్ తలలో ఎక్సెస్ ఆయిల్ ఉత్పత్తి కాకుండా నివారిస్తుంది

కావల్సినవి-

-అరకప్పు యాపిల్ సైడర్ వెనిగర్

పద్ధతి -

ఒక మగ్గు నీటిలో కొద్దిగా యాపిల్ సైడర్ వెనిగర్ వేసి బాగా మిక్స్ చేయాలి. షాంపుతో తలస్నానం చేసిన తర్వాత చివరగా యాపిల్ సైడర్ వెనిగర్ కలిపిన నీటితో తలరా పోసుకోవాలి. వెనిగర్ ను నేరుగా జుట్టుకు అప్లై చేయకూడదు. అలా చేస్తే జుట్టు మ్రుదుత్వం కోల్పోతుంది.

టీ

టీ

టీలో ట్యానిక్ యాసిడ్ అనే ఆస్ట్రిజెంట్ ఉండటం వల్ల, ఇది తలలో ఎక్సెస్ నూనె ఉత్పత్తి కాకుండా నివారిస్తుంది .

కావల్సినవి-

-2 టేబుల్ స్పూన్ల టీ ఆకులు

-1 కప్పు నీళ్ళు

పద్దతి-

1) ఒక కప్పు నీటిలో టీ ఆకులను వేసి బాగా ఉడికించాలి

2) తర్వాత నీటితో వడగట్టి పూర్తిగా చల్లారనివ్వాలి.

3) ఈ మిశ్రమాన్ని తలకు, జుట్టు పొడవునా అప్లై చేయాలి.

4) కొద్దిసేపటి తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి.

కలబంద

కలబంద

అలోవెరలో తలను శుభ్రం చేసి,తలలో ఎక్సెస్ ఆయిల్, ఇతర మలినాలను, ఇన్ఫెక్షన్స్ ను నివారించే ఎంజైమ్స్ ఉన్నాయి. ఇంకా అలోవెరలో ఉండే విటమిన్స్ , మినిరల్స్ జుట్టును స్మూత్ గా మార్చి, దురద, చుండ్రు తగ్గిస్తుంది. జుట్టును హెల్తీగా మార్చుతుంది.

కావల్సినవి -

-1 టేబుల్ స్పూన్ అలోవెర జెల్

-1 టీస్పూన్ నిమ్మరసం

పద్దతి -

1) పైన సూచించిన రెండు పదార్థాలను ఒక బౌల్లోనికి తీసుకోవాలి.

2) ఈ రెండూ పదార్థాలను బాగా మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి. 15 నిముషాలు అలాగే ఉంచాలి

3) 15 నిముషాల తర్వాత తలస్నానం చేయాలి

బీర్

బీర్

ఆల్కహాల్లో డ్రైయింగ్ ఎఫెక్ట్స్ కలిగి ఉన్నాయి. దాంతో తలలో జిడ్డు తగ్గించుకోవచ్చు

కావల్సినవి-

-1 కప్పు బీర్

పద్దతి-

1) ఒక మగ్గు నీటిలో బీర్ మిక్స్ చేయాలి. తలస్నానం చేసిన తర్వాత చివరగా నీటిని తలకు పోసుకోవాలి.

పుదీనా

పుదీనా

ఆయిల్ స్కిన్ నివారించడంలో పుదీనా సహాయపడుతుంది. పుదీనాలో ఉండే ఆస్ట్రిజెంట్ గుణాలు తలలో ఎక్సెస్ ఆయిల్ ను తొలగించడానికి ఫర్ఫెక్ట్ గా పనిచేస్తుంది.

కావల్సినవి-

- గుప్పెడు పుదీనా ఆకులు

- ఒక గ్లాసు నీళ్ళు

పద్దతి-

1) నీళ్ళలో పుదీనా ఆకులను వేసి 15 నిముషాలు ఉడికించాలి

2) తర్వాత ఒక గిన్నెలోనికి వడగట్టుకుని, చల్లారనివ్వాలి

3) ఈ నీటిని రెగ్యులర్ షాంపుతో మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి.

4) 15 నిముసాల తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి

జుట్టు జిడ్డుగా మారకుండా ఫాలో అవ్వాల్సిన న్యాచురల్ టిప్స్..!

ఓట్ మీల్

ఓట్ మీల్

తలలో జిడ్డును తొలగించడానికి మరో ఫర్ఫెక్ట్ రెమెడీ ఓట్ మీల్ . ఓట్ మీల్ జుట్టులోని జిడ్డును ఎఫెక్టివ్ గా గ్రహిస్తుంది.

కావల్సినవి -

-5-6 టేబుల్ స్పూన్ల ఓట్ మీల్

- ఒక కప్పు నీళ్ళు

పద్ధతి -

1) నీళ్ళలో ఓట్ మీల్ వేసి మెత్తగా ఉడికంచాలి

2) ఈ పేస్ట్ చల్లారిన తర్వాత తలకు అప్లై చేసి పది నిముషాలు అలాగే ఉంచాలి

3) పది నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఈ రెమెడీని వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది

సొరకాయ జ్యూస్

సొరకాయ జ్యూస్

తలలో చుండ్రు, ఇన్ఫెక్షన్స్ నివారించడంలో సొరకాయ జ్యూగ్ బాగా సహాయపడుతుంది.

కావల్సినవి

- సొరకాయ జ్యూస్

- ఫ్రెష్ బీట్ రూట్ జ్యూస్

పద్ధతి

1) ఒక బౌల్లో ఈ రెండు పదార్థాలను వేసి మిక్స్ చేయాలి

2) తలకు అప్లై 10 నిముషాలు తర్వాత తలస్నానం చేయాలి.

3) వారంలో రెండు సార్లు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

హెన్నా

హెన్నా

తలకు హెన్నా అప్లై చేయడం వల్ల తలలో జిడ్డు తగ్గుతుంది.

కావల్సినవి-

-హెన్నా పౌడర్ ఒక బౌల్లోనికి తీసుకోవాలి

- సరిపడా నీళ్లు

తయారుచేయు విధానం-

1) హెన్నా పౌడర్ ను మీ జుట్టుకు సరిపడా ఒక బౌల్లో తీసుకోవాలి

2) తర్వాత అందులో నీళ్ళు పోసి పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ను తలకు అప్లై చేసి, కనీసం రెండు గంటల సమయం అలాగే ఉంచాలి

3) రెండు గంటల తర్వాత తలస్నానం చేయాలి

English summary

Effective Ingredients To Use For Oily Hair And Scalp This Monsoon

Effective Ingredients To Use For Oily Hair And Scalp This Monsoon,Here is a list of ingredients you can find in the kitchen, which will help keep your greasy scalp and hair, fresh and clean.
Story first published: Friday, August 11, 2017, 17:14 [IST]
Subscribe Newsletter