జుట్టు రాలకుండా అదుపులో ఉంచే సింపుల్ చిట్కాలు

Posted By:
Subscribe to Boldsky

జుట్టు ఊడుతుంటే చిన్నవాళ్ల దగ్గరి నుంచి పెద్దవాళ్ల దాకా ఆందోళన పడుతుంటారు. జుట్టు ఊడితే ఇంకేముంది అందం కాస్తా తరిగిపోతుందని ఆవేదన చెందుతుంటారు. జుట్టు ఊడడానికి చాలా కారణాలే ఉన్నాయి. అలాగే వెంట్రుకలు ఊడిపోకుండా కాపాడుకోవడానికి కూడా మార్గాలున్నాయి.

జుట్టు రాలకుండా అదుపులో ఉంచే సింపుల్ చిట్కాలు

జుట్టు రాలిపోవడానికి కారణాలు

పోషకాహారలోపం, హార్మోన్ల అసమతౌల్యత, థైరాయిడ్‌, పిసివొఎస్‌ కొన్ని ముఖ్య కారణాలు. ఇవే కాదు కడుపుతో ఉన్నప్పుడు, పిల్లలు పుట్టకుండా వాడే పిల్స్‌ వల్ల, విపరీతమైన ఒత్తిడి కారణంగా, అలాగే విషపూరితమైన రసాయనాలున్న హెయిర్‌ ప్రాడెక్టులు వాడడం వల్ల కూడా వెంట్రుకలు బాగా రాలిపోతాయి. అంతేకాదు సన్నగా కనిపించాలని క్రాష్‌ డైట్లు చేయడం, విపరీతంగా లావు తగ్గడం, జడను బిగదీసి వేసుకోవడం, వయసు పెరగడం వంటి వాటి వల్ల కూడా జుట్టు ఊడుతుంది. సి విటమిన్‌ లోపం వల్ల కూడా వెంట్రుకలు రాలిపోతాయి. జుట్టు రాలకుండా అదుపులో ఉంచాలంటే..ఈ సింపుట్ చిట్కాలను ఫాలో అవ్వండి..

జుట్టు రాలడం తగ్గించే హెర్బల్ డికాషన్

జుట్టు రాలడం తగ్గించే హెర్బల్ డికాషన్

పావులీటరు నీటిలో నాలుగు చుక్కల నీలగిరి తైలం, ఐదారు మందారపువ్వులూ, గుప్పెడు చొప్పున మందార ఆకులూ, గుప్పెడు తులసి ఆకుల్ని ఓ గిన్నెలోకి తీసుకుని స్టౌ మీద పెట్టాలి. ఆ నీరు రంగు మారేవరకూ మరిగించి తరవాత వడకట్టాలి. ఈ నీటిని వారానికి ఒకసారైనా తలకు మర్దన చేసుకుని కాసేపయ్యాక కడిగేయాలి.

జుట్టు రాలడం తగ్గించే నిమ్మరసం

జుట్టు రాలడం తగ్గించే నిమ్మరసం

వర్షం, దుమ్ము, థూళికి సాధారణంగా జుట్టు పొడిబారుతుంది. అలా కాకుండా ఉండాలంటే రెండు నిమ్మకాయల రసాన్ని రెండు కప్పుల నీళ్లల్లో వేసి బాగా కలిపి, ఒక సీసాలోకి తీసుకోవాలి. దాన్ని జుట్టుకు రాసుకోవాలి. ఇది పోషణ అందించి.. పట్టులా మారుస్తుంది.

జుట్టు రాలడం తగ్గించే టీపొడీ, కాసిని తులసీ ఆకులు

జుట్టు రాలడం తగ్గించే టీపొడీ, కాసిని తులసీ ఆకులు

కప్పు నీళ్లలో రెండు చెంచాల టీపొడీ, కాసిని తులసీ ఆకులు వేసి బాగా మరిగించాలి. ఆ నీళ్లు సగం అయ్యాక దింపేయాలి. తరవాత ఇవతలకు తీసి..అందులో షాంపూ కలిపి తలస్నానం చేయాలి. జుట్టు ఆరోగ్యంగా, పట్టులా మారుతుంది.

జుట్టు రాలడం తగ్గించే మెంతులు

జుట్టు రాలడం తగ్గించే మెంతులు

జుట్టు రాలడం, పొడిబారడం, చుండ్రు వంటి సమస్యలను నివారించడానికి పావు కప్పు మెంతులను రాత్రంతా పుల్లటి పెరుగులో నానబెట్టి, ఉదయాన్నే పెరుగుతో సహా రుబ్బుకుని తలకు పూతలా వేసుకుని అరగంట తర్వాత తలారా స్నానం చేయాలి. దీనివల్ల జుట్టుకు సంబంధించిన సమస్యలను చాలావరకూ తగ్గించవచ్చు.

జుట్టు రాలడం తగ్గించే వేప నూనె

జుట్టు రాలడం తగ్గించే వేప నూనె

అలాగే తలలో ఏవైనా ఇన్‌ఫెక్షన్లు ఉంటే అలాంటి వాటిని తగ్గించడానికి తలకు వేప నూనె రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. తలకు వేపాకును మెత్తగా నూరి పట్టించినా కూడా సమస్యను నివారించవచ్చు. గోరింటాకును ఇలా వాడినా కూడా మంచి ఫలితం ఉంటుంది.

అలాకాకున్నా వేపాకుల్ని గిన్నెలో సగం వరకూ నీళ్లు తీసుకుని అందులో వేపాకుల్ని వేసి మరిగించి, బాగా చల్లారిన తర్వాత వడగట్టి, ఆ నీటితో తలను కడుక్కున్నా కూడా మంచి ఫలితం ఉంటుంది. జుట్టు రాలే సమస్యను తగ్గించడానికి అరటిపండు గుజ్జును తలకు పట్టించి కాసేపయ్యాక తలస్నానం చేస్తే జుట్టురాలే సమస్య తగ్గుతుంది.

జుట్టు రాలడం తగ్గించే కలబంద గుజ్జు

జుట్టు రాలడం తగ్గించే కలబంద గుజ్జు

కలబంద గుజ్జును కూడా ఇలా తలకు పట్టిస్తే జుట్టు రాలే సమస్యను నివారించవచ్చు. ఇంకా తలస్నానం చేసేముందు కొబ్బరి నూనెను గోరువెచ్చగా కాచి తలకు రుద్దుకుని మర్దనా చేసుకుంటే కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేయడం వల్ల తలకు బాగా రక్తప్రసరణ జరిగి జుట్టు కుదుళ్లు గట్టిపడతాయి.

జుట్టు రాలడం తగ్గించే ఉల్లిరసం

జుట్టు రాలడం తగ్గించే ఉల్లిరసం

ఉల్లిరసం వల్ల కూడా జుట్టు ఊడడం తగ్గుతుంది. ఉల్లిలో సల్ఫర్‌ బాగా ఉంటుంది. ఇది జుట్టు కుదుళ్లకు రక్తం బాగా సరఫరా అయ్యేట్టు చేస్తుంది. ఉల్లిరసంలోని యాంటిబాక్టీరియల్‌ గుణాలు తలలోని బాక్టీరియా, ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. అందుకే ఉల్లిపాయను గ్రైండ్‌ చేసి ఆ గుజ్జు నుంచి రసం తీయాలి. ఆ రసాన్ని తలకు రాసుకుని అరగంటపాటు అలానే ఉంచుకోవాలి. ఆ తర్వాత నీటితో వెంట్రుకలను బాగా కడుక్కుని షాంపుతో తల రుద్దుకోవాలి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Hair fall treatment at home- 7 remedies that work!

    Hair fall problem? Looking for a treatment that works without the side-effects of chemicals or medications? You should try these home remedies. According to hair experts, losing 50-100 strands of hair every day is fairly normal. It is only a cause of concern when you lose more than that.
    Story first published: Saturday, September 2, 2017, 13:35 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more