ఈ మాస్క్ ని ఉపయోగించి జుట్టు రాలడాన్ని తగ్గించుకోండి

Posted By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

జుట్టురాలడమనేది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలను కలవర పెడుతున్న ఒక సాధారణ సమస్య గా మారింది. మీ జుట్టుకి ఇలాంటి అఘోరమైన పరిస్థితి రావడానికి అనేక రకాల కారణాలున్నాయి.

జన్యుపరమైన రోగాలు, ఆరోగ్య సంబంధిత సమస్యలు, అసమతుల్య ఆహారం, జీవనశైలి అలవాట్లు, వేడి స్టైలింగ్ టూల్స్ యొక్క అధిక వినియోగం మొదలైనవి, జుట్టు పతనానికి కారణాలుగా వున్నాయి.

మన రోజువారీ జీవితంలో ప్రతిరోజు కొన్ని వెంట్రుకలు రాలడమనేది మనందరికీ తెలిసిన సాధారమైన విషయమే. కానీ మితిమీరిన విధంగా జుట్టు రాలడం అనేది మీ జుట్టు పతనానికి సంకేతమని మీరు గుర్తించాలి మరియు ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీరు ఈ అంశంపై ఒక కన్ను వేయడం అవసరమని గుర్తించాలి. ఒకవేళ మీరు దీనిని విస్మరిస్తే ఇది మీ జుట్టు సమస్యని మరింత పెంచుతుంది. అప్పుడు మీ జుట్టుకు తిరిగి పొందలేని నష్టం వాటిల్లవచ్చు. కాబట్టి దీనినుండి బయట పడటానికి ఇక్కడ కొన్ని రెసిపీలు వున్నాయి అవేంటో ఇప్పడు తెలుసుకుందాం...

how to make homemade hair fall mask

ఇంట్లోనే తయారుచేసుకునే హెయిర్ ఫాల్ మాస్క్ రెసిపీ

హెయిర్ ఫాల్ సమస్యకి చికిత్స కోసం పలు సౌందర్య మరియు శస్త్ర చికిత్సలు ఉన్నాయి. ఈ చికిత్సలు తమ సొంత సెట్స్ మరియు సైడ్ ఎఫెక్ట్స్ తో వస్తాయి. కూడా, వారు మీ జేబులో ఒక రంధ్రం బర్న్ చేయవచ్చు.

కాబట్టి, మీరు ఒకవేళ ఒక సురక్షితమైన మరియు చవకైన ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నట్లయితే, ఈ వ్యాసం మీకోసమే. ఇవాళ బోల్డ్ స్కైలో మీరు ఇంట్లోనే సులభంగా తయారుచేసుకునే మాస్క్ ల గురించి తెలియజేశాము. దీనివలన జుట్టురాలే సమస్యనుండి మీరు విముక్తిని పొందవచ్చు.

ఇంట్లో నే తయారుచేసుకునే ఈ హెయిర్ మాస్క్ అన్ని సహజమైన పదార్థాలతోనే తయారు చేయబడుతుంది, ఇందులో జుట్టు కి లాభాన్ని చేకూర్చే యాంటీఆక్సిడెంట్స్ తో నిండివుండటం వలన పాడయిన మీ జుట్టుని సరిచేసి మరియు జుట్టు రాలడాన్ని ఆపుతుంది. ఇది మీ జుట్టుని అన్ని విధాలుగా సమర్ధవంతంగా చూసుకోవడమే కాకుండా, దీనిని ఇంట్లో సిద్ధం చేసుకోవడం కూడా ఎంతో సులభం.

ఇక్కడ, మేము సమర్థవంతమైన ఇంట్లోనే తయారుచేసుకునే ఈ హెయిర్ మాస్క్ గురించి తగిన సమాచారాన్ని వివరించాము. బలమైన కుదుళ్ళని పొందడానికి మరియు మీ జుట్టుని కాపాడటానికి మీ రోజువారీ భాగంగా దీనిని అనుసరించండి.

గమనిక: ఈ మాస్క్ ని మీ జుట్టుకి అప్లై చేసుకునే ముందు ఒకసారి పరీక్షించి తర్వాత వాడటం మంచిది.

జుట్టుకి ఉసిరికాయ పొడిని వాడటం వలన కలిగే ప్రయోజనాలు:

జుట్టుకి ఉసిరికాయ పొడిని వాడటం వలన కలిగే ప్రయోజనాలు:

ఉసిరికాయ పొడి అనేది ఒక సాంప్రదాయ జుట్టు సంరక్షణ పదార్థంగా చెప్పవచ్చు, ఇది ఎల్లప్పుడూ జుట్టు రాలడమనే సమస్యకి నిజమైన చికిత్సగా పనిచేస్తుంది. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది, ఇది దెబ్బతిన్న జుట్టు కుదుళ్ళని చికిత్స చేసి మరియు జుట్టు కుదుళ్ళని బలపరుస్తుంది.

జుట్టుకి కుంకుడుకాయల వలన కలిగే ప్రయోజనాలు:

జుట్టుకి కుంకుడుకాయల వలన కలిగే ప్రయోజనాలు:

గాలిలో ఉన్న టాక్సిన్లు మరియు కాలుష్యాల నుండి మీ జుట్టు కుదుళ్ళని కాపాడుకునే యాంటీఆక్సిడెంట్ ఎంజైమ్లతో కుంకుడుకాయ నిండి ఉంటుంది.

అంతేకాకుండా, మీ జుట్టు రాలడాన్ని తగ్గించి మరియు జుట్టు విఘటనను కలిగించే విషమును నివారిస్తుంది.

జుట్టుకి రోజ్ వాటర్ వలన కలిగే ప్రయోజనాలు :

జుట్టుకి రోజ్ వాటర్ వలన కలిగే ప్రయోజనాలు :

పాడయిన జుట్టుకి చికిత్స చేయడంలో రోజ్ వాటర్ అన్ని వేళల్లో సహాయపడుతుంది. ఇది మీ జుట్టు కుదుళ్ళని చైతన్యం నింపుతుంది మరియు ఇది మొత్తం పిహెచ్ సమతుల్యతను స్థిరీకరించవచ్చు.

ఇంతేకాకుండా, ఇది స్కాల్ప్ లోని చుండ్రుని తొలగించి మీ జుట్టుని ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

ఈ హోమ్మేడ్ మాస్క్ ల వల్ల ప్రయోజనాలు:

ఈ హోమ్మేడ్ మాస్క్ ల వల్ల ప్రయోజనాలు:

పైన తెలిపిన మాస్క్ లను మీ జుట్టుకి తరచూ ఉపయోగించడం వలన మీ జుట్టుకి అద్భుతాలు చేయవచ్చు. ఈ మాస్క్ మీ జుట్టు కుదుళ్ళ నుండి బలపరిచి జుట్టు సమస్యకి ప్రభావవంతంగా పనిచేస్తుంది.

మీకు కావాల్సిన పదార్థాలు:

మీకు కావాల్సిన పదార్థాలు:

1 టీస్పూన్ ఉసిరి పొడి

1 టీస్పూన్ కుంకుడుకాయ పొడి

1/4 వ టీస్పూన్ కర్పూరం పొడి

3 టేబుల్ స్పూన్ల గులాబీ నీరు

తయారీ విధానం:

తయారీ విధానం:

- ఒక ఖాళీ గాజు గిన్నె తీసుకొని మరియు పైన పేర్కొన్న పదార్థాలన్నింటినీ కలపండి.

- పేస్ట్ లాగ వచ్చేవరకు బాగా కలపాలి.

ఎలా ఉపయోగించాలి:

ఎలా ఉపయోగించాలి:

- మీ జుట్టు మీద ఈ మిశ్రమాన్ని రాసుకొని మరియు కాస్సేపు కుదుళ్ళ కి మర్దనా చేయండి.

- దీనిని 10 నిమిషాల పాటు ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.

- మంచి ఫలితాల కోసం వారానికి రెండు మూడు సార్లు ఈ మాస్క్ ని ఉపయోగించండి.

English summary

How To Make Homemade Hair Fall Mask

It's normal to shed a few hair strands on a daily basis. However, excessive shedding can be a sign of a hair fall problem. And, under no circumstance should a person turn a blind eye to this issue, as ignoring it would only further exacerbate the problem and may cause an irreversible damage to your hair.
Story first published: Sunday, December 17, 2017, 11:00 [IST]