హెయిర్ ఫాల్ తగ్గించి, హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి హోం మేడ్ రిసిపిలు

By: Mallikarjuna
Subscribe to Boldsky

జుట్టు సమస్యలు..ప్రతి సంవత్సరం స్త్రీ, పురుషుల్లో ఈ సమస్యలు పెరుగుతున్నాయి తప్పా, ఏమాత్రం తగ్గడం లేదు. జుట్టు సమస్యలకు ప్రధాన కారణం ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, జుట్టు పట్ల సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం. పరిశుభ్రతను పాటించకపోవడం. జుట్టు సమస్యలు రావడం చాలా సులభం, అయితే ట్రీట్మెంట్ అంత సులభం కాదు.

దానికి తోడు డాక్టర్లు ఖరీదైన హెయిర్ లాస్ ట్రీట్మెంట్స్ ను సూచిస్తుంటారు. ఈ ఖరీదైన ట్రీట్మెంట్స్ కంటే హోం రెమెడీస్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. మరి ఆ ఎఫెక్టివ్ హెయిర్ రిగ్రోత్ హోం రెమెడీస్ ఏంటో ఒకసారి తెలుసుకుని తగిన జాగ్రత్తలు తీసుకుందాం...

మ్యాజిక్..!! ఊడిపోయిన జుట్టు పొందడానికి టెస్టెడ్ టెక్నిక్స్

హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి హోం మేడ్ రెమెడీస్

1.ఆపిల్ సైడర్ వెనిగర్ :

1.ఆపిల్ సైడర్ వెనిగర్ :

ఆపిల్ సైడర్ వెనిగర్, సపాల్మెట్టో మరియు టీ ట్రీ ఆయిల్ చాలా పవర్ ఫుల్ హెయిర్ లాస్ ట్రీట్మెంట్ . ఈ మూడింటి కాంబినేషన్ నూనెను వేడి చేసి జుట్టుకు అప్లై చేసి, కొన్ని గంటల పాటు అలాగే వదిలేయాలి. తర్వాత శీకాకాయ, లేదా కుంకుడుకాయ వంటి హెర్బ్ ను షాంపులా తలకు ఉపయోగించి తలస్నానం చేయాలి. ఇలా వారానికొకసారి చేస్తుంటే తలలో సెబమ్, బ్యాక్టీరియా తొలగిపోతుంది.

2. అలోవెర జెల్ :

2. అలోవెర జెల్ :

అలోవెర జెల్ ను వీట్ జర్మ్ ఆయిల్, కోకనట్ మిల్క్ తో కలపాలి. ఈ హెయిర్ ప్యాక్ మూసుకుపోయిన చర్మ రంద్రాలను తెరుచుకునేలా చేసి, శుభ్రం చేస్తుంది. చుండ్రు నివారిస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కేవలం ఒక్కసారి వాడితే చాలు మార్పు తప్పకుండా మీరు గమనిస్తారు.

3. ఆవాలు, మెంతులు :

3. ఆవాలు, మెంతులు :

ఆవాలు, మెంతులు, వేపఆకులు నీళ్ళలో వేసి ఉడికించాలి. ఈ నీటిని వడగట్టి, తలస్నానం చేసిన తర్వాత చివరగా తలారా పోసుకోవాలి. ఈ హెర్బల్ వాటర్ ను తలకు పోసుకోవడం వల్ల తలలో ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉన్నా పోగొడుతుంది. జుట్టు రాలడం తగ్గిస్తుంది.

4. ఉసిరికాయ :

4. ఉసిరికాయ :

ఉసిరికాయ పేస్ట్, నిమ్మరసం, ధనియాలతో సింపుల్ హోం మేడ్ రిసిపి. ఈ కాంబినేషన్ షాంపు వాటర్ ను తలస్నానానికి ఉపయోగిస్తే హెయిర్ బ్రేకేజ్ కాకుండా ఉంటుంది.

చిన్న వయసులో బట్టతలను నివారించే పవర్ ఫుల్ రెమెడీస్

5. బ్రింగరాజ్ ఆయిల్ :

5. బ్రింగరాజ్ ఆయిల్ :

ఆయుర్వేదంలో బ్రింగరాజ్ ఆయిల్ బెస్ట్ హెయిర్ కేర్ ప్రొడక్ట్. ఈ నూనె నువ్వుల నూనె, ఆమ్లా ఆయిల్, మందారం నూనెతో కలిపి తలకు అప్లై చేయడం వల్ల జుట్టుకు మంచి పోషణ అందుంతుంది. జుట్టు స్ట్రాంగ్ గా పెరుగుతుంది. బట్టతలను నివారించడానికి హెయిర్ రీగ్రోత్ అవుతుంది.

6. ఉల్లిపాయ, వెల్లుల్లి :

6. ఉల్లిపాయ, వెల్లుల్లి :

ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం జ్యూస్ ఈ కాంబినేషన్ జ్యూస్ తలలో ఇన్ఫెక్షన్ నివారిస్తుంది. తలలో దురద తగ్గిస్తుంది. జుట్టు రీగ్రోత్ కు సహాయపడుతుంది. వీటిని తలకు ఉపయోగించడం వల్ల తల పొడిబారడం తగ్గతుంది. జుట్టు బలహీన పడకుండా కాపాడుతుంది.

ఈ బ్యూటీ టిప్స్ మాత్రమే కాదు, వీటితో పాటు ప్రోటీనులు ఎక్కువగా ఉండే గుడ్లు, సోయా, పాలు వంటి ఆహారాలను ఇంటర్నల్ గా తీసుకోవడం వల్ల జుట్టుకు మంచి పోషన అందుతుంది. బట్టతల నివారిస్తుంది.

English summary

Homemade Remedies For Hair Regrowth

Baldness in men and women has been increasing year by year. Stress, unhealthy eating and bad hair care may contribute to the problem but treatment isn't easy. Although the doctors suggest expensive hair loss treatments, some homemade remedies are equally effective. Take a look for hair regrowth and get your confidence back in days.
Story first published: Saturday, August 26, 2017, 12:05 [IST]
Subscribe Newsletter