హెయిర్ ఫాల్ తగ్గించే..హెయిర్ గ్రో అవ్వడానికి అలోవెర్ ఎలా ఉపయోగించాలి..?

Posted By: Lekhaka
Subscribe to Boldsky

అలోవెర లేద కలబంద. ఇది ఒక మిరాకిల్ ప్లాంట్ ఇది ఒక అద్భుతమైన గ్రీన్ కాక్టస్ మొక్క. దీన్ని ప్రస్తుతం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇది ఒక యాంటీబ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు కలది. ఇది ఒక అద్భుతమైన మెడిసినల్ ప్లాంట్ ఇది ఒక అద్భుతమైన హోం రెమెడీలా పనిచేస్తుంది. ముఖ్యంగా బ్యూటీ విషయంలో ఇది గ్రేట్ రెమెడీ. అలోవెర జెల్ ను జుట్టుకు అప్లే చేస్తే అద్భుతమైన ఫలితాలను పొదవచ్చు.

కలబంద మొక్క చూడటానికి రెండు అడుగుల మొక్క, గ్రీన్ కలర్లో ఆకులు చాలా మందంగా ముల్లవలే కనిపిస్తుంటుంది. కొద్దిగా చేదు స్వభావం కలది, అందుకే జంతువులు, కీటకాలు ఈ మొక్క జోలికి పోవు, ఈ మొక్క ఆకులలో జెల్ వంటి జిగటగా ఉండే పదార్థం ఉంటుంది. ఇది98శాతం వాటర్ తో తయారుచేయబడి ఉంటుంది.

How To Apply Aloe Vera Gel On Hair

ఈ జెల్ లో అద్భుతమైన, నమ్మ శక్యం కానీ ప్రయోజనాలెన్నో దాగున్నాయి. అలోవెర జెల్లో 20 మినిరల్స్, 12 విటమిన్స్, 18 అమినో యాసిడ్స్, మరియు 200 ఫైటోన్యూట్రీయంట్స్ ఉన్నాయి. ఇన్ని అద్భుత ఔషధ గుణాలున్న అలోవరాను ఓరల్ గా తీసుకోవచ్చు. లేదా ఎక్సటర్నల్ గా స్కిన్ మరియు హెయిర్ కు ఉపయోగించుకోవచ్చు.

ప్రస్తుతం ఈ టాపిక్ లో అలోవెరాను జుట్టుకు ఏవిధంగా ఉపయోగించాలి. అదెలాగో తెలుసుకుందాం..

చుండ్రును కంట్రోల్ చేయడానికి ప్రీషాంపు ట్రీట్మెంట్ :

చుండ్రును కంట్రోల్ చేయడానికి ప్రీషాంపు ట్రీట్మెంట్ :

అలోవెర జెల్ ను తలకు అప్లై చేయడం వల్ల జుట్టు హైడ్రేషన్ లో ఉంటుంది. ఇందులో ఉండే నేచురల్ ఎంజైమ్స్ డెడ్ సెల్స్, ఫంగస్, చుండ్రు నివారిస్తుంది.

అలోవెరాను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల షాంపులాగ పనిచేసే తలలో చుండ్రును నివారిస్తుంది.

అలోవెరలీప్ ను కట్ చేసి, అందులోనుండి జెల్ తీసుకోవాలి.ఈ జెల్ ను స్మూత్ పేస్ట్ లా బ్లెండ్ చేసి, పేస్ట్ ను తలకు అప్లై చేసి 10 నిముషాల తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి.

అలాగే అలోవెర జెల్ ను కొబ్బరి పాలతో గ్రైండ్ చేసి , అందులో వీట్ జర్మ్ ఆయిల్ మిక్స్ చేసి, తలకు పట్టిస్తే షాంపు ట్రీట్మెంట్ లా పనిచేస్తుంది.

షాంపు ట్రీట్మెంట్ :

షాంపు ట్రీట్మెంట్ :

మార్కెట్లో ఉండే షాంపు కెమికల్స్ తో తయారుచేయడం వల్ల జుట్టుకు అంత మంచిది కాడు,అందు వల్ల నేచురల్ గా అలోవెర జెల్ ను ఉపయోగించుకోవచ్చు. తలస్నానం చేయడానికి ముందు అలోవెర జెల్ ను షాంపుతో పాటు ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల జుట్టు తేమగా ఉంటుంది.

నేచురల్ కండీషనర్ :

నేచురల్ కండీషనర్ :

అలోవెర జెల్లో ఉండే మాయిశ్చరైజింగ్ గుణాలు జుట్టుకు అద్భుతమైన కండీషనర్ గా పనిచేస్తుంది. జుట్టును సిల్కీగా, షైనీగా , స్మూత్ గా మార్చుతుంది. కొద్దిగా అలోవెర జెల్ తీసుకుని స్మూత్ పేస్ట్ లా చేయాలి. ఈపేస్ట్ ను జుట్టు మొత్తానికి అప్లై చేయాలి. ఇది షాంపు వలే పనిచేస్తుంది. . ఈ జెల్ ను 15నుండి 20 నిముషాలు ఉంచుకుని, తర్వాత మన్నికైన షాంపుతో తలస్నానం చేసుకోవాలి.

ఇన్ స్టాంట్ హెయిర్ స్టైలింగ్ :

ఇన్ స్టాంట్ హెయిర్ స్టైలింగ్ :

ఈ జెల్ ను హెయిర్ సెరమ్ లా ఉపయోగిస్తుంటారు. జుట్టుకు మంచి స్టైల్ అందిస్తుంది. దీర్ఘకాలంలో డ్యామేజ్ అయిన జుట్టును రిపేర్ చేస్తుంది. జుట్టును స్టైల్ గా మార్చుతుంది, కర్లీ హెయిర్ ను కూడా మ్యానేజ్ చేసేలా చేస్తుంది.

కొన్ని నిముషాల తర్వాత తలస్నానం చేస్తే తలోల అవాంఛిత మురికిని, జిడ్డును, తొలగిస్తుంది. జుట్టును స్టెయిట్ గా స్టైలిష్ గా మార్చుతుంది.

జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది:

జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది:

రాత్రికిరాత్రి హెయిర్ ట్రీట్మెంట్ అలోవెర మాస్క్ ఫెంటాస్టిక్ హోం రెమెడీ. ఇది డ్రై అండ్ డ్యామేజ్, అన్ మ్యానేజబుల్ జుట్టుకు గ్రేట్ గా సహాయపడుతుంది.

అలోవెర లీఫ్ ను కంట్ చేసి, అందులో నుండి జెల్ ను స్పూన్ తో తీసి దీనికి మెంతి పౌడర్, ఆముదం , ఒక స్పూన్ తులసి పౌడర్ మిక్స్చేసి మెత్తగా పేస్ట్ చేసి జుట్టుకు అప్లై చేయాలి. దీన్ని రాత్రి తలకు అప్లై చేసి, ఉదయం షాంపుతో తలస్నానం చేసుకోవాలి.

English summary

How To Apply Aloe Vera Gel On Hair

Get to know the ways in which you can include aloe vera gel in your regular hair care regimen, with the help of this article.
Story first published: Thursday, May 4, 2017, 10:00 [IST]
Subscribe Newsletter