Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
జుట్టు రాలడం తగ్గించి, పొడవుగా పెరగడానికి ఎగ్ హెయిర్ ప్యాక్స్
గుడ్డుఒక అద్భుతమైన ఆహార పదార్థం . ఆరోగ్యానికి మాత్రమే కాదు, సౌందర్యానికి కూడా చాలా గ్రేట్ గా పనిచేస్తుంది. ఇందులో ఉండే సహజసిద్ద గుణాల ఆధారంగా దీన్ని జుట్టుకు విరివిగా ఉపయోగిస్తున్నారు. గుడ్డును జుట్టుకు అప్లై చేయడం ద్వారా జుట్టుకు మంచి షైనింగ్, అందంగా మరియు వాల్యూమనస్ గా ఉంటుంది. జుట్టు దుర్వాసన లేకుండా ఉండాలంటే గుడ్డులోని తెల్లసొన మాత్రమే ఉపయోగించి . ఎగ్ వైట్ లో ప్రోటీలనులు మరియు క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఇవి జుట్టును మరియు జుట్టు మూలాలకు తగిన బలాన్ని చేకూర్చుతాయి.

మీరు మరేదైన జుట్టు సమస్యతో బాధపడుతున్నట్లైతే మీ జుట్టుకు ఉపయోగించే అత్యంత అవసరమైన పదార్థాల్లో గుడ్డు ఒకటి. వారంలో రెండు సార్లు మీ జుట్టుకు ఎగ్ వైట్ ను ఉపయోగించడం వల్ల మీ జుట్టు చూడటానికి అందంగా కనిపిస్తుంది . గుడ్డు ఉపయోగించేటప్పుడు జుట్టుకు కెమికల్స్ తో తయారుచేసిన షాంపులను ఉపయోగించకూడదు . ఇది మీ జుట్టు మీద ప్రభావం చూపుతుంది మరియు సమస్యను మరింత తీవ్రం చేస్తుంది.
జుట్టు మరింత అందంగా తీర్చి దిద్దుకోవడానికి ఎగ్ ను ఏవిధంగా ఉపయోగించాలి అన్న చిట్కాలను ఈక్రింది విధంగా..

గుడ్డు, నిమ్మరసం
ఒక గుడ్డులోని తెల్ల సొనలో రెండు చెంచాలా నిమ్మరసం మిక్స్ చేసి, తలకు మరియు కేశాలకు పూర్తిగా పట్టించాలి . ఇది జుట్టు మరింత బెటర్ గా పెరగడానికి సహాయపడుతుంది.

గుడ్డు మరియు టమోటో జ్యూస్
చుండ్రును నివారించుకోవడానికి, గుడ్డులోని తెల్లసొన మరియు టమోటో జ్యూస్ కాంబినేషన్ ఉత్తమం. కేవలం ఈ పేస్ట్ ను మీ కేశాల మొత్తానికి అప్లై చేసి 15 నిముషాల తర్వాత తలస్నానం చేసేసుకోవాలి.

గుడ్డు , వేపనూనె:
తలకు వేప నూనె మరియు గుడ్డులోని తెల్ల సొనతో మసాజ్ చేసుకొన్నప్పుడు తలలో పేలు సమస్య తగ్గుతుంది. ఈ హెయిర్ కేట్ చిట్కా తలదురదను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

గుడ్డు మరియు రోజ్ వాటర్
రోజ్ వాటర్ ను గుడ్డులోని తెల్లసొనతో చేర్చడం అనేది ఒక ఉత్తమ చిట్కా . ఇది హెయిర్ కు మరింత బెటర్ గా పనిచేస్తుంది. ఈ మిశ్రమాన్ని రాత్రుల్లో తలకు పట్టించడం వల్ల మరింత ఉత్తమ ఫలితం ఉంటుంది. రోజ్ వాటర్ మీ జుట్టుకు మరింత షైనింగ్ ను అందిస్తుంది.

గుడ్డు మరియు తేనె
తేనె మరో ఉత్తమ నేచురల్ హోం రెమెడీ . మీ జుట్టును ఆరోగ్యంగా మరియు నేచురల్ గా పెంచుకోవాలనుకుంటే, మీ గుడ్డు తెల్లసొనలో కొద్దిగా తేనె మిక్స్ చేసి తలకు పట్టించి 20 నిముషాల తర్వాత తలస్నానం చేసుకోవాలి.

గుడ్డు మరియు పాలు
మీ జుట్టు పొడిబారి మరియు బ్రౌన్ కలర్ ఉంటే నేచురల్ గా మారడానికి పాలు మరో ఉత్తమ హోం రెమెడీ . ఎగ్ వైట్ ను పాలతో మిక్స్ చేసి తలకు పట్టించడం వల్ల ఇది హెయిర్ వాల్యూమ్ ను పెంచుతుంది .

గుడ్డు, బాదం ఆయిల్
బాదం ఆయిల్ మరియు గుడ్డులోని తెల్లసొనను మిక్స్ చేసి తలకు పట్టించాలి. పట్టించిన తర్వాత తలకు మసాజ్ చేయాలి. ఒక గంట తర్వాత తలస్నానం చేయడం వల్ల ఇది హెయిర్ రూట్స్ కు మంచి ట్రీట్మెంట్.



Click it and Unblock the Notifications