TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
తలకు ఏవిధంగా నూనెను పెట్టుకుంటే జుట్టు పాడవకుండా, ఆరోగ్యంగా పెరుగుతుంది..
తలకు నూనె అప్లై చేయడం వల్ల జుట్టుకు కావల్సిన ప్రయోజనాలు అందుతాయి. కాబట్టి, తలకు నూనె ఏవిధంగా పెట్టుకోవాలో ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఏ సమయంలో అయినా జుట్టు పాడవడం, లేదా జుట్టు రాలే సమస్యకు దారితీస్తుంది. ఇది ఆరోగ్యానికి ఒక ఉత్తమ మార్గం.
రెగ్యులర్ గా తలకు నూనె అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గి, రిలాక్స్ చేస్తుంది. .అయితే జుట్టుకు ఆయిల్ ఆప్లై చేయడంలో కొన్ని మెలుకువలు పాటిస్తే మంచిది. మరి తలకు నూనె అప్లై చేయడానికి ముందు మీరు తెలుసుకోవల్సిన కొన్ని చిట్కాలు...
1. నూనెను గోరువెచ్చగా చేయాలి:
తలకు నూనె అప్లై చేయడానికి ముందు గోరువెచ్చగా చేసి, చేతి వేళ్ళతో జుట్టు మొదళ్లకు అప్లై చేసి మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టుకు మంచి పోషణ అందుతుంది. తలలో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. దాంతో జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
2. ఆయిల్ మిక్స్ :
రెగ్యులర్ గా పెట్టుకొనే కొబ్బరి నూనెనుకు ఇతర ఎసెన్సియల్ ఆయిల్స్ మిక్స్ చేయడం వల్ల జుట్టు పెరుగుదలలో ఫలితాలు రెట్టింపుగా ఉంటాయిజ . అందుకు బాదం ఆయిల్ , లావెండర్ ఆయిల్ ను ఉపయోగించుకోవచ్చు.
3. మసాజ్ :
తలకు నూనె అప్లై చేసిన తర్వాత సున్నితంగా మసాజ్ చేయాలి. మసాజ్ చేసిన తర్వాత జుట్టును టైట్ గా ముడివేయకుండా, వదులుగా వేసుకోవాలి. లేదంటే జుట్టు డ్యామేజ్ అవ్వడం, హెయిర్ ఫాల్ జరుగుతుంది.
4. జుట్టును మరీ టౌట్ గా వేయకూడదు:
ఆయిల్ అప్లై చేసిన తర్వాత జుట్టుకు టైట్ గా హెయిర్ బ్యాండ్స్, ఇతర పిన్స్ ను ఉపయోగించకూడదు. తలకు నూనె అప్లై చేసిన తర్వాత లూజ్ గా కొప్పు వేసుకుంటేమంచిది.
5. ఆయిల్ పెట్టుకోవడానికి ముందు తలను చిక్కులేకుండా దువ్వాలి:
తలకు నూనె అప్లై చేయడానికి ముందు చిక్కు, ముడులు లేకుండా తలను దువ్వాలి. చిక్కు తియ్యకుండా ఆయిల్ అప్లై చేయడం మంచిది కాదు.
6. నూనె అప్లై చేసిన తర్వాత కొద్ది సేపు అలాగే వదిలేయాలి:
తలకు నూనె అప్లై చేసిన తర్వాత కనీసం ఒక గంట సేపైనా అలాగే వదిలేయాలి. రాత్రుల్లో పెట్టుకుని, ఉదయం తలస్నానం చేసినా మంచిదే.