చిట్లిన జుట్టుకు ఇంట్లో సులభంగా తయారుచేసుకునే హెయిర్ మాస్క్

Subscribe to Boldsky

ఒత్తైన శిరోజాలు మీ అందాన్ని రెట్టింపు చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. శిరోజాల విషయంలో ఏ చిన్న సమస్యైనా మన అఫియరెన్స్ పై ప్రభావం చూపుతుంది.

ప్రత్యేకించి, స్ప్లిట్ ఎండ్స్ సమస్య శిరోజాల అందాలను దెబ్బతీస్తుంది. జుట్లు చివర్లను కత్తిరించడం తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలిగిస్తుంది. అయితే, ఈ పద్దతి స్ప్లిట్ ఎండ్స్ సమస్యను పూర్తిగా అరికట్టదు. స్ప్లిట్ ఎండ్స్ సమస్య మళ్ళీ మళ్ళీ వేధించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

ముందుగా, అసలు ఈ స్ప్లిట్ ఎండ్స్ సమస్యకు ఎందుకు గురవ్వాల్సి వస్తుందో మనం తెలుసుకోవాలి. హెయిర్ కేర్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయం ప్రకారం శిరోజాల యొక్క వెలుపలి పొర దెబ్బతిన్నప్పుడు ఈ సమస్యకు గురికావలసి వస్తుంది. బలహీనమైన అలాగే దెబ్బతిన్న శిరోజాలు జీవంలేనట్టు కనిపిస్తూ మీ అందాన్ని దెబ్బతీస్తాయి.

అందువలన, స్ప్లిట్ ఎండ్ సమస్య నుంచి రక్షణ కోసం దెబ్బతిన్న శిరోజాలను సంరక్షించడం ప్రారంభించాలి. బ్యూటీ స్టోర్స్ లో స్ప్లిట్ ఎండ్ సమస్యను నివారించడానికి అనేకమైన ప్రోడక్ట్స్ అందుబాటులో కలవు. అయితే, అవి ఎంతవరకు మన శిరోజాలను దెబ్బతీయకుండా సత్ఫలితాలను ఇస్తాయో తెలియదు.

ఎందుకంటే, మార్కెట్ లో లభించే చాలా ప్రాడక్ట్స్ కెమికల్స్ తో తయారయినవి. ఈ కఠినమైన కెమికల్స్ ని వాడడం వలన శిరోజాలు మరింతగా దెబ్బతినే ప్రమాదం కలదు. కాబట్టి, శిరోజాల సంరక్షణకై ఇటువంటి ప్రాడక్ట్స్ కి దూరంగా ఉండటమే మంచిది.

అందుకే, ఈ స్ప్లిట్ ఎండ్స్ సమస్యను పూర్తిగా నిర్మూలించడానికి సహజసిద్ధమైన చికిత్సా విధానాలను పాటించడమే మంచిది. నేచురల్ ట్రీట్మెంట్స్ ను పాటించడం ద్వారా మీ శిరోజాలను ఇబ్బందిపెట్టకుండా చక్కగా సంరక్షించుకోవచ్చు.

అదృష్టవశాత్తు, ఈ సమస్యను అధిగమించడానికి వివిధ రకాల హోమ్ రెమెడీస్ కలవు. అయితే, ఈ హోమ్ రెమెడీస్ లో మరింత ప్రభావవంతమైన రెమెడీ గురించి ఇవాళ తెలుసుకుందాం...

షికాకాయ్ పొడి, ఉసిరి పొడి, కొబ్బరి పాలవంటి శిరోజాలకు సంరక్షణని అందించే అద్భుతమైన పదార్థాలతో తయారైన హోమ్ మేడ్ హెయిర్ మాస్క్ గురించి ఇవాళ తెలుసుకుందాం. ఈ రెమెడీని ఇప్పటి వరకు మీరు వాడి ఉండరు.

ఈ మాస్క్ ని అప్లై చేయడం ద్వారా దెబ్బతిన్న శిరోజాలను రిపైర్ చేసి స్ప్లిట్ ఎండ్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అంతే కాకుండా, ఈ మాస్క్ ద్వారా శిరోజాలకు సంపూర్ణ పోషణ కూడా లభిస్తుంది.

అతి ముఖ్యంగా, ఈ మాస్క్ ని ఎంతో సులభంగా తయారుచేసుకోవచ్చు. శిరోజాలకు పోషణనిచ్చే గుణాలు కలిగిన ఈ మాస్క్ ను అప్లై చేయడం ద్వారా మీ శిరోజాల సౌందర్యాన్ని రెట్టింపు చేసుకోవచ్చు.

ఇవాళ, బోల్డ్ స్కై మీకు ఈ అద్భుతమైన స్ప్లిట్ ఎండ్స్ హెయిర్ మాస్క్ ని ఎలా చేయాలో ఎంతో విపులంగా తెలియచేస్తుంది.

స్ప్లిట్ ఎండ్స్ సమస్యకు గల కారణాలు:

స్ప్లిట్ ఎండ్స్ సమస్యకు గల కారణాలు:

ఈ హెయిర్ మాస్క్ ను తయారు చేసే విధానం తెలుసుకునే ముందు మనం ఈ స్ప్లిట్ ఎండ్ సమస్యకు దారి తీసే కారణాల గురించి తెలుసుకుందాం...

హీట్ స్టైలింగ్ టూల్స్ ని అతిగా వాడడం ఈ సమస్యకు దారితీసే ప్రధాన కారణం. అలాగే, జుట్టును కఠినంగా దువ్వడం, జన్యులోపాలు, అతిగా శిరోజాలను వాష్ చేయడం, కెమికల్స్ నిండిన హెయిర్ ప్రోడక్ట్స్ ను అతిగా వాడడం వంటివి ఈ సమస్యకు దారితీసే మరికొన్ని కారణాలు.

ఈ హెయిర్ మాస్క్ లో వాడిన పదార్థాల యొక్క ప్రయోజనాలు:

ఈ హెయిర్ మాస్క్ లో వాడిన పదార్థాల యొక్క ప్రయోజనాలు:

ఉసిరి పొడి, రీటా పౌడర్ అలాగే షీకాకాయ్ పొడిలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ కలవు. అందువలన, ఈ హెయిర్ మాస్క్ తయారీలో వీటిని వాడడం వలన దెబ్బతిన్న జుట్టు మళ్ళీ మాములు స్థితికి చేరుకుంటుంది. మరోవైపు, కొబ్బరిపాలలో శిరోజాలకు సంరక్షణనిచ్చే పోషకవిలువలు అధికంగా ఉంటాయి.

శిరోజాల పోషణకి అవసరమయ్యే ప్రోటీన్ లు అలాగే విటమిన్లు పాలలో అధికంగా ఉంటాయి.

ఈ మాస్క్ వాడడం వలన కలిగే ప్రయోజనాలు

ఈ మాస్క్ వాడడం వలన కలిగే ప్రయోజనాలు

ముందుగా వివరించుకున్న పదార్థాలన్నిటికీ స్ప్లిట్ ఎండ్స్ సమస్యను నిర్మూలించే శక్తి ఉంది. అంతే కాకుండా, ఈ మాస్క్ ను అప్లై చేయడం ద్వారా జుట్టుకి మొదళ్ళ నుంచి సంపూర్ణమైన పోషణ లభిస్తుంది. తద్వారా, మీ శిరోజాలు ఒత్తుగా, దృఢంగా మెరిసిపోతాయి.

కావలసిన పదార్థాలు

కావలసిన పదార్థాలు

 • ఉసిరిపొడి - ఒక టీస్పూన్
 • కొబ్బరి పాలు - 3 టీస్పూన్లు
 • రీటా పౌడర్ - ఒక టీస్పూన్
 • షీకాకాయి పౌడర్ - ఒక టీస్పూన్
 • పాలు - ఒక టీస్పూన్
తయారుచేసే విధానం:

తయారుచేసే విధానం:

ఒక గాజుపాత్రను తీసుకొని ఇప్పుడు చెప్పుకోబడిన పదార్థాలన్నిటినీ అందులో వేయండి. ఈ పదార్థాలన్నీచక్కగా కలిసే వరకు బాగా కలపండి.

ఉపయోగించే విధానం:

ఉపయోగించే విధానం:

మీ జుట్టు చివర్లకు ఈ మాస్క్ ని అప్లై చేసి కొన్ని నిమిషాల వరకు చక్కగా మసాజ్ చేయండి.

ఇప్పుడు, మీ శిరోజాల మొదళ్ళ వరకు ఈ మాస్క్ ని అప్లై చేయండి. కొన్ని నిముషాలు మసాజ్ చేయండి.

దాదాపు 30 నుంచి 40 నిమిషాల వరకు ఈ మాస్క్ ని మీ శిరోజాలపై ఉండనివ్వండి.

ఆ తరువాత గోరువెచ్చటి నీటితో మీ శిరోజాలను వాష్ చేయండి.

గమనించదగ్గ విషయాలు:

గమనించదగ్గ విషయాలు:

వారానికి రెండు నుంచి మూడు సార్ల వరకూ మీ శిరోజాల సంరక్షణకై ఈ మాస్క్ ను వాడితే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.

ఈ మాస్క్ ని వాడిన మరుసటి రోజు హీట్ స్టైలింగ్ టూల్స్ ని వాడడాన్ని నిరోధించండి.

ఈ మాస్క్ ని అప్లై చేసిన కొన్నిగంటల వరకు అంటే 3 నుంచి 4 గంటల వరకు సూర్యరశ్మి మీ శిరోజాలపై పడకుండా జాగ్రత్తపడండి.

అలాగే, ఈ మాస్క్ ని అప్లై చేసిన తరువాత హెయిర్ కలర్ కి అలాగే డై ప్రాడక్ట్స్ కి దూరంగా ఉండండి.

ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా స్ప్లిట్ ఎండ్స్ సమస్య మళ్ళీ మళ్ళీ రాకుండా జాగ్రత్తపడవచ్చు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  English summary

  homemade split-end mask | how to prepare homemade split-end mask | easy-to-prepare split end mask

  Chopping off the tip of your hair after spotting split ends can only give you a temporary relief from the problem. In order to prevent split ends from occurring in the future, it is essential to treat it. This homemade remedy to treat split ends works wonders in treating this issue for good.
  Story first published: Saturday, December 9, 2017, 14:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more